పదేళ్ల ప్ర ర వే ………ఆత్మీయ స్పందన (ప్ర ర వే ప్రత్యేక సంచిక )

ప్రరవే ఒక మంచి ప్రయత్నం..భిన్న అభిప్రాయాలు భిన్న లక్ష్యాల మధ్య వైరుధ్యాలు సర్వ సాధారణం కానీ వాటిని సమన్వ్యం పరుచుకుంటూ సాహితీ వనంలో సరికొత్త పరిమాలాలు వెదజల్లుతుంది . వివిధ సామాజిక అంశాలను అధ్యయనం చేస్తూ వాటి సారాన్ని పాఠకులకు అందిస్తుంది. కొత్త గళాల్ కు సామాజిక దృక్పథాన్ని అందించాలనే లక్ష్యంతో మీరు చేస్తున్న కృషి చరిత్రలో మరవలేనిది.

ఈ రోజు మన సామాజిక నేపథ్యం చాలా భిన్నంగా వుంది. Minorities దళితులు స్త్రీలు లైంగిక ప్రాధాన్యతలు మూలవాసుల హక్కుల గురించి పోరాడడం నేరం..మానవ హక్కుల కార్యకర్తలు పాలక వ్యవస్థ టార్గెట్ గా మారుతున్నారు. బాబా సాహెబ్ చెప్పిన సమన్యాయం పరిహసింపా పడుతుంది..సకల సంపదలు వనరులు పై హక్కులను బలహీనులు కోల్పోతున్నారు. వీటి పై మరింత దృష్టిని పెట్టి ప్రరావే ముందుకు వెళ్లగలగాలి. అనంగీకారం నిరసన నేరమవుతున్న వేళ ప్రజాతంత్ర విలువలను కాపాడే లక్ష్యంగా సాయుధమవ్వాలి . కుంచించుకు పోతున్న పౌర సమాజ క్షేత్రం లో ప్రరవే హక్కుల దిక్సూచిగా ప్రజాస్వామిక విలువలను సాహిత్యంలో నింపాలి..ప్రజల ప్రజాస్వామిక వాదుల గొంతుక కు ఆధారం కావాలని కోరుతున్నాను. మతోన్మాదం జాతీయవాదం పేరిట ఫాసిస్టు వేదిక గా దేశాన్ని తయారు చేస్తున్న శక్తులను ప్రేరేపించే భావజాలాన్ని అడ్డుకునే సాహిత్య ప్రక్రియలను మరింతగా అభివృద్ధి చేసుకోవలసిన సాహిత్య చారిత్రక సందర్భం లో మనం ఉన్నామని తెలియ చేస్తూ.

………………………………….అభినందనలతో మీ హేమ లలిత

*************************************************************

ప్ర.ర.వే…లో చాలా చురుకైన కార్యకర్త గా,అనేక హోదా లలో పనిచేస్తున్న,ప్రముఖ కవయిత్రి/రచయిత్రి/సంఘ సేవకు రాలు,కుమారి అని శె ట్టి రజిత గారిని,చాలా కాలంగా అతి దగ్గరగా గమని స్తూ న్నాను.ఇలాంటి నిస్వార్ధ సాహిత్య కారుల సేవలు,ప్ర.ర.వే…ద్వారా,సమాజానికి ,సమాజంలోని యువతరానికి  ఎంతైనా అవసరం.

