ఇంగ్లాండ్ కాల్పనికవాద కవయిత్రి –ఎలిజబెత్ బారెట్ బ్రౌనింగ్ -గబ్బిట దుర్గా ప్రసాద్

6-3-1806న జన్మించిన ఎలిజబెత్ బారెట్ బ్రౌనింగ్ ఇంగ్లాండ్ లోని డర్హా౦ లో తండ్రి కున్న పన్నెండుగురు సంతానం లో పెద్దది .ఆరో ఏటనుంచే కవిత్వం రాసింది .ఆమె కవితలన్నిటిని తల్లి జాగ్రత్త చేసి ఉంచింది .ఈ కవితా సంపుటి ఇప్పటికీ సజీవంగా ఉంది .ఆంగ్లకవుల కవితా సంపుటాలలో ఇంతటి సజీవ కవితా సంపుటం లేనే లేదు .పదిహేనవ ఏటనే ఆమెకు తీవ్రమైన తలనొప్పి, వెన్ను నొప్పి వచ్చి జీవితాంతం బాధించాయి .తర్వాత కాలం లో ఊపిరి తిత్తుల సమస్యలేర్పడి క్షయ వ్యాధికి గురైంది .బాధ నివారణకుచిన్నప్పటి నుంచే ‘’లాడనం ‘’వాడటం మొదలెట్టింది .ఇది ఆమె ఆరోగ్యాన్ని మరింత కుంగదీసింది .1937-38లో తీవ్ర అనారోగ్యానికి గురైంది లండన్ వదిలి టార్క్వె లో ఉంది .1940లో ఆమె సోదరుడు సామ్యుల్ జమైకాలో జ్వరం తో చనిపోవటం ,మరో సోదరుడు ఎడ్వర్డ్ పడవ ప్రమాదం లో మరణించటం ఆమెను తీవ్రంగా కలచి వేసి ఆరోగ్యాన్ని మరింత దెబ్బ తీశాయి . వంటరిగా పై అంతస్తులో ఉంటూ నెమ్మదిగా కోలుకోన్నది

ఎలిజబెత్ యవ్వనం లో ఉండగా మొదటి కవితా సంపుటి ప్రచురించింది .1840లో ఆమె 36 వ ఏట సంపన్నుడైన ఆమె కజిన్ జాన్ కెన్యాన్ సాహిత్య సంస్థకు పరిచయం చేశాడు.ఆమె కు తోడుగా ఒక కుక్క ‘’ఫ్లష్ ‘’ను ఇచ్చాడు. దీన్ని అపురూపంగా ఆమె పెంచుకొన్నది .ఈ కుక్క చరిత్రను వర్జీనియా ఉల్ఫ్ ‘’ఫ్లష్,ఎ బయాగ్రఫి ‘’గా రాసింది .1841నుండి మూడేళ్ళు నిరంతరంగా కవిత్వం, వచనం ,రాస్తూ అనువాదాలూ చేసింది .1942లో ‘’ది క్రై ఆఫ్ ది చిల్డ్రన్ రాసి ప్రచురించింది .దీనిలో బానిసత్వాన్ని ఎదిరిస్తూ బాలకార్మిక వ్యతిరేక చట్ట సాధనకు తీవ్ర కృషి చేసింది .ఇదే సమయం లో ‘’ఎ న్యు స్పిరిట్ ఆఫ్ ది ఏజ్’’ అనే వచన సంపుటి రాసింది . ప్రకృతి కవి విలియం వర్డ్స్ వర్త్ మరణించగానే ,బ్రిటిష్ ఆస్థానకవి పదవికి టెన్నిసన్ కవితో పోటీపడింది .

1844లో ఆమె ప్రచురించిన రెండు కవితా సంపుటులు ‘’ఎడ్రామా ఆఫ్ ఎక్జైల్ ,’’ఎ విజన్ ఆఫ్ పోయెట్స్ ‘’ గొప్ప విజయం సాధించి ఆంగ్ల రచయిత రాబర్ట్ బ్రౌనింగ్ ప్రశంసలు పొందింది ‘ది ఏస్తేనీయం ‘’ విమర్శనాత్మక వ్యాస సంపుటిగొప్ప పేరు తెచ్చింది .బ్రౌనింగ్ ల ఇద్దరిమధ్యా ప్రేమాయణం ఉత్తరాలద్వారా సాగి, ఆమె తండ్రి ఒప్పుకోడేమోనని రహస్యంగా పెళ్లి చేసుకొన్నారు .ఈ పెళ్ళితో తండ్రి ఆమెను దూరం పెట్టి ఆమెకు ఆస్థిలో వారసత్వ హక్కు లేకుండా చేశాడు . బ్రౌనింగ్ దంపతులు ఇంగ్లాండ్ వదిలి 1946లో ఇటలీ వెళ్లి స్థిరపడ్డారు ఆమె దగ్గరున్న డబ్బు తోనే సంసారం గడిఅపారు , ఆమె మళ్ళీ తిరిగి రాలేదు .వీరి కొడుకు ఎలిజబెత్ బర్రేట్ బార్రేట్ .ఇతనిని ముద్దుగా ‘’పెన్ ‘’అని పిలుచుకోనేవారు .

