నీలి గోళాకారం(కవిత )- సలేంద్ర రాజేశ్వరి

ఈ నీలి గోళాకారంలో….
గందరగోళ జీవన్మరణాల జీవులమధ్యలో…
తమ మనుగడను ఏర్పాటుచేసుకున్న
ఈ నలుదిక్కుల దిశలో…
శ్వాసతోపురుడుపోసుకునే ఆడబిడ్డ….
పిడిదెబ్బలదారుణాలలో…
మానవత్వాన్ని కోల్పోయిన సమాజంలో…..
మానవత్వాన్ని మరచిన
ఈ హృదయాల మధ్య బలవంతంగా…
బలంగా…
బరువైన ఓరక్తపుముద్దగా..
అమ్మ కడుపు చీల్చుకుని…
మనుషుల చితిమధ్యలోకి పేగుబంధంతో
ప్రేతలోకం నుండి
భూలోకంలోకి భయంతో…
హృదయం బరువై…
కడుపులోనుండే ఈ కటకటాల మానవాళిలోకి వచ్చి
ఒక మనిషిగా
ఆడబిడ్డగా చెల్లిగా
అక్కగా స్నేహితురాలిగా
పెద్దలకు నమ్మకంగా
ఒక గౌరవంగా
పతికి పత్నిగా
అత్తమామలకు
కోడలిరూపంగా
బిడ్డలకు తల్లిగా కనురెప్పగా
బంధు బాంధవ్యాలకు
అనాధలను ఆదుకునే అమ్మలాగా
చదివే పిల్లలకు ఎదుగుదలలాగా
అమ్మాయిగా యువతిగా అర్ధాంగిగా…
“స్త్రీ” అనే సంయుక్త సమాజంలో ఒక విశేషం…
కానీ..
ప్రస్తుత సమాజంలో దౌర్భాగ్యం….
స్త్రీని చంపేస్తూ అత్యాచారాలు చేస్తూ
నాశనానికి ఒడిగడుతూన్న సమాజంలో ….
కాకులలాంటి కామాంధుల మధ్యలో…
చూపుల సూదులతో కుచ్చేసే
దుర్మార్గపు దరిద్రాలను తట్టుకొని….
తన బాధలను తన చీరలో చుట్టుకొని
తన కళ్ళలో భయంతో బెరకుతో
భవిష్యత్తు కోసం బాటలు వేస్తూ
నేటి యువతరానికి
నాంది పలుకుతూ
ముందంజలోరాణించడానికి ప్రయత్నిస్తూ….
సూదికి దారం ఎలా తోడవుతుందో…
కంటికి రెప్ప ఎంత అవసరమో..
అంతరించిపోతున్న ఆడబిడ్డలను
తిరిగి మానవాళిలో చైతన్యాన్ని
వికాసాన్ని వికసింప జేస్తూ
నవసమాజానికి నిర్మాత వలె
అభ్యుదయ సమాజాన్ని నిర్మించుటకై…
కష్టాన్ని ఇష్టంగా స్వీకరిస్తూ…
ముందంజలో దైవమై నడుస్తూ…
ఊపిరినిస్తూ…
తన వాళ్ళను రక్షిస్తూ…
ఆణిముత్యాలపలుకులతో
కదనరంగలో ప్రయాణిస్తూ….
స్త్రీ ” శక్తిని ” పాఠంగా బోధిస్తుంది.
“సూర్యరశ్మి లేని వాతావరణంలో చిమ్మచీకటి నెలకొంటుంది
ప్రకృతి లేని భూమిలో వికృతచేష్టలతో చెలరేగిపోతుంది
మగవాడి మానసిక అభివృద్ధికి స్త్రీ తోడ్పడుతుంది
మగువ సహాయం.. మగవాడి విజయం
జగతి నిర్మూలం…
జనని జగతీయం

– సలేంద్ర రాజేశ్వరి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

UncategorizedPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)