-డా.కె.ఎల్.వి.ప్రసాద్,

    కథా రచయిత

     హనంకొండ

***********************************************

.ర .వే …అంటే ఏమిటో తెలిసింది..మా మల్లీశ్వరి మేడం గారి వలనే.. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆమె మాకు ఉపాధ్యాయిని.. 2018 ఏలూరు లో  ప్ర.ర.వే సభలకు వెళ్లి సభ్యత్వం తీసుకున్నాను. రచయితలను అందరినీ  ఒక్క చోట చూసి నమ్మ లేక పోయాను.అసలు  ఈ రచయితలు అంతా మీటింగ్స్ పెట్టుకుని  ఏమి చేస్తారా అనిపించేది.ఏలూరు మీటింగ్ లో మాట్లాడని అంశం లేదు.. ఆడవాళ్ళ సమస్యలు, దేశ సమస్యలు, మానవీయ విలువలు  ఇలా అన్నింటిని గురించి చర్చించడం వలన చాలా విషయాలను కొంచెం లోతుగా  ఆలోచించే అలవాటు వచ్చింది. ఇలాంటి భిన్న దృక్పథాలని నాకు పరిచయం చేసిన ఈ ప్రజా రచయితలకు నా సాహిత్య వందనాలు .                                 

                                                                             ధన్యవాదాలు.         

                                                                                                                                   వి.మమత.                
                                                                                                                               ఎం.ఎ.(ఎ.యు)
*********************************************

నా భావనలో ప్ర.ర.వే నను ప్రభావితం చేసిన రచయిత్రులు,వేదన పంచుకునే మిత్రులు న్న వేదిక నేనూ మహిళలు పడుతున్న బాధలూ సమస్యలను గురించి వేదనచెందేదాన్ని. కానీ ఫక్తు సదాచారాలు సాంప్రదాయాలు ఉన్న కుటుంబం లో పుట్టటంవలన ఏదైనా ఇలా ఎందుకమ్మా అని ప్రశ్నిస్తే తప్పు ఏమో అనుకునే దాన్ని కానీ అమ్మమ్మ చాలాధీరవనిత అమ్మ ను 50లలోనే బందరు పంపి టీచరు ట్రైనింగు చేయించారు. అమ్మ ఉద్యోగస్థురాలైనా కుటుంబం బాధ్యతలను తానే చూసేవారు ఆమె కూచిపూడి నర్తకి ఐనా వేదికలపై చేయలేదు నను ఆ ఆశ తీర్చుకునేలా వేదికలకు నా ఐదో ఏట నుంచే పంపేవారు. కానీ బంధువులందరు వ్యతిరేకించేవారు అది దేవదాసి పిల్లా అనేవారు అంటే ఏంటని అడిగాను ఏదో సినిమాలో చూపి అలా అంటున్నారని చెప్పారు కానీ నాకు నాట్యం ఇష్టం మానేయలేను అన్నాను అమ్మనన్ను ప్రోత్సహించటం కోసం నాన్న కుటుంబీకులతో పోరాడే వారు. బాధపడేది. ఎందుకిలా ఆడది ఇష్టమైన పని ఏమీ చేయకూడదా అనే ప్రశ్న నామనసులో సుడిగుండంలా అలా తిరుగుతు ఉండేది.

