ఆలోచిస్తున్న (కవిత )- -సామల కిరణ్

   

ఔను ఆలోచిస్తున్న!!!!???
డబ్బులున్నోళ్లు
పేదోళ్ల కోసం
ఎందుకు ఆలోచించరని!?

తల్లిదండ్రులు
పిల్లల సంస్కారం కోసం
ఎందుకు ఆలోచించరని!?

ఎదిగిన పిల్లలు
తల్లిదండ్రుల కోసం
ఎందుకు ఆలోచించరని!?

ఉపాధ్యాయులు
విద్యావిలువల కోసం
ఎందుకు ఆలోచించరని!?

విద్యార్థులు
జ్ఞానసముపార్జన కోసం
ఎందుకు ఆలోచించరని!?

నాయకులు
ప్రజాసంక్షేమం కోసం
ఎందుకు ఆలోచించరని!?

యువతరం
సామాజిక బాధ్యతల్ని
ఎందుకు ఆలోచించరని!?

ప్రజలు
సమర్థప్రభుత్వాల కోసం
ఎందుకు ఆలోచించరని!?

నేను ఆలోచిస్తున్న!
నాలో నేను అవలోకిస్తున్న!!
అంతరాత్మతో తో నేను అన్వేషిస్తున్న!
(అందరిని ఉద్దేశించి కాదు)
                                                                        -సామల కిరణ్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Comments are closed.