మట్టిపాదాలు పదాలైతే అమ్మ (కవిత )-పేరం అమృతరావు

అమ్మ సీరపైన సొక్క తొడుక్కొని
పత్తిచేలో పత్తి తీస్తుంటే
ఆపరేషన్ థియేటర్లోని డాటరమ్మలా ఉండావే
పురుగుపట్టి పంటపోతే
నష్టపరిహారం రైతుకిచ్చి
ఖాళీ గిన్నేకదా నీకూలికి కిరీటం

*********
ఏం చేద్దాం చెప్పు ….?
పుట్టింటికాడ తోమిన అంట్లు సాలవన్నట్టు
ఆడపిల్లకు సదువెందుకని
మెట్టినింటికి కూడా సామాన్లేసి పంపిండు నియయ్యా

********
తలకు మించినభారం వొద్దనుకొని
నీతలకో తమ్మే దగిలిస్తే
సారా తాగేమొగుడితో సంసారానీదుతున్నావ్
గుదిబండలాంటి జీవితం
గుప్పెడు మెతుకులకోసమే కదా !

********
కాదు కాదు నా కోసమని కూలీనాలీ చేసి
నీ కొంగుకు ముడేసి కట్టి
నాకోసం దాచిన యాభైరూపాయిల నోటు చుస్తే
నలిగిన నోటుమీద వవ్వే గాంధీ కూడా ఏడుస్తూనే కనబడతాడు

*********
నీ బతుకును ఎగతాళి చేసి
పసుపు తాడే పలుపుతాడులా
కట్టుబాట్ల కట్టుగొయ్యకు నిన్ను కట్టిపడేస్తే
ఆ పసుపుతాడును నీ చిక్కేంటికలతో కొని
సనాతన ఆచారాల చెంప చెళ్లుమనిపించావు చూడు
నీ మట్టిపాదాలకు నా అక్షరపుష్పాంజలి

 -పేరం అమృతరావు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)