నిర్భయ వాహిని సంస్థ స్థాపకురాలు –మానస ప్రధాన్ -గబ్బిట దుర్గాప్రసాద్

గబ్బిట దుర్గాప్రసాద్

     పట్టుదలతో ఎదిగిన నిరుపేద మహిళ

ఓడిశా రాష్ట్ర ఖోర్ధా జిల్లా లోని మారుమూల పల్లెటూరు ఆయతపూర్ లో నిరుపేద కుటుంబం లో మానస ప్రధాన్ 4-10-1962న జన్మించింది .హేమలతా ప్రధాన్ ,గోదాబరీష్ ప్రాధాన్ దంపతుల సంతానం లో పెద్దకూతురు మానస .తండ్రి రైతు .తల్లి సామాన్య గృహిణి .ఆ ప్రాంతం లో ఆడపిల్లల చదువు పై శ్రద్ధ పెట్టేవారుకాదు.హైస్కూల్ లో చేర్పిస్తే గొప్పే.పుట్టిన ఊరిలోనే మిడిల్ స్కూల్ విద్య పూర్తిచేసి ,తలిదండ్రులు పై చదువుకు తీవ్రంగా అభ్యంతరం చెప్పటం ,దగ్గరలో హైస్కూల్ లేక పోవటం తో మానస ,చదువుకోవాలనే కోరిక బలంగా ఉండటం చేత,పట్టుదలతో   రోజూ 15కిలోమీటర్లు కొండలు కోనలమధ్య నడిచి వెళ్లి  ఆ ప్రాంతం లో ఉన్న ఏకైక హైస్కూల్ లో చేరి,కస్టపడి  చదివి పాసై, ఆ గ్రామం లోనే మొదటి సారిగా పాసైన ఏకైక విద్యార్ధినిగా గుర్తింపు పొందింది.

                    స్వయం సిద్ధ

  గంభారి ముండ లోని పతిత పావన హైస్కూల్ నుండి  మానస పాసయ్యాక తండ్రి కుటుంబాన్ని పూరీకి మార్చాడు .తండ్రికి పొలం మీద వచ్చే ఆదాయం తో ఆమెకు కాలేజి చదువు చదివించటం గగనం గా ఉండేది ..కుటుంబ బాధ్యత అంతా మానస పైనే పడింది .ఇంటర్ పాసవగానే ,ఏదో ఒక పని చేస్తూ కుటుంబానికి సాయపడుతూ తన చదువు కొనసాగించింది .పూరీ ప్రభుత్వమహిళా కాలేజిలో చేరి, ఎకనామిక్స్ లో బి.యే.డిగ్రీ పొంది ,ఉత్కల్ యూని వర్సిటి నుంచి ఒరిస్సా సాహిత్యం లో ఎం. యే .సాధించింది .పూరీ జి .ఎం .లా కాలేజిలో చేరి బాచెలర్ ఆఫ్ లా పట్టా అందుకొన్నది .

             మహిళా వ్యాపార వేత్త –మహిళా గౌరవ ఉద్యమ నాయకురాలు

  కొద్దికాలం ఒరిస్సా ప్రభుత్వ ఆర్ధిక శాఖలోనూ ,మరికొంతకాలం ఆంధ్రా బాంక్ లోను పనిచేసి ,21ఏళ్ళ వయసులో 1983అక్టోబర్ లో ప్రింటింగ్ బిజినెస్ తోపాటు ఒక సాహిత్య పత్రిక కూడా కొన్నేళ్ళు నడిపింది .వీటితో మహిళా పారిశ్రామిక వేత్త లతో గొప్ప పరిచయాలేర్పడ్డాయి .1987లో’’ ఓ.వై.ఎస్. యెస్. వుమెన్ ‘’సంస్థ స్థాపించి  బాలికా విద్యార్ధుల ఉన్నత చదువులకు ,సమాజం లో వారు నాయకులుగా ఎదగటానికి తోడ్పడింది . ఈ సంస్థ లీడర్ షిప్ వర్క్ షాపులు ,విద్య ,వృత్తి శిక్షణ కాంపులు , చట్టం  పై అవగాహన ,ఆత్మ రక్షణ కాంపులు ,వేలాది యువతులు తమకు నచ్చిన క్షేత్రం లో  రాణి౦చ టానికి కావలసిన సకల సదుపాయాలూ కల్పించింది .మహిళా సాధికారత కోసం వారిని తీర్చి దిద్దింది . మహిళా గౌరవ౦ కోసం  ఉద్యమాలు దేశ వ్యాప్తంగా నిర్వహించింది .

   2009లో  మహిళా గౌరవం కోసం చేసిన దేశ వ్యాప్త  ఉద్యమం లో ,మహిళలు హింసను ఎదుర్కోవలసి వచ్చింది .మహిళపై దారుణంగా జరుగుతున్న దురాగతాలు హింసలపై దేశాన్ని మొత్తాన్ని కదిలించింది మానస ప్రాధాన్ .అనేక తరహాలలో మహిళా గౌరవం కోసం పోరాడి చైతన్యం తెచ్చింది .మహిళలకు వ్యాపారం , ఉత్సవాలు ,సమావేశాలు ,సాహిత్యం ,ప్రదర్శన ,వీధినాటక౦  ,చట్టం పై అవగాహన ,తమపై జరిగే దుర్మార్గాలపై పోరాటం మొదలైన వాటికి విధిగా హక్కులుఉండాలనీ , కావాలని  డిమాండ్ చేసింది .వీటన్నిటిసాధనకోసం నాలుగు సంవత్సరాలు అలుపెరుగని పోరాటం చేసింది .అనేక సెమినార్లు వర్క్ షాపులు ,మొదలైనవి నిర్వహించి ప్రజల,ప్రభుత్వాల దృష్టికి తీసుకు రావటం వలన 2013లో మహిళలపై హింస నేరం అనే చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తెచ్చి ఊరట కలిగించింది .