                               కులమతాలు మూఢాచారాలూ ఆడవారిపట్లజరిగే అమానుషాలపట్ల అమ్మ వ్యధచెందేది తనవద్దకు వస్తే సాయపడేది. కానీ మనకు సంపూర్ణంగా స్వాతంత్ర్యం అనుభవించే పరిస్థితులు ఇంకా రాలేదుఅనేది. నాకు మాత్రం ఒకరిస్తే తీసుకొనేది స్వేఛ్ఛ ఎలా ఔతుందీ అనిపించేది నాబాధలు ఆలోచనలు కధలుగా కవితలుగా వ్రాసుకునేదాన్ని. ప్రకటించాలంటే ఏమో అనే సంకోచంలోనే మనసు ఉండేది. వివాహానంతరం బాగా ఇబ్బందులు మొదలు ఇంటిపని తప్ప భర్త వాళ్లింటివారికీ సేవ తప్ప మరోలోకం నీకేదీ ఉండరాదనే కఠిన నియమాలు. ఉద్యోగం వద్దు అని నాకు మన ఆర్ధిక పరిస్థితిని బట్టీ నేనూ చేస్తే బాగుండనే ఆశ ఉద్యోగంచేసేఆడవాళ్లను ఎలా చూస్తారో నీకేం తెలుసు అనేవారు. మా అమ్మ చేసేది ఏమైందీ అనడిగాను అదినా తొలిప్రశ్న. ప్రశ్నించటం మొదలుపెట్టినప్పటి నుంచీ యుధ్ధాలు మొదలు. ఇక మొండిగా నాట్యం నేర్పటం ఒక మిత్రురాలి సాయంతో నా రచనలను రేడియోకు అందించటం బైట ప్రపంచంతో అంతవరకూ పదేళ్లపాటు తెగిపోయున్న సంబంధాలు పునరుధ్ధరించుకోవటం మొదలుపెట్టాను కానీ ఇంటిలో మాత్రం నేనే నాకు సైన్యాన్ని ఇలా కొనసాగుతున్నపుడు కాత్యాయని గారి గురించీ ఓల్గా గారి గురించీ చదవటం వినటం ఇంత విస్తృతంగా నేనెందుకు ఆలోచనచేయలేకపోతున్నాననే దుగ్ధ. నేచేస్తున్న పోరాటం నాబతుకు కోసమే కానీ ఇలాంటి ఎన్నో జీవితాలు కోసం వీళ్లంతా కలాలతో గళాల ఆయుధాలతోపోరాడుతున్నొరనిపించిందీ ఆ ఆలోచనలతో నా బ్రతుకు నేబ్రతికీ పిల్లలనూ పోషించుకోగలననే తెంపరితనం వచ్చింది.ఐనా ఇరుగూ పొరుగూ పెద్దాచిన్నా అందరూ ఒకటే అన్నారు ఇద్దరాడపిల్లల్ని కన్నావూ రేపు వాళ్ల భవితేమౌతుందీ అని. అంటే నేను ఆడదానిగా కాక మనిషిగా కూడా కాకుండా ఎవరికోసమో యంత్రంలా ఉంటేనే ఆడపిల్లకు భవితా అనీ. అపుడు రాశాను

ఓయోనిలా

ఓ యోగిలా

ఓమానులా, ఓ చేనులా మౌనంగా ఫలదీకరణ కోసం

ఎదురుచూస్తూ ఆఫలాలను

దైవార్పితంగా పురుషులకూ

మనుషులకూ అందిస్తేనే ఆడదా….?

అని ఆ సమయంలో పత్రికా ప్రకటన ఢిల్లీలో ప్ర.ర.వే

మీటింగ్సనీ ఆసక్తికలవారు రావచ్చనీ మల్లీశ్వరి గారి నెంబరు ఇచ్చారు చాలా ఆశ

అంతమంది నాకు ఇష్టమైన స్త్రీలను చూడొచ్చు వినోచ్చూ అనీ ఎవరినీ అనుమతి అడగకనే అమ్మదగ్గరికి వెళ్లి విషయం చెప్పి డబ్బులడిగాను ఇచ్చారు ఢిల్లీ బయలుదేరాను

విమల గారు సుజాత గారూ ,రజితగారూ ఇంకా చాలామందిని హైదరాబాదు స్టేషనులో కలిసేసరికి నా ఆనందం వర్ణనాతీతం కొండేపూడి నిర్మల గారిని తొలిగాపలకరించీ నేనూ మీతో వస్తున్నానన్నానూ అలా మీతో మొదలైన ప్రయాణం వలన చాలా విషయాలు నాలుగు గోడల మధ్య నామెదడున్న నాలుగు ఎముకల మధ్య తెలుసుకోలేనివెన్నో తెలుసుకున్నాను అప్పటికే అంతర్జాలం స్మార్ట్ ఫోన్లూ బాగావచ్చేసాయి  నావద్దలేవు

