కూచిపూడి నృత్య నాటికలు – చంధస్సు -dr.లక్ష్మణరావు ఆదిమూలం

ISSN -2278 – 478

            కూచిపూడి నృత్యరూపకాల  సాహిత్యాన్ని పరిశీలిస్తే అలంకారయుక్తంగా వ్యాకరణబద్ధ ఛందస్సుతో నిండి ఉన్నట్లు కన్పిస్తుంది.  అంటే యతి, ప్రాసలతో నాలుగు పాదాలుతో కలిగి లఘు అక్షరాలు, గురువు  అక్షరాలు కలయికగా గణ విభజన,  పాదానికి నియమిత అక్షరాలు  కలిగిన వృత్తాలతో కూడినదే ఛందస్సు.  కందం, కందార్ధం, ఉత్పమాల, చంపకమాల, శార్దులం, మత్తేభం,    ఉత్సాహం, స్రగ్ధర, తేటగీతి వంటి సంస్కృత  పద్యాలు  నృత్యరూపకాలలో కన్పిస్తాయి.  

                       
కందం లక్షణం:        ‘‘నగగ భజసు కందం

 బులమూడును నైదు షష్ఠము నలజలుబే

                         సుల  జగణ రహిత మంత్యగ

                         మలఘ పదత్రిగణవిరతామర్ధము హరీ!’’

.                కందపద్యంలో పద్యానికి నాలుగు పాదాుంటాయి.  న, గగ, భ, జ, స అనే గణాలు వస్తాయి.  బేసి గణంలో జగణం రాకూడదు.  ఆరవగణం ‘నల’ముకాని, జగణముకాని వస్తుంది.  2,4 పాదాలో చివరి అక్షరం గురువై ఉంటుంది.

                ‘ప్రవరాఖ్య’  నృత్య రూపకంలో ప్రవరుడు అతిధికి నమస్కరించి మర్యాదలు చేసే సమయంలో విషయాలను కంద పద్యంలో వివరించబడ్డాయి.

॥కం॥ ‘‘ఎందుండి యెందుబోవుచు / నిందులకేతెంచి నారలిప్పుడు `విద్వ

       ద్వందిత ` నేడుగదామ/  న్మందిరము ` పవిత్రమయ్యె మాన్యుడనైతిన్‌’’.

‘అర్ధనారీశ్వర’ నృత్యరూపంలో కంద పద్యంలో రచన సాగింది.

॥కం॥ ‘‘తల్లిదండ్రి గృహయునందున/  కలకల్లాడుచును వేడుకలు జరుగంగా

         తిలకింప మనసు తనయకు/  బలియన్‌ అత్తింటనుండ బాయదెతనువున్‌’’ 14.

వేదాంతం పార్వతీశం రచించిన ‘దక్షయజ్ఞం’ నృత్యరూపంలో తన తండ్రి యజ్ఞానికి పిువలేదని శివునివద్ద బాధపడుతుంది సతీదేవి.  అయినాసరే మనం కూడా కుటుంబంలో ఒక భాగమేకదా! మా నాన్న వచ్చి పివాల్సిన అవసరం లేదు.  నేను ఆ యజ్ఞనానికి వెళ్తానని అడుగుతుంది సతీదేవి శివుడిని.  ఆ సమయంలో శివుడు సతీదేవితో ఎంతవారైన సరే పివని పేరంటానికి వెళ్లడం మంచిదికాదని హెచ్చరిస్తాడు.  ఆ సందర్భంలోని మాటు కంద పద్యంలో రచించబడ్డాయి.

కందార్ధాలు  :   

కంద పద్యాలలో ఉండే నాలుగు పాదాలు వచ్చి మూడు, నాలుగు పాదాలు మరల మరల వస్తే అది కందార్ధం.  కూచిపూడి నృత్యరూపకాలో కందార్ధాలో మొదటిరెండు పాదాలలో చతురశ్రయంలో నడుస్తూ, మూడు, నాలుగు పాదాలు మిశ్రమ తాళంలో నడుస్తాయి.