                       ఫోర్ డిమాండ్ చార్ట్ –నిర్భయవాహిని

  2014లో తమ డిమాండ్ లను ‘’ఫోర్ పాయింట్ చార్టర్ ‘’ రూపం లో తెచ్చి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేసింది .అదే సంవత్సరం లో’’నిర్భయ వాహిని ‘’పేరిట  పది వేలమంది వాలంటీర్లతో దేశమంతాప్రచారం చేసి ,ప్రజలను చైతన్యపరచి ,ఉద్యమానికి అండ దండలు సాధించింది .మానస ప్రాధాన్ డిమాండ్ చేసిన ఫోర్ పాయింట్స్  -1-సంపూర్ణ మద్య నిషేధం 2-విద్యా ప్రణాళికలో మహిళా ఆత్మ రక్షణ శిక్షణ  3-ప్రతి జిల్లాలో మహిళల కోసం ప్రత్యేక రక్షణ బలగం ఏర్పాటు 4-ప్రతి జిల్లాలో మహిళపై జరిగే అత్యాచారాలపై విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ,స్పెషల్  ఇన్వెస్టిగేటింగ్ అండ్ ప్రాసిక్యూటింగ్ విభాగం ఏర్పాటు.

                  మానస రచన

మహిళా హక్కులకు , మహిళల పై దురాగతాలపై పోరాటం చేస్తూనే ,మానస ప్రధాన్ క  విత్వం రాసింది .రచనలూ చేసి తన సమర్ధత చాటి,సాహిత్యం లోనూ పేరుపొందింది .ఆమె 1-ఆకాశ 2-దీప 3-స్వాగతిక4- ‘’ఊర్మి ఓఉఛ్వాస్’’నవల  రాసింది .ఇది ఎనిమిది ప్రధాన భాషలలోకి అనువాదం పొందింది .

              పురస్కార ‘’ప్రధాన్’’

మానస చేసిన అపూర్వ మహిళా సేవకు  గుర్తింపుగా2001లో ‘’అవుట్ స్టాండింగ్ వుమెన్ అవార్డ్ ‘’,2014లో ‘’రాణి లక్ష్మీ బాయ్ స్త్రీ శక్తి పురస్కారం ‘’పొందింది .మేరీ ప్రేమా పీరిక్ అవార్డ్ ,గ్లోబల్ హెడ్ ఆఫ్ ది మిషనరీ ఆఫ్ చారిటీ అవార్డ్ లనూ పొందింది .  నిర్భయ వాహిని తోపాటు ,నిర్భయ సమారోహ్ కూడా మానస స్థాపించింది .కేంద్ర ప్రభుత్వ ఫిలిం సెన్సార్ బోర్డ్ పానెల్ మెంబర్ గా పని చేసింది .’’నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ‘’సంస్థ ఎంక్వైరీ కమిటీ సభ్యురాలుకూడా .

,                       అంతర్జాతీయ’’ ప్రధాన్’’

  అంతర్జాతీయ మహిళా ఉద్యమ మార్గ దర్శక నాయకురాలిగా మానస ప్రధాన్ గుర్తింపు పొందింది .అనేక జాతీయ , అంతర్జాతీయ  సంస్థలు ఆమెను ప్రసిద్ధ రచయితల ,కార్యకర్తల సరసన గౌరవ స్థానం కల్పించాయి .2016న్యూయార్క్ మాగజైన్ ‘’బజిల్ ‘’ఆమెను 20మంది ప్రపంచ ప్రసిద్ధ ప్రేరణ నాయకుల లో ఒకరుగా పేర్కొన్నది .ఇందులో నోబెల్ ప్రైజ్ వచ్చినవారు మొదలైనవారున్నారు .2017లో లాస్ ఏంజెల్స్ కు చెందిన’’వెల్కర్ మీడియా ‘’   మహిళా స్థితిగతులలో అర్ధవంతమైన  మార్పులు  తెచ్చిన  10మంది శక్తివంతమైన ప్రపంచ వ్యాప్త మహిళలో మానసను ఒకరుగా గుర్తించి గౌరవించింది.2018లో ఆక్స్ ఫర్డ్ లోని ‘’ఆక్స్ ఫర్డ్ యూనియన్ ఆఫ్ యూని వర్సిటి’’ మానసను ఆల్బర్ట్ అయిన్ స్టీన్ ,స్టీఫెన్ హాకింగ్ ,విన్ స్టన్ చర్చిల్ ,రోనాల్డ్ రీగన్ ,రిచర్డ్ నిక్సన్ ,మార్గరెట్ థాచర్ ,ఎల్టన్ జాన్ వంటి ప్రపంచ సుప్రసిద్ధుల సరసన గౌరవ స్థానమిచ్చి ఆహ్వానించి ప్రసంగం చేయించి సత్కరించింది .

  నిరుపేద  నిర్భయంగా పేదరికాన్ని ఎదుర్కొని ,పట్టుదలతో ఉన్నత విద్య సాధిచి ,మహిళా సాధికారత ,ఆత్మగౌర౦ కోసం నిరంతర పోరాటం చేసి సాధించి ,మహిళలపై సమాజం లో జరుగుతున్న  హింసా దౌర్జన్యాలపై న్యాయ పోరాటం చేసి వారికి అండగా ఉండటానికి ‘’నిర్భయ వాహిని ‘’స్థాపించి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మానస ప్రధాన్ ,మహిళలందరికీ ఆదర్శం ,స్పూర్తి మంతం .

  –గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ 

వ్యాసాలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)