“స్త్రీలంతా యీ బాటే (కవిత )-గుత్తా జ్యోత్స్న(ప్ర ర వే ప్రత్యేక సంచిక )

ఆకాశంలో సగం మేమేనని
అరచి చెప్పాలని ఉంది
అరకు కొండలపై కెక్కి
ధింసా నృత్యం చేస్తూ
మాకు స్వేచ్చ కావాలని
నినదించాలని ఉంది
మూఢ నమ్మకాలు మూఢ విశ్వాసాల
సంకెళ్ళని తెంపుకుని
కొత్త ఊపిరి లూదాలని
ప్ర ర వే సభల బాటలో
పయనించాలని
కదం తొక్కుతూ పదం పాడుతూ
చేయి చేయి కలుపుదాం
స్త్రీలంటే యిలాగే ఉంటారని
కొత్త ప్రపంచం కోసం
ప్రణాళికతో పదం పాడుదాం
మీరంతా కదిలి రావాలని కోరుతూ “

-గుత్తా జ్యోత్స్న

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Comments are closed.