కానీ హేమలతక్క ఏకంగా అంతర్జాలంలో పత్రిక నడుపుతున్నారూ అక్కచాలా

ఆప్యాయంగా చూశారు చాలామంది స్నేహితులు దొరికారు అక్కడికి వచ్చినందుకు గాను ఓ నెలపాటు మావారూ అత్తమామలూ నాతో పలకలేదు పిల్లలు సంతోషించారు. వాళ్లూ ఆడపిల్లలే నాలాగా అందుకే వాళ్లకి అక్కడ నేను తెలుసుకున్నవి చెప్పానూ నాలోనూ చైతన్యం ఉంది కానీ సుషుప్తావస్తలో. ఇపుడుమేల్కున్నదీ. నాకు తోచిన రీతిలో ఆడపిల్లలకూ పెద్దలకూ ఏకష్టంవచ్చినా నాపరిధిలో సాయం చేసేప్రయత్నం సామాజిక రుగ్మతలను నిలదీసే ధైర్యం చేశాను ఆరావళి అనే వీధిపిల్లల బడి కొందరిసాయంతో నడుపుతున్నాను అనాధాశ్రమాలలో ఆడపిల్లలకు ఉచితంగా సంగీతం నాట్యం

చదువూ నేర్పుతున్నాను ఆర్ధిక స్వావలంబన లేనందున నాట్యం కొందరివద్ద రుసుముతీసుకునినేర్పీ ఆడబ్బుఇలా వాడుతున్నాను కానీ కూపస్తమండూకంలా ఉన్న సుమనకూ అక్వేరియం చేపలాఉన్న సుమనకు సముద్రంలో చేరినంత మార్పు అన్ని మీటింగులకూ రావాలనీ అందరినీ కలవాలనీ ఆశపడినా స్తోమత అనుకూలించక మనసు అక్కడున్నా సుమన

ఇక్కడే ఉంటుందీ ….

నాలో ధైర్యం నింపిన ప్ర.ర.వే కి శతాధికాభివందనాలు.