                ‘ప్రవరాఖ్య’ నృత్యరూపకంలో ప్రవరుడి ఇంటికి అతిథి మర్యాదలు  స్వీకరించడానికి ఒక యోగి వస్తాడు.  ఆ యోగికి మర్యాదలు  చేసిన, అతనితో మాట్లాడుతున్న సందర్భంలోని మాటలు  కందార్ధంలో రచించబడ్డాయి.

కందార్ధం:              ‘‘కొలచితి కేదారేశుని / కొలచితి నే హింగుళాంబకోమలి పదముల్‌

                         కొలచితి మాధవ దేవుని/ కొలచితి శ్రీ విశ్వనాధుకోరికలలరన్‌

                         ఇలగల క్షేత్ర ములనెల్ల సేవించినాడన్‌/ కులగిరు లౌయాపటీ రాచల

                         పశ్చిమాచల హిమచల పూర్పిదిశ/ అచలంబును నెల్ల’’.

                దక్షయజ్ఞం నృత్యరూపకంలో నారదుడిని చూసిన పార్వతీదేవి ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతుంది.  ఎవరికైన ఆపద సంభవించినదా! లేక అసురులు  యుద్ధానికి సిద్ధమయ్యారా! అని ప్రశ్నిస్తుంది.  కాదు తల్లీ!  నీకు విషయం తెలియదా! మీ తండ్రి దక్షుడు యజ్ఞం చేస్తున్నాడు కదా, అందరికి పిలుపు వచ్చింది, దేవగణాధులు అందరూ అక్కడికే వెళ్తున్నాము.  నారదుడు చెప్పిన మాటలు  కందార్ధంలో రచించబడిరది“

॥కం॥                 ‘‘దక్షుని యాగము జూడగ

                         యక్షులు  గంధర్వ కిన్నరాదులను సురా/ధ్యక్ష పితామహా విష్ణుల్‌

                      నక్షత్రేశుడు ` రవి `వరుణయముల గనుమా /లక్ష్మివాణి శచీ`ఛాయ రేవతులురు గోనమ్మా/రక్షణకు దిక్పాల వసువులు/ దీక్షగను నలునిలచియుందురు

దక్షుడీసగెటి హవిర్భాగము/ కుక్షినిడుకొనజనెడు సురల జూడవెకొమ్మా!/

లక్ష్మి, వాణి, శచీ, ఛాయ, రేవతులరు గోనమ్మా॥’’ .

తేటగీతి : ఉపజాతులకి చెందినది తేటగీతి పద్యం.

                        ‘‘సూర్యుడొక్కరుండు సురరాజులిద్దరు

                         దినకరద్వయంబు తేటగీతి’’ .

                తేటగీతి పద్యంలో నాలుగు పాదాలుంటాయి.  ప్రతి పద్యపాదంలో ఒక సూర్యగణం, రెండు ఇంద్రగణాలు , రెండు సూర్యగణాలు  వస్తాయి.  మొదటి గణం మొదటి అక్షరానికి, నాల్గవ గణం మొదటి అక్షరానికి యతిమైత్రి చెల్లుతుంది .  ప్రాస నియమం ఉండదు.

                             పసుమర్తి వేంకటేశ్వర శర్మ రచించిన ‘మహిషాసురమర్ధని’ నృత్యరూపంలో మహిషాసురుడి మాటలు  తేటగీతిలో రచించబడ్డాయి.

॥తే॥  ‘‘మెచ్చినానునీ తపసుకు మిక్కటముగ/కరులో కాంతలో రత్నంపు గిరులో దెల్పి

        కొరుకోవయ్య వేగమె కూర్మినిత్తు/  రాక్షసేంద్రా వతం సమారాజమహిష’’ 19.

సీసము : ॥క॥‘‘ననగస భరతలలో

        పులునాఱును మీఁద రెండుఁబద్మాప్తగణం                         

       బులదగి నాలుగు పదముల

        జెలువగు నొక గీతిలోడ సీసము కృష్ణా!’’ .

                6 ఇంద్రగణాలు , 2 సూర్యగణాలు  వస్తాయి.  చివరలో ఆటవెలదికాని, తేటగీతి కాని పద్యం తప్పనిసరిగా ఉంటుంది.

                ‘ప్రవరాఖ్య’ నృత్య రూపంలో ‘సీసపద్య’ రచన ఈ విధంగా సాగింది.

