మేమెవరం ?(కవిత )– వెంకట్ కట్టూరి

ఎవరం మేం ఎవరం
వర్ణ సంకరం చేసారు
జాతిసంకరం అన్నారు
వెలివాడల్లోకి నెట్టారు
మురికి కూపాల్లో మాసిపోయిన

శరీరాలతో కంపుకొడుతూ
కట్టుకోడానికి గుడ్డ పీలిక లేదు
రొచ్చుకంపులో బతికేటోళ్లం
రోతబురదల్లో మసలేటోళ్ళం
ఎవరం మేం ఎవరం…

కామంతో మదమెక్కిన ఏనుగుల్లా
మా ఆడ బిడ్డలను
చెరిచారు మీకామాగ్నికి
బలైపోయిన ఎందరో
అభాగ్యురాళ్ళ జీవితాలకు
సజీవ సాక్ష్యం మేం
ఎవరం మేం ఎవరం…

అక్రమ సంతానమని
పేరుపెట్టి, గ్రామంలో లేకుండా
పొలిమేర అవతలకు గెంటేసి
హీనజాతిగా ముద్రవేశారు
కడజాతి వారిగా చేశారు
ఎవరం మేం ఎవరం….

మా బతుకుల్లోనిప్పులు పోసి
ఆమంటల్లో చాలికాచుకుంటున్నారు
మా రక్తమాంసాలు
రెక్కలకష్టాలు
దోచుకు తింటున్నారు
ఎవరం మేం ఎవరం…

బడిలో గుడిలో ఒడిలో
కూసింత చోటు లేనోళ్లం
ఊరవతల విసిరేసినోళ్లం
ఊడిగం మా బతుకు
ఒళ్ళంతా ఇల్లంతా కంపు
ఎవరం మేం ఎవరం…

బతుకంతా చీకటి
జీవితమంతా వేదన
ఎక్కడికెళ్లినా చీదరింపు
ఎవరు మేము…
దేముడు కాడికి రానీయరు
చదువు సెప్పెటోళ్ల చీదరింపు
తిండి తినేడికాడ దెప్పిపొడుపు
మంచి గుడ్డలే లేనోటోళ్లం
రెక్కాడితే గాని డొక్కాడని వాళ్ళం.
ఎవరం మేం ఎవరం….

సచ్చిపోయిన జంతు మాంసమే
మాకు భుక్తి,ఆరోజు మహదానందం
ఆ రేయి కాసింత కడుపు నిండుతాది
దొర కాడ చాకిరీచేసేటోళ్లం
దొర ఎంగిలి కూడు తినేటోళ్లం
ఎవరం మేం ఎవరం….

పరమాన్నాలు మాకు దొరకవు
విసిరేసిన ఇస్తరి మా కడుపునింపుతాది
ఎండిన రొట్టె ముక్కలు,పాసిపోయిన అన్నమే మాకు పరమాన్నం
మేమేమి చేసాము నేరం?
ఎవరం మేం ఎవరం….

దున్న చస్తే పండగ మాకు
మనిషి పోతే ఆనందం మాకు
ఏలనంటే శవాలమీద మెతుకులు ఎరుకునేటోళ్లం
ఎవరం మేం ఎవరం…

మా తల్లుల అందచందాలు కావాలే,అస్పృశ్యత అప్పుడు
గుర్తుకు రాలేదా…
మా దొరగాడికి..?
అంట రానితనం కనిపించలేదా
ఆ కామాందులకి..?
ఎవరం మేం ఎవరం…

ఎందుకు వెలివేయబడ్డాం
శివాలయంలో చీదరింపులు
హారునికి మేమంటే కనికరం లేదు
దొరసానమ్మకు కంటగింపు
సమాజానికే కంపు కంపు
ఎవరం మేం ఎవరం…

మా జాతి స్త్రీలు కావాలే
మా మాతంగులు కావాలే
వాళ్ళ శరీరాలు కావాలే
మేమంటే ఎందుకు చీదరింపు
ఏ పాపం చేసాం మేం
ఎవరం మేం ఎవరం…

కూడు గుడ్డకు నోచుకోనోల్లం
కాయకష్టం చేసేటోళ్లం
చెమటకంపు కొట్టేటోళ్లం
ఊరి మొహంఎరుగనోల్లం
పొలిమేరల్లో జీవించే టోళ్లం
ఊర కుక్కలు, పందుల మధ్య
బతికేటోళ్లం…..
ఎవరం మేం ఎవరం…

మైల పడ్డ బతుకులు మావి
గుక్కెడు మంచి నీళ్ళు దొరకనోళ్లం
పేడ నెత్తుకు బతికేటోళ్లం
పిడకలమ్ముకుని జీవించే వాళ్ళం…
ఎవరం మేం ఎవరం….

అంటరాని వారమంటారు
అవతలగా పొమ్మంటారు
దారి తొలగమంటారు
తలదించుకోమంటారు…
ఎవరం మేం ఎవరం….

ఆ తెలిసిందిలే,తెలిసిందిలే
మేమే మహర్లమ్! మహర్లమ్
అంటారానోళ్లం అవనికే ఆమడ దూరం
సవర్ణులమ్ కాదు మేం నిషిద్దులం
అస్పృశ్యులం మేము కడసారోల్లం

దళితులం మేం దళితులం
మేమే అరుంధతీ సుతులం
మేమే జె సబ్బండులం, దాసర్లం,గోసంగులం
అంబెడ్కర్ వారసులం మేం….

– వెంకట్ కట్టూరి
——————————————————————

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)