‌డా.కోడూరు సుమన , కడప

            **************************************************

ప్రరవే ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక స్త్రీల సంక్షేమం కోసం స్త్రీలకు సమన్యాయం జరగడానికి సమాజం పైన గురిపెట్టిన”కలం తూటా”.ప్రరవే మొదట”మనలో మనం”పేరుతో మొదలు పెట్టిన ప్రయాణం విజయవంతంగా పదేళ్లు పూర్తిచేసుకుంది. నేను ‘ప్రరవే’ లో సభ్యురాలిగా చేరిన తర్వాత అనేక కార్యక్రమాలలో, సదస్సులలో పాల్గొన్నాను. ఎందరెందరోమహామహులను కలుసుకునే భాగ్యం కల్గింది నాకు. అలాగే వారి అనుభవాలను కలుపుకొని వారు సదస్సులలో తెలిపిన అనేక విషయాలు నాకే కాదు మొత్తం స్త్రీ జాతిని అభివృద్ధి పథంలో నడిపించే మార్గదర్శకాలు.
      ప్రరవే రెండు రాష్ట్రాలలోనే కాక జాతీయ స్థాయిలో తన ఉనికిని చాటుకొనేలా అనేక కార్యక్రమాలు నిర్వహించిందని చెప్పుటకు ఒక స్త్రీగా గర్విస్తున్నాను.ముజఫర్ నగర్ వెళ్లి దళిత స్త్రీలపై జరుగుతున్న అమానుషాలను వెలుగులోకి తెచ్చి వాటిని పుస్తక రూపంలో వెలువరించారు.అనిశెట్టి రజిత గారు, బండారు విజయ గారు ఇది ఒక సవాల్ గా తీసుకొనిఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఎంతో శ్రమించి సమాజానికి ఆ ఘనతను అందించారు.స్త్రీల స్థితి గతులను ఈ నవీన యుగంలో కూడా ఎట్లా ఉన్నాయో ఆలోచించండి?అనే ప్రశ్నను సమాజంలోని ప్రజలపై ఒక బాణం గా సంధించారు
వారి కృషి వేనోళ్ళ కొనియడదగినది. వారికి నేను ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను.
         ‘ప్రరవే’క్షేత్ర పర్యటనలో భాగంగా చేనేత కుటుంబాలకు నిలయమైన సిరిసిల్లకు వెళ్ళటం జరిగింది. ఆ క్షేత్ర పర్యటనలో నేనూ భాగస్తు రాలిగా ఉన్నందుకు సంతోషిస్తున్నాను.
        సిరిసిల్ల లో చేనేత కుటుంబాలు సరియైన ఉపాధిలేక ఆత్మహత్యల పాలయ్యాయి.అయితే ఈ నేపథ్యంలో కుటుంబ యజమాని ఆత్మహత్య చేసుకుని చనిపోతే ఆ యజమాని భార్య తన పిల్లలను పెంచి పోషించలేక ,బ్రతకలేక,చావలేక పడుతున్న నరకయాతన ఉన్నది అనేది అక్కడ ఏ కుటుంబాన్ని కదిలించినా కన్నీటి వరదగా ప్రవహించింది. అక్కడి స్త్రీలకు మా వంతు కర్తవ్యంగా మేము కొంత ధైర్యాన్ని అందించాము.కొంత ఆర్థిక సహాయాన్ని కూడా అందించాము.కొన్ని మార్గదర్శకాల్ని సూచించాము.
       ప్రరవే తన సామాజిక సేవలో భాగంగా పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలను ఆత్మీయంగా పలకరించడానికి వెళ్ళింది.అక్కడి ప్రజల ఆర్తిని వినిఅల్లాడింది.అక్కడి ముంపు గ్రామంలో ఏ ఒక్కరిని కదిలించినా వారి అంతర్మధనాన్ని ఆవేదనతో వివరించారు.
“మాకు ఈ ప్రాంతం విడిచి వెళ్లాలని లేదు.మాకుఅక్కడ దొరికే ఆధునికత అక్కర లేదు. ఇక్కడి అడవుల్లో దొరికే పండు-ఫలాలు వెదురు బియ్యం చాలు. ఇక్కడి చెట్టు పుట్టల నుండి దొరికే ఆహారమే మాకు అమృతతుల్యం”ఇక్కడి స్వచ్ఛమైన గాలి చాలన్నారు అని వారి మనోభావాలను వ్యక్తం చేశారు.
       ప్రరవే వారి మనోభావాలను గౌరవించించింది.వారి ఆవేదనను అర్థము చేసుకొని అక్షరబద్దం చేసింది.
     ఇంకా ప్రరవే విశాఖ పట్టణంలో క్షేత్ర పర్యటన గావించింది.అనేక కోణాలలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలు-పరిష్కారాల దిశగా ఎన్నెన్నో సదస్సులు, సమావేశాలు జరిపింది.
      ప్రరవే స్త్రీల సమస్యలకు పరిష్కార మార్గాలు సూచించే దిశగా పనిచేస్తుంది. అందుకోసం రచయిత్రులందరు తమ కలాలను ఆయుధాలుగా ఎక్కుపెట్టారు ఈ అక్షర యజ్ఞం లో కుల,మత, వర్గ,ప్రాంత, జాతి అస్తిత్వాలకు అతీతంగా అందరినీ కలుపుకొని అందరితో కలిసి పనిచేస్తోంది. ప్రరవే తమతో పాటు అనేక సాహితీ సంస్థలను,సంఘాలను తమకు మద్దతుగా తీసుకొని పనిచేస్తుంది.ఈ పయనంలో భాగంగా”స్త్రీల అస్తిత్వ చైతన్యం-సాంస్కృతిక సవాళ్లు”గా2019 ఫిబ్రవరి 2,3తేదీలలో విశాఖపట్నం లో సదస్సు నిర్వహించబోతుంది.ప్రరవే పదేళ్ల ప్రస్థానం లో సఫలీకృతం అయ్యిందని అభినందిస్తూ పేరు పేరునా అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

-అడువాల సుజాత

************************************* 

గ్రామీణ మహిళా శ్రమ నుంచి పుట్టిన సాహిత్యంవిలువైనది . ప్రజల జీవన విధానం తెలిసిన రచయిత్రులంతే ప్రజా రచయిత్రుల వేదికతో ప్రయాణం చెయ్యటం ఓ గొప్ప అనుభూతి . హైదరాబాద్ లో జరిగిన సభలో పాల్గొన్న ప్రముఖ రచయిత్రి ఓల్గా విశ్లేషణ బాగుందనుకున్నాను . శాంతి ప్రబోధ , బండారు విజయ లాంటి రచయిత్రులతో మనోభావాలు పంచుకోవడం ముదావహం .