భర్త బ్రౌనింగ్ ప్రోత్సాహం తోప్రేమకు సంబంధించిన ఆమె కిష్టమైన ‘’సాన్నేట్ ‘’లు రాసి విశేష కీర్తి గడించింది .కవిమండలిలో గొప్ప గుర్తింపు పొందింది .విలియం మాక్ పీస్ ,ధాకరే,శిల్పి హారిఎట్ హోస్మర్ ,జాన్ రస్కిన్, కార్లైల్ వంటి ప్రముఖులతో గొప్ప పరిచయాలేర్పడ్డాయి .పాత స్నేహితుడు హంటర్ ,తండ్రి మరణాలు ఆమె ఆరోగ్యం పై ప్రభావం చూఫై ఆరోగ్యం క్షీణించింది .ఫ్లారెన్స్ లో కొంతకాలమున్నారు .1860లో ‘’పోయెమ్స్ బిఫోర్ కాంగ్రెస్ ‘’రాసి భర్త బ్రౌనింగ్ కు అంకితమిచ్చినది ఈ కవితలలో 1859లో ఇటలీ పోరాటాలపై సానుభూతి చూపింది .ఇది ఇంగ్లాండ్ లో కల్లోలం రేపి సాటర్ డే రివ్యు, బ్లాక్ వుడ్ పత్రికలు ఆమెను ‘’మూఢురాలు’’గా ముద్ర వేశాయి .ఆమె చివరి రచన ‘’ఎ మ్యూజికల్ ఇన్ స్ట్రుమెంట్ ‘’ఆమె మరణానంతరం వెలువడింది .

బ్రౌనింగ్ సోదరి హెన్రి ఎట్టా 1860నవంబర్ లో చనిపోయింది .బ్రౌనింగ్ దంపతులు 1960-61లో రోమ్ లో గడిపారు .ఎలిజబెత్ ఆరోగ్యం బాగా క్షీణించగా ఫ్లారెన్స్ కు జూన్ మొదట్లో తిరిగి వచ్చారు.క్రమ౦గా బలహీనురాలౌతూ బాధ మర్చిపోవటానికి మార్ఫిన్ వాడుతూ నరకయాతన అనుభవిస్తూ29-6-1861న కాల్పనికవాద కవయిత్రి ఎలిజబెత్ బార్రెట్ బ్రౌనింగ్ 55వ ఏట భర్త బ్రౌనింగ్ చేతులలో హాయిగా సంతోషంగా చిన్నపిల్లలాగా చివరిమాటగా ‘’బ్యూటిఫుల్ ‘’అంటూ మరణించింది .ఫ్లారెన్స్ లోని’’ ప్రొటేస్టంట్ ఇంగ్లిష్ సెమిటరి ‘’ లో ఆమెను ఖననం చేశారు .

ఎలిజబెత్ కవితలు ఇంగ్లాండ్ అంతటా ,అమెరికాలోనూ బాగా ప్రచారమయ్యాయి .ఆమె ప్రభావం చాలామంది కవులపై ఉంది .అమెరికన్ కవి ఎడ్గార్ అల్లెన్ పో ఎలిజబెత్ రాసిన ‘’లేడి జేరాల్డైన్ కోర్ట్ షిప్ ‘’కవితకు ఆకర్షితుడై ,ఆమె ప్రయోగించిన ఛందస్సును తనకవిత’’ ది రావెన్ ‘’లో ‘ఉపయోగించుకొన్నాడు .ఆమె కవిత్వాన్ని పో1845జనవరి ‘’బ్రాడ్వే జర్నల్ ‘’లో సమీక్షచేస్తూ ‘’ఆమె ప్రభావం అత్యున్నతం ,అంతకంటే ఉత్తమ కవిత్వం మనకు ఎక్కడా లభించదు. ఆమె కవితాకళ అతి స్వచ్చం ‘’ ‘’అన్నాడు .ఆమె కూడా పో రాసిన రావెన్ కవితను శ్లాఘించింది .అతడు తన ‘’రావెన్ అండ్ ఆదర్ పోయెమ్స్ ‘’ను ఆమెకు అంకితమిచ్చి ఆమెను మహిళా లోకం లో మాణిక్యం లాంటి కవి అన్నాడు.మరొక అమెరికన్ కవయిత్రి ఎమిలీ డికెన్స్ పైనా ఎలిజబెత్ ప్రభావం అధికమే .

ఎలిజబెత్ బ్రౌనింగ్ జీవితకాలం లో 13రచనలు ప్రచురిస్తే ,మరణానంతరం 14రచనలు వెలువడ్డాయి .విక్టోరియా యుగం నాటి కాల్పనిక కవయిత్రి ఎలిజబెత్ బారెట్ బ్రౌనింగ్ ‘’హౌ డు ఐ లవ్ దీ’’అనే ప్రసిద్ధ సానెట్ ఇప్పటికీ ప్రపంచమంతా మార్మోగుతూనే ఉంది . ప్రముఖ డాక్టర్ ,ఆంగ్లా౦ధ్ర కవిత్వాలను ఔపోసన పట్టిన కవి అనువాదకులు,విశాఖ వాసి రావి శాస్త్రిగారి తమ్ముడు , డా .రాచకొండ నరసింహ శర్మ గారు ఎలిజబెత్ బ్రౌనింగ్ రాసిన పోస్ట్ చేయని ప్రేమ లేఖలు లాంటి 44సానెట్ లను చక్కగా తెలుగులోకి అనువాదం చేసి 2018ఆగస్ట్ లో తమ 95వ జన్మ దినోత్సవ కానుకగా ప్రచురించారు .అంటే ఇప్పటికీ ఎలిజబెత్ ప్రభావం యెంత గొప్పగా ఉందొ చూడండి .’’లాంగ్ లివ్ ఎలిజబెత్ బ్రౌనింగ్’’ .

-గబ్బిట దుర్గాప్రసాద్ 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

UncategorizedPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)