బురఖా(కవిత )-సామల కిరణ్

అందమైన బట్టలేసుకున్నా
ఆనందానికి అవకాశమేది?
ఆహార్యం ఆకర్శించేట్లున్నా
విహారానికి అవకాశమేది??
ఆలోచనలకి అంతులేకున్నా
ఆచరణకి ఆస్కారమేది???
నా ఆలోచనలన్నీ….
నా ఆహార్యమంతా……
నా బురఖాలోనే
బందీ అయ్యింది….
బురఖా చాటున
నా స్వేచ్ఛ సమాధి అయ్యింది
స్త్రీ హక్కులకై గొంతు చించుకునే
ఏ ఫెమినిస్ట్ నా కోసం గొంతెత్తరు……
పైట ని తగలెయ్యాలన్న
ఏ రచయిత్రులు నా కోసం
బురఖాని తగలెయ్యాలని అనరు…
ఎందుకో….
స్త్రీలంటే కొన్ని వర్గాల్లోని వారేనా?
బందీ అయిన నా లాంటి కోట్లాది స్త్రీలు లెక్కలోకి రారా?
నేనెవరో అర్ధమయ్యే ఉంటది కదా
నేనె మీ సోదరిని
భావప్రకటనకి భంగం కలుగుతుందేమోనని
భావాలని బయటకి చెప్పలేక
బందీ అయిన మీ ముస్లింసోదరిని……

-సామల కిరణ్,

తెలుగు అధ్యాపకులు,  కరీంనగర్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Comments are closed.