                                      ఒంగోలు మహా సభలకి రచయిత్రి కవిని , సామాజిక కార్యకర్త సుమతో కలిసిన ప్రయాణంలో అనేక సామాజిక విషయాల గురించి చర్చించుకునే అవకాశం లభించింది . ఆ సభల్లో రత్నమాలగారి విశ్లేషణ స్త్రీల పట్ల సమాజంలో వైవిధ్య ధోరణుల గురించి కొండవీటి సత్యవతి , ఆంద్ర జ్యోతి సబ్ ఎడిటర్ శ్రీనివాస్ గారు స్త్రీ ల పట్ల గౌరవ నివేదన , రహనా టాటి జర్నలిస్టుల ఆత్మ స్థైర్య నివేదన చాల చాల విలువగా సాగాయి .

ఆసభల్లోనే చిత్తూరు గ్రామీణ మహిళల చైతన్యం నాకు స్ఫూర్తి నిచ్చింది . ప్రతి రంగంలో స్త్రీలు తమ శ్రమని గుమ్మరించి ఫలితాలు సాధిస్తున్నా మరుగునే ఉన్నారు .కాని చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన గ్రామీణ మహిళలు ఎ పి ఆర్ ఐ జి ద్వారా అభివృద్ధి పథంలో పయనిస్తూ మహిళా నవోదయం గ్రామీణ స్త్రీల మాస పత్రిక నడిపే విధానం నాకు చాల నచ్చింది . అట్టడుగున ఉన్న గ్రామీణ పేద మహిళ దగ్గర నుంచి జిల్లా కలెక్టర్ వరకు మహిళా కుటుంబం నిలబడతాయి . వాళ్ళ శ్రమ వృధా పోకూడదు “ అని నేర్పుతూ చదువు , ఆరోగ్య విలువలకి స్థానం కల్పిస్తూ పత్రికా సాహిత్యాన్ని వాడుకొనే తీరు నాకు చాల నచ్చింది .

పాడి పంటల విలువిచ్చే ఏ కార్యక్రమమైనా శ్రమ ఫలితాలనివ్వాలి . తేనెటీగల పెంపకం నుంచి ఆటో రిక్షా నడిపే వరకు ఆర్ధిక స్వావలంబన దిశగా స్త్రీలు ఎదిగితే కుటుంబమంతా అభివృద్ధి  దిశగా పయనించ వచ్చని నేర్చుకున్నామన్నారు . ప్రభుత్వ పతకాలు  మధ్యవర్తి అవసరం లేని విధంగా వినియోగించుకోగలుగుతున్నారు . వరకట్న వేధింపుల సమస్యలు జన్డర్ కమీటి ఆశ్రయంతో ఆత్మ స్థైర్యం తో బ్రతక గలిగే గ్రామీణ స్త్రీల పరిచయాలు సంతోషాన్ని మిగిల్చాయి .

  ఈ సారి విశాఖ ప్ర ర వే సభల్లో కూడా అట్టడుగునున్న గ్రామీణ మహిళల జీవన విధానాన్ని సభ ముందుంచితే మనందరికీ కనువిప్పు కలుగుతుందని ఆశిస్తున్నాను .

   “థింసా నృత్యాన్ని “ కూడా ఏర్పాటు చేస్తే ఆనందించగలము .

     శుభాకాంక్షలతో…………

-గుత్తా జోత్స్న

************************************* 

సాహిత్య సమావేశాలుPermalink

Comments are closed.