లుత్ఫ్ ఉన్నీసా ఇంత్యజ్ (ఉర్దూ సాహిత్య తొలి కవయిత్రి)-

        లుత్ఫ్ ఉన్నిస ఇంత్యజ్ హైదరాబాద్ (దక్కన్) కి చెందిన కవయిత్రి.ఈమె ఉర్దూ సాహిత్య తొలి కవయిత్రిగా పేరు పొందారు.ఉర్దూ తొలి “సాహెబ్ డివాన్” కవయిత్రిగా ఉర్దూ సాహిత్యంలో ప్రసిద్ధి పొందారు. ఇటీవల పరిశోధనలతో కొంత మంది పరిశోధకులు తమ పరిశోధనలతో తొలి ఉర్దూ కవయిత్రి గా “మహలఖ బాయి చందా” అనే పేర్కొనేవారు కాని ఉస్మానియా విశ్వవిద్యా లయ పరిశోధకులు “డాక్టర్ అష్రాఫ్ రఫీ సాహెబ్” తమ పరిశోధనలతో విమర్శిస్తూ “లుత్ఫ్ ఉన్నిస ఇంత్యజ్”గా నిరుపించారు. ఎందుకంటే చందా దివాన్ (1798)లో ప్రచురింపబడింది .దానికి ముందు చందా దివాన్ (1797)లో ప్రచురింపబడింది.
ఇంత్యజ్ పూర్తి పేరు లుత్ఫ్ ఉన్నిస. ఇంత్యజ్ ఈమె బిరుదు.ఈమె తల్లి చిన్నప్పడే మరణించింది. ఈమె భర్త “అసద్ అలీ తమ్మన తన కాలంలో ప్రసిద్ధ కవి.పెళ్లి అయిన ముప్పయి ఆరు (36) సంవత్సరాల తర్వాత 1204 లో అసద్ మరణించారు.
*కవిత్వం:-* లుత్ఫ్ ఉన్నిస ఇంత్యజ్ దాదాపు 184 గజల్లు రాసింది .ఈమె డివాన్ లో మొత్తం 184 గజల్లు ఉన్నాయి.డివాన్ అనగా కవిత సంపుటి. డాక్టర్ అహ్మద్ అలీ షకీల్ ఈమె సంపుటి ని ప్రచురించారు లుత్ఫ్ ఉన్నిస ఇంత్యజ్ తన కవిత్వాన్ని వివిధ ప్రక్రియలో రాసింది.ఈమె తన కవిత్వం లో ఒక చోట పద్య మకుటం రాసింది. ఆ మకుటం:-
“కె అవ్వల్ జూదాయి క్యా బాప్ మా
సవ బరస్ కీ థీ యె జాన్
తో పాయి ఇస్ ఉమర్ మే మానె ఫౌత్
దీ ఖిలత్ బస్ రె కి జబ్ ఆకె మౌత్”

ఈ మకుటం యొక్క అనువాదంతో ఇంత్యజ్ స్వంత బాధ స్పష్టంగా వివరిస్తుంది దీంతో ఆమె నిజ జీవితం యొక్క సంఘటనలు వెలువడ్డాయి. ఇంత్యాజ్ ఒక మాస్నవి “గుల్షనె షొరా” వ్రాసింది ఈ మాస్నవి ఆరు వేళ మకుటల పైన నిర్ధరింపబడ్డై.
ఇంత్యాజ్ కవిత్వ భాష సర్వస్వం, అత్యంత ప్రియమైన కవయిత్రి ఇంత్యాజ్, అక్షరాక్షరంలో అర్థం పొదిగి ఇచ్చిన కవయిత్రి. అందుకే ఈమె పరిశోధన ఉర్దూ “సాహెబ్ డివాన్” కవైత్రిగా ప్రచురితమైంది ఈమె భారతదేశపు పండుగలు పైన కవిత్వం కూడ రాసింది హోలీ, భసంత్ మొదలగు పండుగల గురించి ఆమె తన మనోభావాలను ఆవిష్కరించింది కేవలం పద్యాలకు పరిమితం కాకుండా విలక్షణమైన ఇంత్యాజ్ గజల్ల యొక్క మకుటాలు:-
*1-* తోడ్ మత్ దిల్ కె తయి ఖాన ఖుదా కహెత్ హై
మొహబ్బత్ యారె క యె జల్వ నుమ కహెత్ హై
*2-* ఆంఖొ మె తేరె హుస్న్ కి అబ్ జల్వ గిరి హై
దీడార్ కె వాదే కి భీ క్య వాద గిరి హై
*3-* శిశయె దీల్ మే హమారె వో పరి రెహ్తి హై
అఖల్ ఇన్సాన్ కి జిసే దేఖ్ ధరి రెహ్తి హై.

నేహా నూరీన్
*స్కాలర్ ఆఫ్ యం.ఫీల్ ఉర్దూ*
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ
––——————————————-——-

వ్యాసాలు, సాహిత్య వ్యాసాలు ​Permalink

Comments are closed.