నాకు నచ్చిన నా రచనలు (వ్యాసం )-ఇంద్రగంటి జానకీబాల(ప్ర ర వే ప్రత్యేక సంచిక )

ఏ రచయితనైనా మీకు నచ్చిన మీ రచన ఏమిటి? అంటే వెంటనే జవాబు చెప్పడం కొంచెం కష్టమే. చేసిన రచనలన్నీ ఎక్కువ యిష్టంగా అనిపించకపోయినా మరీ ఒకే రచన యిష్టం అనడం కూడా కుదరదు. నలభై ఏళ్ళుగా వ్రాస్తూ, సుమారు 200 కథలు వ్రాసి ప్రచురించి నేను, వ్రాసిన ప్రతీకథా, ప్రతీనవలా వ్యాసం నాకిష్టమని చెప్పను. చెప్పలేను. కొన్ని వ్రాసి ప్రచురింపబడినా తృప్తిగా వుండవు. కొన్ని రచనలు చాలామంది మెచ్చుకున్నప్పటికీ మనకి లోలోపల ఏదో అసంతృప్తి వుంటుంది. మనమెంతో బాగుందని భావించిన రచన మన చుట్టూ వున్న వారికి అస్సలు నచ్చకపోవచ్చు. మనమెంతో ఊహించుకున్న వాటికి ప్రతిస్పందనే వుండకపోవచ్చు. అలవోకగా వ్రాసిన కథ పెద్దవాళ్ళు మెచ్చుకున్నప్పుడు మన జడ్జిమెంట్ మీద మనకే అనుమానం రావచ్చు. అయినా నాకు నచ్చడం నాకు నచ్చడము అనే మొండితనం కూడా వస్తుంది. ఇది నా అనుభవం.
ఇంతకీ నాకు నచ్చిన నా రచన గురించి చెపాల్సి వచ్చింది కనుక నాకు నచ్చిన నా కథలను కొన్నింటిని ఇక్కడ ప్రస్తావిస్తాను. అది కూడా నాకున్న, నాకిచ్చిన సమయంలోనే అని వినయంగా విన్నవించుకుంటున్నా.

నేను మనస్ఫూర్తిగా నమ్మిన అభిప్రాయాన్ని, సిద్ధాంతాన్ని ఆదర్శాన్ని మాత్రమే నా రచనలో చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఎవరిదో మెప్పు కోసమో, ఫలానా సిద్ధాంతాన్ని అనుసరిస్తే పేరొస్తుందనో ఎవరో మెచ్చుకుంటారనో, ఏ రచనా నేను చేయను. ఆ విధంగా వ్రాయడం నాకు చేతకాదు.

1970లో నా మొదటి కథ ఆంధ్రపత్రికలో ప్రచురింపబడింది. అంతకుపూర్వమే నావి రెండు స్కెచ్ లు ఎన్.ఆర్. చందూర్ సంపాదకత్వంలో వచ్చే జగతి మాసపత్రికలో వచ్చాయి.

నేను ఎ.పి.ఎస్.ఆర్.టి.సి.లో వుద్యోగం చేస్తూ నా రచనావ్యాసంగాన్ని సాగించాను. అందువల్ల రకరకాల ఇతివృత్తాలు తీసుకుని కథలు వ్రాశాను. అయితే నా కథారచనలోగానీ, నవలా రచనలోగానీ ప్రేమకథలు వ్రాయలేకపోయానున. అప్పట్లో అదేదో చాలా గొప్పవిషయంగా అనుకునేదాన్ని. ఇప్పుడు వెనక్కి తిరిగిచూసుకుంటే కాల్పనిక సాహత్యంలోప్రేమ, యువతీ యువకుల మధ్య ఏర్పడే ఆకర్షణ, అనుబంధం ఎంత గొప్పవీ అనిపిస్తుంది.

నేనసలు ప్రయత్నమే చేయలేదే అని బాధ కలుగుతుంది. నా కథలు మధ్యతరతి – అంతకు ఒకమెట్టు క్రింద తరగతి వారి జీవితాలకి సంబంధించిన ఇతివృత్తాలతో, వాతావరణంతో వాంయి. ఎందుకంటే అదే నాకు తెలిసిన జీవితం. నేను స్త్రీని కాబట్టి, సమాజంలో స్త్రీకి జరిగే అన్యాయాల్ని ఎత్తిచూపుతూ, సమస్యలకి ధైర్యమైన పరిష్కారాలను చూపే ప్రయత్నం చేసేదాన్ని – అప్పట్లో అదోవాదంగా, దానికోసం నేను వ్రాస్తున్నాననే స్పృహ వుండేది కాదు.