॥సీ॥                నిడుద పెన్నెరి గుంపు। జడగట్టసగరుము।

                                      మ్మను మండు। తపము గైకొనిన చోటు।

                         జరఠ కచ్చపకులే। శ్వరు నెన్ను గానరా।

                                జగతికి మీన్నేరు। దిగిన చోటు।

                         పుచ్చడీ కతనమ్ము। పోబెట్టి గిరికన్య।

                                పతిగీల్వనా। యాసపడిన చోటు।

                         వలరాచవాచనా। డలికాక్షుకను వెచ్చ।

                                గరిగిన యక। నికరపు జోటు.’’ 21.

                పసుమర్తి వేంకటేశ్వర శర్మ రచించిన ‘మహిషాసుర మర్ధని’ నృత్య రూపంలోను సీస పద్యం కనిపిస్తుంది .  వేదాంతం వారి  ‘దక్షయజ్ఞం’  నృత్యరూపంలో దక్షుడు యజ్ఞం చేసే సమయంలో అందరిని పిలిచి శివుడు, సతీదేవిని ఆహ్వానించడు.  ఆ విషయం తొసుకున్న సతీదేవి శివునితోనాధా! తల్లిదండ్రుకు తనయ పైనను కోపం ఉండునా? పిలువ వచ్చినవారు, మనను పిలవటం మరిచిపోయారేమో అని అనుకుంటున్నానని శివుడికి చెబుతుంది.  ఆ సందర్భంలోని సంభాషణలు  సీసపద్యంలో రచించాడు రచయిత.

ఉత్పమాల  :          

ఉత్పలమా పద్యంలో నాలుగు పాదాలుంటాయి.  ప్రతి పాదానికి 20 అక్షరాలు వస్తాయి.  ప్రతి పాదంలోను వరసగా భ,ర,న,భ,భ,ర,వ అనే గణాు వస్తాయి.  ప్రాసనియమం ఉంటుంది.  ప్రతిపాదంలోని మొదటి అక్షరానికి, పదవ(10) అక్షరానికి యతి మైత్రి పాటించబడుతుంది.  వేదాంతం పార్వతీశం రచించిన ‘ప్రవరాఖ్య’ నృత్యరూపంలో             ఉత్పమా పద్యపాదంలో రచించబడిరది. 

                ‘‘అండజయాన్‌ నీ నొసగు నట్టి సపర్యలు  మాకు వచ్చె`నిం

                 ………………………………………………………

                 కండను దీర్పవేగచనీ గావలయుంగ రుణింపు నాపయిన్‌’’ 25.

శార్దులం  :              

శార్దులం  పద్య పాదానికి నాలుగు పాదాలుంటాయి.  ప్రతి పాదంలోను 19 అక్షరాలుంటాయి.  ప్రతి పాదంలోని ‘మ,స,జ,స,త,త,గ’ అనే వరసగా వస్తాయి.  ప్రాస నియమం ఉంటుంది.  ప్రతి పాదంలోను మొదటి అక్షరానికి, 13వ అక్షరానికి యతిమైత్రి చెల్లుతుంది.

                ‘దక్షయజ్ఞం’ నృత్య రూపకంలో……

॥శా॥ ‘‘ఏకాస్యంతు ` చతుర్భుజం `త్రినయనం  వామే తుదుష్టూరగం

        చంద్రం పత్రశిఖిప్రసారితకరం ఊర్ధ్వం పదం కుంచితం                                       

       సర్వేస్వస్ధిక మండలం  కుమరుకం గంగేజటే బిభ్రతం

      వందే కీర్ణజట్నాన్న టేశ అనిశా పస్మారదేహేస్తితం’’ 27.

మత్తేభం :               

మత్తేభం పద్యానికి నాలుగు పాదాలుంటాయి.  ప్రతి పాదానికి వరసగా స,భ,ర,న,మ,య,వ అనే గణాలు వస్తాయి.  ప్రతి పాదంలోను 20 అక్షరాలుంటాయి.  ప్రతి పాదంలోను మొదటి అక్షరానికి, 14వ అక్షరానికి యతి మైత్రి పాటించబడుతుంది.

