దశ “వసంతాల ప్ర ర వే(కవిత )-వెంకట్ కట్టూరి (ప్ర ర వే ప్రత్యేక సంచిక )

అబలలం కాదు సబలలం మేమంటూ
దూసుకుపోతున్నారు
వినీలాకాశంలో విహంగంలా
గగనవిహారం చేస్తున్నారు పతంగంలా
మాకూ కొన్ని పుటలున్నాయంటూ
మేమంతటా ఆవరించియున్నామంటూ
మేం నడుం బిగించి అడుగుముందుకేస్తే
దాస దాసీలు గా చూసిన వాళ్ళ
కాళ్ళు విరగ్గొడతాం
మా మహిళాజాతిని హీనంగా చూసిన వాళ్ళ
డొక్కలిరగదన్నుతామంటూ
మాకూ మనసుంది మాక్కూడా వ్యక్తిత్వముందంటూ
సమానత్వం కావాలంటూ
సమఉజ్జీలుగా ఉన్నామంటూ
మనలో మనమంటూ తొలిసారిగా అనకాపల్లిలో
“ప్రరవే “స్థాపించి
తెలుగు సాహితీలోకంలో
స్త్రీవాదం బలంగా వినిపిస్తూ
నారీ లోకాన్ని మేల్కొలుపుతూ
సజీవ సాగరంలాఉప్పొంగుతూ తెలుగు సాహితీ లోకంలో ముందుకు సాగిపోతూ
“దశ “వసంతాల వేడుకను
సాగరమాల విశాఖతీరంలో
ఘనంగా జరుపుకుంటున్న

-వెంకట్ కట్టూరి 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Comments are closed.