70-80 మధ్యలో ‘పక్షి ఎగిరిపోయింది’ అనే కథలో శేషమ్మ ఆర్థిక బలం లేక, ఆరోగ్యం లేక, కొడుకు ఆమె యందు అనుమానంతో దూరంగా వెళ్ళిపోతే, అతను పంపే అరవై రూపాయల కోసం చూస్తూ అద్దెకున్న గది ఖాళీ చెయ్యాల్సి వస్తే పడే వేదన చిత్రించాను. చివరికి శక్తిలేని ముసలి ప్రాణం గాలిలో కలిసిపోతుంది – ఇది నా మనసుని కలచివేస్తే వ్రాసిన కథ.
81-82లలో స్క్రాప్ అనే కథ వ్రాశాను. వేస్ట్ మెటీరియల్ ని ఆక్షన్ (Auction) వేసి అమ్మడం… నేను కేవలం ఒక డిపార్టుమెంట్ లో పనిచేస్తుండడంవల్ల అలాంటది ఇతివృత్తంతో కథ వ్రాయగలిగాను. ఆ కథ ప్రచురింపబడినప్పుడు ‘ఇది ఆడవాళ్ళ కథ కాదు- మీరెందుకు వ్రాశారు? అని కొందరడిగారు – విలక్షణమైన రీతిలో సాగిన ఈ కథ నాకిష్టం.

83-84 మధ్యలో ‘వెలుగును మింగిన చీకటి’ అనే కథ ప్రచురింపబడినప్పుడు కూడా నా వైపు చామంది ప్రశ్నార్థకంగా చూశాను. వెనుకబడిన వర్గాల అభివృద్ది కోసం, వాల్ళ పిల్లల చదువుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన వసతిగృహం (Hostel) నేపథ్యంలో సాగుతుంది. చదువు కోసం అక్కడ చేరిన పసివాడు అక్కడుండలేక పారిపోయి, మళ్ళీ హోటల్లో పనివాడిగా చేరిపోయిన చిన్నపిల్లాడి కథ. నాకెంతో బాధ కలిగి వ్రాసినకథ. ఈ వెలుగును మింగిన చీకటి ‘నాకిష్టం. మా ఆఫీసులో పనిచేసే ఆఫీస్ బాయ్ చెప్పిన అనుభవం దీనికి స్ఫూర్తి. 85 ప్రాంతాలలో ‘ధైర్యమే నీ కవచం’ నాకెంతో యిష్టమైన కథ – కాస్త అందంగా వుండి, కుటుంబభారంపైనబడడం వల్ల ఉద్యోగం చేసుకుంటున్న ఒక అవివాహిత రమణి పెళ్ళయి ఇద్దరు పిల్లలు, భార్య వున్న సహ ఉద్యోగి ఆమెను ప్రేమించానని వెంటపడతారు. ఆమెకస్సలు అతనియందు ఇష్టం వుండదు. పిచ్చివాడైపోయినట్టు, హాస్పిటల్, మందులు – అందరి సింపతీ అతని వేపే పోనీ అతని కిష్టమంటున్నాడు కదా అతనితో వుండచ్చుకదా! ఇదీ చుట్టుపక్కల వారి అభిప్రాయం చివరికి అతని భార్య అహల్య వచ్చి రమణిని తమింటికి వచ్చి వుండమని, తనకేమీ అభ్యంతరం లేదని అంటుంది. రమణి రెచ్చిపోయి మాట్లాడుతుంది.

‘అన్ని రకాల అండదండలు వున్నదానివి. ఆర్థిక స్థోమత గలదానివి. నీకేం ఖర్మ పట్టింది ఆత్మగౌరవాన్ని చంపుకుని నన్ను ఆహ్వానిస్తున్నావు’ అంటుంది రమణి. ‘‘అంటే… మీకు ఆయనంటే యిష్టం లేదా? ఆశ్చర్యంగా అహల్య అడుగుతుందో ‘‘నాకు పరమ అసహ్యం’’ – ధైర్యమే నీ కవచంగా ధరించు అని రమణి అహల్యకి చెప్పడమే కథ. కళ్ళారా చూసి కుతకులాడి వ్రాసిన కథ. ఇది నాకిష్టం.

1992లో ‘జీవనరాజకీయం’ కథ వ్రాశాను. నిజానికీ కథకి ఆలోచన ఒక వారపత్రికలో లేడీ డాక్టరు నిర్వహించే ప్రశ్న జవాబుల శీర్షిక చదువుతుంటే వచ్చింది. ఇది నాకెంతో యిష్టమైన కథ – నాకెంతో పేరు గుర్తింపు తెచ్చిన కథ. ఇది అల్లాడి ఉమ శ్రీధర్ ఇంగ్లీషులోకి అనువదించి అయోని అండ్ అదర్ స్టోరీస్ సంకలనంలో చేర్చారు.

1996లో నేను వి.ఆర్.ఎస్. తీసుకుని, వుద్యోగం నుండి బయటకొచ్చి సాహిత్యపరమైన కొంత పని చేసుకున్నాను. అప్పట్లో ‘మూడోపేజీ కథ వ్రాశాను. వివాహ వ్యవస్థ మీద నమ్మకంపోయింది. మరి కలిసి వుండటం మీద నమ్మకం కుదిరిందా? ఒకటి పెద్దలు చేసింది. రెండోది తనే నిర్ణయించుకున్నది – రెండూ జీవితంలో ఎదురుదెబ్బల్నే యిచ్చాయి. జీవితమనే పుస్తకంలో ఒకటి, రెండు పేజీలు చిరిగిపోయాయి. మూడోపేజీ జాగ్రత్త గురించి ఆలోచన. అదేముగింపు. ఇదీ నాకెంతో యిష్టమైన కథ. నా కథలు కొన్ని హిందీ, తమిళం, కన్నడం ఇంగ్లీషులోకి అనువదించబడ్డాయి. నేను ఉద్యోగంలో వుండగా రాసిన కథల్లో ఎన్నో విభిన్నమైన ఇతివృత్తాలతో కథలు వ్రాశాననీ, ఉద్యోగం మానేసిన తర్వాత స్త్రీల సమస్యలు, స్త్రీ పురుష సమానత్వం- స్త్రీల పట్ల వివక్ష గురించిన విషయాలకే పరిమితమై కథలు వ్రాస్తున్నాననీ మా పిల్లలు అంటారు. బహుశ స్త్రీవాద ధోరణికి బాగా ప్రభావితం కావడం వల్ల అలా జరిగి వుండవచ్చు- అయితే నన్నెవరూ ఫెమినిస్టు రచయిత్రి అనరు. దానివల్ల వారికేం లాభమూలేదు. నాకొచ్చిన నష్టమూ లేదు.

నేను వ్రాసిన నవలల్లో ‘కనిపించే గతం’, ‘పంజరం కోరినమనిషి’, ‘దేవకీ-వాళ్ళక్క అన్నయ్యా’ నాకిష్టమైన నవలలు.
నాకు సంగీతంలో కొంచెం ప్రవేశం వుండడంవల్ల తెలుగు సినిమా సంగీతం, పాటలు గురించి విశ్లేషిస్తూ వ్యాసాలు రాస్తున్నానను.
ప్రస్తుతం నేను ఏది వ్రాసినా ఎంతో యిష్టంతో, దానికోసం శ్రమపడి, పరితపించి వ్రాయాలి. అనుకుంటున్నా. మనసుకి పూర్తిగా నచ్చాలి. మన ప్రయత్నంలో ఎటువంటి లోపమూ వుండకూడదని భావిస్తున్నా. రెండు మూడు రకాలైన అంశాలు నా ఎదుట వున్నాయి. వాటిలో సీరియస్ గా కృషి చెయ్యాలనుకుంటున్నా. నాకు తెలుసు. కొత్త కొత్త అంశాలను పోగు చేసుకున్నంత మాత్రాన మంచి రచన, గొప్ప రచన చేయగలవనే గ్యారంటీ ఏమీ లేదు. అయితే రాసినవే రాస్తూ మనల్ని మనమే రిపీట్ చేసుకోవడమూ బాగుండదు. అది వ్రాయడానికి విసుగ్గా వుంటుంది. పాఠకుల విషయం సరేసరి. అందుకే కొత్త విషయాలు కనిపించినప్పుడే కొత్తగా వ్రాయాలని నిర్ణయించుకున్నాను.

నాకు సంగీతంలో కాస్తంత ప్రవేశం వుందని ముందే చెప్పాను కదా! అందుకే మ్యూజికాలజిస్టుగా కొంత పనిచెయ్యాలని అనుకుంటున్నా. రెండు రకాల లలిత కళల్లో ఎంతో కొంత శ్రమపడి పనిచేయడం కొత్త విషయమేం కాదు. ఏ కళారూపాన్ని తీసుకన్నా అదొక మహాసముద్రమే. చిన్న బుడిగి చెంబుతీసుకుని మహాసాగరం ముందు నిలబడటం లాంటిదే ఈ ప్రయత్నం-
వేగంగా పరుగెట్టు కాలంతో పరుగెట్టడం ఒక సాహసం. మనకున్న సమయంలోనే మనం చెయ్యగలిగింది చెయ్యాలని నేను అనుకుంటూ వుంటాను. అనుకోవడానికి, చేసి చూసిందనడానికి చాలా దూరముంది-ఉన్నదానికీ – అనుకున్నదానికీ
ఎంత చేరువో – అది అంతదూరము అనేది జీవిత సత్యం.
ఇంక రాయబోయే రచనలు నాకు నచ్చే రచనలుగా వ్రాయాలని మనసా అనుకుంటున్నా.
ఈ అవకాశాన్ని నాకిచ్చిన శ్రీమతి కాత్యాయనీవిద్మహే గారికి, ఇక్కడ ఇవన్నీ ఏర్పాట్లు చేసి గౌరవించిన కార్యవర్గానికి అందరికీ నా నమస్సులు – కృతజ్ఞతలు.

-ఇంద్రగంటి జానకీబాల

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)