ఆవరణం (కవిత)-వెంకట్ కట్టూరి

దేవాలయం విద్యాలయం
సులువుగా తలరాతలు మార్చబడేది ఇక్కడే
జీవితాలు చిందరవందరయ్యేది ఇక్కడే
ఆనందడోలికల్లో తేలేది ఇక్కడే
విషాదంలో మునిగిపోయేది ఇక్కడే
వయసుపిలిచేది ఇక్కడే
ఓర కంటితో కన్ను గీటేది ఇక్కడే
తొలిచూపుతో వలచి కాలు జారిపడేది ఇక్కడే
జీవితం సర్వనాశనం అయ్యేది ఇక్కడే
చేసిన నేరానికి శిక్ష అనుభవించేది ఇక్కడే ….
విద్యా బుద్దులు నేర్చుకొమ్మంటే
లేదంటూ ప్రణయ కలపాల్లో మునిగి పోయేది ఇక్కడే 
కాలంతో పాటుకరిగిపోయేది ఇక్కడే
మొహంలోపడి తెరుకోలేవురా
పడవ మునిగి పోయేదాక జీవితం తెల్లరిపోయిందని
తెలుసుకోలేవురా
గాణాoకాలు నేర్చుకోరా అంటే ఆమెకెన్ని
మాసాలో లెక్కపెట్టేవు కదరా ….
బుద్దిగా చదువుకొనేది ఇక్కడే
మందమతులుగా మారేది ఇక్కడే …..
ఇదేరా జీవితం సత్యం తెలుకోరా వెంకటసత్యం …

– వెంకట్ కట్టూరి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Comments are closed.