కూచిపూడి నృత్య నాటికలలో “దర్వులు” – వైవిధ్యం- డా.లక్ష్మణరావు ఆదిమూలం

  ISSN-2278 – 478

                భారతీయ అంకారికులు  కావ్యాన్ని స్వరూప, స్వభావం, వస్తువులను  అర్థాన్నిబట్టి నాలుగు రకాలుగా వర్గీకరించారు.  వీటిలో స్వభావాన్నిబట్టి రెండు రకాల  కావ్యాలను పేర్కొన్నారు.  అవి శ్రవ్యకావ్యం మరియు దృశ్య కావ్యం.

                శ్రవ్యం అనగా వినదగినది.  వినడానికి రచించబడిన కావ్యాలు  శ్రవ్యకావ్యాలు .  ఒకరు చదవడం కాని, వారే స్వయంగా చదువుకొని ఆనందించే కావ్యాలు . ‘దృశ్యం’ అనగా  చూడదగినది.  ప్రదర్శనకు అనుకూలంగా రచించబడిన కావ్యాలను ‘దృశ్యకావ్యాలుగా చెబుతారు.   వినడానికి, చూడటానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది.  వినడంకంటే కనులార చూసిన దృశ్యం హృదయంలో చెరగని ముద్ర వేసుకుంటుంది.  అందుకే ‘‘కావ్యేషు నాటకం రమ్యమ్‌’’ అన్నారు పండితులు .  దృశ్య కావ్యానికే రూపమనీ, రూపకమనీ, నాటకమనీ పేర్లు.

                భరతుడు ‘నాట్యశాస్త్రంలో నాటక రచన గురించే కాక రంగస్థల  నిర్మాణం, ఆహార్యాలు , అభినయం అవస్థలు  మొదలైన వాటి లక్షణాల్ని గురించి కూడా వివరించాడు.  ధనుంజయుడు ‘దశరూపకం’లోనూ, విశ్వనాధుడు ‘సాహిత్యదర్పణం’లోనూ, ప్రతాపరుద్రీయంలోనూ నాటక నిర్మాణం గురించి, నాటక లక్షణాలను వివరించాడు.

                దృశ్య కావ్యాలను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు.  రూపకాలు,   ఉపరూపకాలు. రూపకాలు  పది రకాలు .  ధనంజయుడు, దశరూపకాలను ఈ శ్లోకంలో పది అని వివరించాడు. 1.నాటకం, 2.ప్రకరణం, 3.డిమం      , 4.సమవాకారం, 5.ఈహమృగం, 6.బాణం, 7.వీధి, 8.ప్రహసనం, 9.అంకం, 10.వ్యాయోగం . నాటకంలో ఇతివృత్తం, నాయకుడు, రసం, అంకాలు, సంధులు, వృత్తులు వంటి వాటిని రూపక బేధాలు పట్టికలో నాటక లక్షణాలుగా వివరించాడు ధనంజయుడు. 

                విశ్వనాధుడు ‘సాహిత్యదర్పణం’’లో ఉపరూపకాల్ని 18గా పేర్కొన్నాడు.  అవి:        నాటిక , తోటకం, సట్టకం , సంలాపకం , ప్రేంఖణం   , ప్రకరణి , ప్రస్ధానకం , నాట్యరాసకం , రాసకం , ఉల్లాప్యం , విలాసిక, శ్రీగదితం , శిల్పకం        , గోష్ఠి , కావ్యం , దుర్మల్లిక , హల్లీసకం   , భాణిక . వీటిలో మొదటి ‘ఏడూ’ ప్రధానమైనవి.  వాటిలోను ‘నాటిక’ మాత్రమే సమాజంలో బాగా ప్రాచుర్యంలో ఉంది.