                ‘దక్షయజ్ఞం’ నృత్య  రూపకంలో యాగం చేస్తున్న దక్షుడు దేవతలందరిని ఆహ్వానించి శివుడు, సతీదేవి ఆహ్యానించడు.  ఎందుకు శివుడిని యాగానికి పిలువలేదని దధీచి ప్రశ్నించినప్పుడు, దక్షుడు చెప్పే సమాధానం మత్తేభవృత్త పద్యంలో రచించబడిరది.

        ॥మ॥ ‘‘అదెమాయాగమునందు దేవతలున య్యంభోజనాధుండునున్‌

                 …………………………………………………………………

                 న్విదతంబై శృతి పూర్వమైన రగావింతున్‌ మఖంబున్నతిన్‌’’ 28.

భుజంగప్రయాతః :

                ‘‘భుజంగేశ పర్యంక పూర్ణా నురాగున్‌

                 భుజంగ ప్రభూతాఖ్యఁబూరించు చోటన్‌

                 నిజంబై ప్రభూతావనీభృద్విరామం

                 బజస్రంబుగా ఁగూర్ప యాద్వంద్వ మొప్పున్‌’’ 29.

        అనంతమాత్యుడు ఛందోదర్పణం గ్రంధంలో వివరించాడు.  ఈ గ్రంధాన్ని చిర్రావూరి శ్రీరామశర్మ వ్యాఖ్యానం రాసాడు.

                హేమాద్రి చిదంబర దీక్షితులు  రచించిన ‘గిరిజా కల్యాణం’ నృత్యరూపకంలో మన్మధుడు శంకరునిపై బాణాలు ప్రయోగించే సందర్భంలోని ఘట్టం భుజంగ ప్రయాతః లో రచించబడ్డాయి.

‘‘గియి కదు నదు పొంగు కేశవుండు పర్విదున్‌

 వియి మ్రోడులందు విరియు మరులు  మ్రగ్గి వేగుడున్‌

 సురులు  సాథ్యు యక్షులెవరు పోలిపోకయుందు రా

కరకు నల్ల  గల్వశరము కాల్చివేయు ప్రకృతిన్‌.’’ .

గీతి :

లక్షణం :`                    ‘‘లసదార్య మొదలిసగమున

                         నెసగగ రెండరలు  జెప్పిరే నదియే గీ

                         తి సమాహ్వయ మగు గృతులన్‌

                         వసుధాదం కృష్ణ యాదవ సామియనన్‌’’ 31.

                ‘దక్షయజ్ఞం’ నృత్య రూపకంలో వేదాంతం పార్వతీశం.  దక్షుడు చేసే యాగానికి అందరికి ఆహ్వానం పంపి, శివుడిని ఆహ్వానించడు.  విషయం తెలుసుకున్న సతీదేవికి శివుడు పిలువని పేరంటానికి వెళ్లరాదని వారించినా వినకుండా యాగం దగ్గరికి వెళ్తుంది.  అక్కడ దక్షుడికి, సతీదేవికి మధ్య జరిగిన సంభాషణ గీతిలో రచించబడిరది.

        ॥గీ॥  ‘‘సృష్టికాధార భూతుడా శివుడెయనియు

                 సర్వసముడు సర్వవ్యాపి సార్వభౌము

                 డంచు వేదాలు  ఘోషించుటంతనెరిగి

                 అల్లుడనియైన దలపవేమయ్య తండ్రి’’ .

ఈ విధంగా కూచిపూడి నృత్య నాటికలో ఛందో బద్దంగా సాహిత్యం కనిపిస్తుంది .  వృత్తాలు జాతులు , ఉపజాతులలో చందోబద్దమైన పద్య రచన చేయడం ఉంది . దృశ్య సంబంధమైన రచనలలో పద్యాల ప్రాముఖ్యత ఎక్కువనే చెప్పాలి . అలాగే నృత్యం అనగానే అటు సంగీతం , ఇటు సాహిత్యం కలయిక కాబట్టి పద్యానికి సముచితమైన స్థానమే ఉంటుంది . అందువలన నృత్య నాటికలలో పద్యాలకి ప్రాధాన్యత ఎక్కువ కనిపిస్తుంది .

-dr.లక్ష్మణరావు ఆదిమూలం

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

UncategorizedPermalink

Comments are closed.