                సామాన్య జన వ్యవహారంలో నాటకం, నాటిక అనే పదాలు ఒకే అర్ధంలో ఉపయోగించటం జరుగుతుంది.  కాని, నాటకంతో పోల్చినప్పుడు నాటిక అంకాలు(నిడివి) విషయంలో బేధం కన్పిస్తుంది.  నాటికకు 4అంకాలు మాత్రమే  ఉంటాయి.

                కూచిపూడి భాగవతులు  ప్రదర్శనను పరిశీలిస్తే అంకార యుక్తంగాను, దేశీఛందస్సుతోను అలరారుతూ కన్పిస్తుంది.  యక్షగానాలు, కలాపాల వలె నృత్య రూపకాల్లోనూ కూడా సందర్భాన్నిబట్టి దరువు ఉపయోగించారు.  పల్లవి, అనుపల్లవి, చరణాలతోకూడి ఉండే సంగీత రచన దరువు.  ఈ దరువులో ప్రవేశ దరువు, సంవాద దరువు, వర్ణన దరువు, ఆత్మాశ్రయ దరువు, ఆఖ్యాన దరువువంటి బేధాలు ఉన్నాయి.

                కూచిపూడి నృత్యరూపకాలు రచించిన నర్తకున్నారు.  హేమాద్రి చిదంబర దీక్షితులు, వేదాంతం పార్వతీశం, బొమ్మకంటి వీరరాఘవాచార్యు, పసుమర్తి వేంకటేశ్వరశర్మ, కోడూరి సుమన, కోసూరి ఉమాభారతి, అరుణాభిక్షు, దండిబోట్ల వైకుంఠ నారాయణమూర్తి, వేదాంతం రామలింగ శాస్త్రి వంటివారు నృత్యరూపకాలు  రచించారు.

కూచిపూడి నాట్యకళాకారులు ప్రదర్శించే నృత్యరూపకాలో అలంకారయుక్తంగా, దేశ ఛందస్సుతో రచించబడ్డాయి.  నృత్యరూపకాలలో దరువులకు ప్రత్యేకస్థానం ఉంది.  దరువంటే మాత్రా ఛందస్సుతో, సాధ్యమైనంత వరకు చతురస్రంలో నడుస్తూ పల్లవి, అనుపల్లప్లవి చరణాలతో కూడి    ఉండే సంగీత రచన.  ‘‘సంస్కృత నాటకాల్లో కనిపించే ధృవాగానమే యక్షగాన రచనల్లో దరువుగా చెప్పవచ్చు.’’ 2.  నాట్య శాస్త్రంలో దరువు ధృవగానాలు అనే పేరుతో 5 విధాలుగా చెప్పబడ్డాయి.  వీటినే నృత్యరూపకాలలో ప్రదర్శిస్తారు.         ప్రవేశ దరువు , సంవాద దరువు , వర్ణన దరువు , ఆత్మాశ్రయ దరువు , ఆఖ్యాన దరవు.

ప్రవేశ దరువు :

పాత్ర ప్రవేశ సమయంలోని దరువును ప్రవేశ దరువుగా పిలుస్తారు.  పాత్ర ప్రవేశిస్తూ తనను తాను పరిచయం చేసుకుంటూ  ఏ దేశంనుంచి వచ్చాడు, ఏ పనిమీద వచ్చాడు, ఏ ఏ వాటిలో సమర్ధుడు వంటి విషయాలను వేరొకపాత్రని పరిచయం చేయడం కూడా జరుగుతుంది.

               ‘ఫేరణి  శంకరప్పలో’ ` వేదాంతం పార్వతీశం ప్రవేశ దరువును రచించారు.  శివుడు ప్రవేశించే సమయంలో వస్తుంది ఈ దరువు.

                        ‘‘ఓయి ఓయి జంగమా……..ఓంకార లింగమా

                         నాణ్యమైన జంగమా……..నా ప్రాణ లింగమా

                         ఎత్తుకాు గిత్తనెక్కి ` అట్టే తిరుగు జంగమ

                         బిచ్చమెత్తు వాడవాడ ` భీమేశ లింగము’’ .

                ‘మోహినీ  భస్మాసుర’ రూపకంలో వేదాంతం పార్వతీశం వృకాసురుడు ప్రవేశాన్ని దరువులో రచించాడు.

                        ‘‘వృకాసురుండను నిశాచరుడ తా

                         నిజన భూము తపమునకు వెడలె                      ॥వృ॥

అ॥ప॥                        భేకమూకుర ` విమాచ్చరవితతి

                         నాకమేు పోకిరీని వ్రేల్చేద                         ॥వృ॥

                         చిచ్చరి కాడే కన్ను విచ్చితా

                         పచ్చమ్తిని బూదిజేసినటు

                         మచ్చ రంబునను మానవాళిని

                         భస్మరాసుగ మననముజేర్తు’’ 4.               ॥వృ॥            ‘ప్రవరాఖ్య’ నృత్య రూపంలో…. ప్రవేశ దరువు…..

                        ‘‘వచ్చెగద యోగబ్ధుడు

                         వి విధౌషధ సిద్దుడు

అ॥ప॥                        వచ్చె విను వీధి ` వియచ్చరుడనగను

                         వాతాధూత ` విలాస నడక’’ 5.                 ॥వచ్చె॥

ఆఖ్యాన దరువు :                  

ఇతివృత్తాంతాన్ని సంక్షిప్తంగా తెలియజేసే దరువు ఆఖ్యాన దరువుగా చెబుతారు.  ప్రదర్శన నిడివి ఎక్కువ అవుతున్న సందర్భంలో కథను సంక్షిప్తంగా చెప్పే సమయంలో ఆఖ్యాన దరువును ఉపయోగిస్తారు.

                వేదాంతం పార్వతీశం రచించిన ‘దక్షయజ్ఞము’ నృత్యరూపకంలో నైమిశారణ్య ప్రదేశంలో బ్రహ్మసత్రాయాగము చేసే సన్నివేశంలో కథాగమనం ముందుకు సాగుతుంది.  ఈ దరువు శహన ` ఆది తాళంలో నడుస్తుంది. 

                        ‘‘చూడరే ` మూర్తి త్రయము                              ॥చూ॥

అ॥ప॥                చూడరే మనమున వేడుక లరగ

                         పొడిమి మీరగ పురుషోత్తమును                 ॥చూ॥

                         సృష్టిస్థితి లయకారు

                         పోషితజన ` లోకాలకాధారు                       

                          నృష్ట్యాదు ` తమలోనజూచు

                          క్షేత్రజ్ఞు త్రిదళాధినాధు’’ 7.

ఈ దరువు సావేరిరాగం, ఆది తాళంలో సాగుతుంది.

                        ‘‘వినుడు `దెల్పెదను ` మీరు వేడుకమా

                         జనలోక యెరుక పద                            ॥విను॥

                         అ॥ప॥ వనజ సంభవుని తనయడవైభువి

                         వాసవాది దికృతు ` శ్వశరుదన                 ॥వి॥

                         సురాసుయి నాసుతాళి తనయు

                         చరాచరంఋ నాదెసంతతి’’  8.

వర్ణన దరువు :                        

వర్ణన దరువులో పల్లవి, అనుపల్లవి, చరణాలతో సన్నివేశంగాని, పాత్రలు ఉండే స్థల వర్ణన కాని, వ్యక్తుల  గుణగణాలు గాని వర్ణించబడతాయి.

                వేదాంతం పార్వతీశం రచించిన ‘మోహినీ భస్మాసుర’ నృత్యరూపంలో వర్ణన దరువులో సాగుతుంది.

                        ‘‘బంగారు ఖంగు ` చంగా వింగ

                         సింగారముగ ` ధరించీ

                         గబ్బిగుబ్బకు ` అబ్బురంబుగా

                         మబ్బురైకదొడిగి

                         రంగారు జిుగు ` బంగారు మవ

                         శృంగారముగ, పైట…..’’  `అంటూ మోహిని రూపాన్ని, నడకని వర్ణించడం కన్పిస్తుంది.

                ‘అర్ధనారీశ్వర’  నృత్యనాటకంలో ఈ దరువు వర్ణన దరువుగా చెప్పవచ్చు.

                        ‘‘అవతరించె జూడరె, హరుడర్ధనారిjైు        ॥అవ॥

అ॥ప॥               కుడుముదమున ` కాత్యాయని కొర్కెతో                   

                         కుడి యెడమ స్త్రీ`పురుష రూపమున            ॥అవ॥

                         శూదక్షిణ పాణిjైు ` కరకంకణ నిర్యణ

                         నామభాగపాణిjైు

                         చేలాంతరమున లన పురుషుడై

                         లలిత కళాస్వరూపమున రంజి’’ .   “అంటూ  శివుడు అర్ధనారీశ్వరుడుగా మారే సందర్భాన్ని, మారిన తరువాత అతని కుడి, ఎడమ శరీరాన్ని, అస్త్రాలను ఈ వర్ణన దరువులో వర్ణించాడు రచయిత.

సంవాద దరువు :      

సంవాద దరువును పరిశీలించినట్లయితే రెండు పాత్ర మధ్య జరిగే సంభాషణకు సంబంధించినదిగా ఉంటుంది.  కూచిపూడి యక్షగానాలలో సంవాద దరువుకి తగిన ప్రాధాన్యత ఉన్నట్లే నృత్యరూపకాలలోను ప్రాముఖ్యత ఉంది.  వీటిలో పల్లవి, అనుపల్లవి, చరణాలు వంటివి ఉండవు.  తాళగతిలో మాత్రా ఛందస్సులో సాగే సాహిత్యం ఉంటుంది.

        వేదాంతం పార్వతీశం ‘అర్ధనారీశ్వర’ నృత్యరూపకంలో సంవాద దరువును రచించాడు.  ఈ సంవాద దరువులో శివుడు, పార్వతి, భృంగిరీటి మధ్య సంవాదం జరుగుతుంది.

భృంగి:                      వింటివా ` పార్వతి కంటి

        అ॥ప॥                బంగరు బొమ్మ వలె తల్లి

                        పార్వతి నీవుండ గాను

                        గంగమాంబను దెచ్చిశివుడు

                        పొంగి శిరమున బెట్టుకున్న

                        డెరుగవా `నీవే `మెరుగవా

        ॥పా॥         గంగమాంబను దెచ్చి నావని ` భృంగి నాతోదెల్పె

                        మగనాలి పొందు తగదంటంచును

                        యింగితమింతైన ` యెరుగవదేమయా

                        స్వామీ ` యెవరమాశివ:                    

                       నిండు వేసవి కామున ` జ

                        ముండునో లేకుండునోయని

                        దండిగా ` నది ` దెచ్చిజడలో

                        దాచియుంచినానుగాని ` యెరుగనే

                        అన్యమెరుగనే

భృంగి:                 కాని పోనీ మాటలేయె

                        క్పన జేసెనుగాని

                        స్వామి దెచ్చుట ` నదియె jైుతే

                        చక్కని ముఖముండుటేమో

                        అడుగవే ` నీవేయడుగవే’’ .

                శివుడికి, పార్వతికి జరిగే వాదనలో భృంగిరీటి పార్వతి తరపున మాట్లాడుతూ గంగాదేవి గురించి శివుడితో వాదన ఈ సంవాద దరువులో సాగుతుంది.

                         ఈ విధంగా కూచిపూడి నృత్య నాటికలలో దరువులకి ప్రత్యేక స్థానం ఉంది . నాటికను చూస్తున్న ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో దర్వులు ప్రముఖ పాత్ర వహిస్తాయి .

డా .లక్ష్మణరావు ఆదిమూలం

సాహిత్య వ్యాసాలు ​Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో