ఆఫ్రికన్ అమెరికన్ నటి ,రచయిత్రి ,ఆస్కార్, గ్రానీ ,టోనీ పురస్కారగ్రహీత –హుప్పీ గోల్డ్ బెర్గ్- గబ్బిట దుర్గాప్రసాద్

మూలాలు:

కేరిన్ ఎలైన్ జాన్సన్ అనే పేరుతొ జన్మించిన హుప్పీ గోల్డ్ బెర్గ్ అమెరికాలో న్యూయార్క్ సిటీస్ మాన్ హాటన్ బోరో లో 13-9-1955లో జన్మించింది .తండ్రి రాబర్ట్ జేమ్స్ జాన్సన్ బాప్టిస్ట్ క్లర్జిమన్ .తల్లి ఎమ్మా జాన్సన్ నర్స్, టీచర్.స్థానిక కేథలిక్ స్కూల్ లో , వాషింగ్టన్ ఇర్వింగ్ స్కూల్ లోను చదివి మానేసింది . ఆమె పూర్వీకులెవరికీ గోల్డ్ బెర్గ్ పేరు లేదు ఆమెలో ‘’సబ్ సహారన్ ఆఫ్రికన్’’ వారసత్వ లక్షణాలు ఉన్నాయి.

నటన లో ఆసక్తి –ఎదుగుదల:

నటన పైఆసక్తి ఉండటంతో స్టేజినటి అయింది. స్టేజి నటనలో క్షణం తీరిక లేకుండా నటించటం చేత ,కుర్చీకే పరిమితం అవటం వలన, ఆమె’’ హుప్పీ కుషన్ ‘’లా ఉందని అందరూ అనటం తో అదే ఆమె ఇంటిపేరై పోయింది..1970లో దక్షిణ కాలిఫోర్నియా చేరి ,తర్వాత బెర్కిలీ లో స్థిరపడింది .జీవిక కోసం బ్యాంక్ టెల్లర్ ,మార్చురీ కాస్మాలజిస్ట్ ,గోడలుకట్టటం వంటి ఎన్నో చిన్న చిన్న ఉద్యోగాలు చేసింది .తర్వాత ఒక థియేటర్ ట్రూప్ లో చేరి హాస్యనటనలో 1979-నుంచి 1981 వరకు రెండేళ్ళు శిక్షణ పొందింది .తర్వాత తూర్పు జర్మని వెళ్లి చాలా నాటక ప్రదర్శనలలో నటించింది . మళ్ళీ న్యూయార్క్ సిటీ వచ్చి హుతా హెగెన్ వద్ద నటనలో శిక్షణ తీసుకొన్నది .

సినీ అరంగేట్రం –షోల నిర్వహణ:

1982లోసాన్ ఫ్రాన్సిస్కో నిర్మాత విలియం ఫార్లె సినిమా ‘’సిటిజెన్ –ఐ యాం నాట్ లూజింగ్ మై మైండ్ ,ఐ యాం గివింగ్ ఇట్ అవే ‘’లో మొదటిసారి నటించింది.1983 లో గోల్డ్ బెర్గ్ తానే అనేక వైవిధ్యపాత్రలు ధరించి ‘’ది స్పూక్ షో’’చేసింది .దీన్ని చూసి ఆశ్చర్యపోయిన డైరెక్టర్ మైక్ నికొలాస్ బ్రాడ్వే లో ప్రదర్శించటానికి ఆమెను ఆహ్వానించాడు .ఇక్కడ ప్రదర్శన పేరు ను ‘’హూప్పీ గోల్డ్ బెర్గ్ ‘’గా మార్చి చేసింది .ఈ షో 24-10-1984 నుండి 10-3-1985 వరకు నిరంతరంగా 156 ప్రదర్శనలు చేసి అందరి అభిమానం పొందింది .ఈ ప్రదర్శన కాలం లోనే ‘’హూప్పీ గోల్డ్ బెర్గ్ డైరెక్ట్ ఫ్రం బ్రాడ్వే’’పేరుతొ హెచ్ .బి .వో .సంస్థ ప్రసారం చేసింది ‘

దర్శక దిగ్గజం దృష్టి లోపడి, అవార్డ్ ల ముంగిట నిలిచిన గోల్డ్ బెర్గ్:

.’’హుప్పీ గోల్డ్ బెర్గ్ ‘’ ప్రదర్శన ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్ బెర్గ్ దృష్టిలో పడి తాను తీస్తున్న ‘’ది కలర్ పర్పుల్ ‘’సినిమాలో ముఖ్య నటి ని చేశాడు .ఇది’’ ఆలీస్ వాకర్’’ రాసిన నవల ఆధారంగా తీసిన సినిమా .1985లో విడుదలైన ఈ సినిమా ఆర్ధికంగా ,విమర్శకుల దృష్టిలోనూ గొప్ప విజయాన్ని సాధించింది .ఈ చిత్రం గోల్డ్ బెర్గ్ కు ఉత్తమనటి అవార్డ్ తో సహా, 11 అకాడెమి అవార్డ్ లకు నామినేట్ అయింది .

1986లో పెన్నీ మార్షల్ డైరెక్ట్ చేసిన ‘’జ౦పిన్ జాక్ ఫ్లాష్ ‘’లో గోల్డ్ బెర్గ్ నటించింది .ఫోటోగ్రఫీ డైరెక్టర్ డేవిడ్ క్లేసేన్ తో ప్రేమలోపడి పెళ్లి చేసుకొంది .ఈ సినిమా ఒక మాదిరి విజయం పొందింది. తర్వాత రెండేళ్లలో’’బగ్లర్’’,’’ఫాటల్ బ్యూటీ ‘’, ‘’ది’టెలిఫోన్ ‘’చిత్రాలలో నటించింది .ఇవి పెద్దగా విజయం పొందక పోయినా ఆమె నటనకు ‘’N.A.A.C.P.ఇమేజ్ అవార్డ్ ‘’అందుకొన్నది .తర్వాత చేసిన ‘’క్లారాస్ హార్ట్ ‘’కూడా నిరుత్సాహాన్నే నింపినా, గోల్డ్ బెర్గ్ నటనకు జనం అప్రతిభులయ్యారు .

కామెడీ స్పెషల్స్:

తర్వాత ‘’H.B.O.’’ వాళ్ళ కామెడీ స్పెషల్స్ ను రాబిన్ విలియమ్స్ ,బిల్లీ క్రిస్టల్ లతో కలిసి చేసింది . 1990లో ‘’బాగ్దాద్ కేఫ్ ‘’కామెడీలో లో జీన్ స్టాపిల్టన్ తో కలిసి నటించింది .ఇది’’ C.B.S.లో ’’రెండు సీజన్లు నిరాఘాటంగా నడిచింది .ఇందులో చేస్తూనే ‘’ది లాంగ్ వాక్ హోమ్’’సినిమాలో పౌరహక్కుల ఉద్యమ నాయకురాలిగా నటించింది .

ఆస్కార్ అవార్డ్ పొందిన రెండవ నల్లజాతి నటి:

1990లో ‘’ఘోస్ట్ ‘’సినిమాలో’’ సైకిక్’’ పాత్రను అద్భుతంగా పోషించింది .దీనిలోని ఆమె నటనకు ఉత్తమ సహాయ నటి అవార్డ్ నుఅందుకొన్నది . 50ఏళ్ళ చరిత్రలో అవార్డ్ అందుకున్న నల్లజాతి మహిళగా ,రెండవ అకాడెమి అవార్డ్ పొందిన ఆఫ్రో అమెరికన్ నటిగా రికార్డ్ సృష్టించింది .ఈ అవార్డ్ పొందిన మొదటి నల్లజాతి మహిళ 1939లో వచ్చిన ‘’గాన్ విత్ ది విండ్’’ సినిమాలో నటించిన’’హాట్టీ మెక్ డేనియల్ ‘’.

కనకవర్షం కురిపించిన సినిమా:

1991 లో ‘’సోప్ డిష్ ‘’,స్టార్ టెక్ ‘’’’,ది నెక్స్ట్ జనరేషన్ ‘’’’గునియన్ ‘’సినిమాలు చేసింది .1992లో ‘’సిస్టర్ యాక్ట్ ‘’విడుదలై 200 మిలియన్ డాలర్ల కనకవర్షం కురిపించింది .గోల్డ్ బెర్గ్ నటనకు ‘’గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ ‘’కు నామినేట్ అయింది .తర్వాత ‘’సారాఫైనల్ ‘’చేసింది.తర్వాత అర్ధరాత్రి టాక్ షో ‘’ది హూప్పీ గోల్డ్ బెర్గ్ ‘’చేస్తూ ,’’మేడ్ ఇన్ అమెరికా ,’’సిస్టర్ యాక్ట్ 2-బాక్ ఇన్ ది హాబిట్ ‘’సినిమాలలో1944-45లో నటించింది.తర్వాత కార్నియా ,కార్నియా ,ది లయన్ కింగ్ ది పేజ్ మాస్టర్ (డబ్బింగ్ చెప్పింది ) ,బాయ్స్ ఇన్ ది సైడ్ ,మూన్ లైట్ అండ్ వాలే౦టినో’’లలో 1996లో ‘’పప్పెట్స్ టు నైట్ ‘’సినిమాలలో నటించింది .

4 అకాడెమీ అవార్డ్ ఉత్సవాల హోస్ట్- గోల్డ్ బెర్గ్:

1994 అకాడెమీ అవార్డ్ లకు హోస్ట్ గా అరుదైన గౌరవాన్ని పొందిన మొట్టమొదటి ఆఫ్రో అమెరికన్ నటి గోల్డ్ బెర్గ్ .ఈ షోలో ఈమె ఒక్కతే హోస్ట్ .మళ్ళీ 1996,1999,2002లలో కూడా గోల్డ్ బెర్గ్ కే ఆ గౌరవం దక్కింది .

అభిమానుల వెల్లువ ,డాక్యుమెంటరి నిర్మాణం:

1996లో ‘’బోగస్ ‘’,ఎడ్డీ’’,’’ది అసోసియేట్’’,’’ఘోస్ట్స్ ఆఫ్ మిసిసిపి ‘’అనే 4సినిమాలు ,1998 నుంచి మూడేళ్ళు సపోర్టింగ్ రోల్స్ చేసింది .’’A.B.C.TV’’వాళ్ళ ‘’సిండ్రెల్లా ‘’,నైట్ ఇన్ కేం లాట్ ‘’,’’కాల్ మీ క్లాస్ ‘’లు నిర్వహించింది .టాం బెర్గ్ సన్ నిర్వహించిన ‘’హాలీవుడ్ స్క్వేర్స్ ‘’లో గోల్డ్ బెర్గ్ ‘’సెంటర్ స్క్వేర్ ‘’అయిదు లక్షల అభిమానులను సంపాదించుకొన్నది .ఎక్సి క్యూటివ్ ప్రొడ్యూసర్ గా కూడా ఉండి,4 సార్లు ‘ఎమ్మీ అవార్డ్స్’’కు నామినేట్ అయింది .తర్వాత ఇందులోనుంచి తప్పుకొని 2001లో ‘’మేకింగ్ ఆఫ్ ఎ చార్లీ బ్రౌన్ క్రిస్మస్ ‘’డాక్యుమెంటరి తీసింది .2003లో మళ్ళీటెలివిజన్ కు వచ్చి’’ హూప్పీ ‘’ చేసింది .

గౌరవ పురస్కారాలు –టీవీ షోలు –టాక్ షోలు:

46వ పుట్టిన రోజు న ‘’హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేం’’గౌరవం పొందింది .తర్వాత రెండేళ్ళు’’ స్లిమ్ ఫాస్ట్ ‘’కు అధికార ప్రతినిధిగా ఉన్నది .రెండు టివి సీరియళ్ళు నిర్మించింది .లైఫ్ టైం ఒరిజినల్ డ్రామా ‘’స్ట్రాంగ్ మెడిసిన్ ‘’,యుక్త వయసువారికి ‘’నికిలోడియాన్’’లు విపరీతమైన క్రేజ్ పొందాయి .సిటికాం కోసం’’నోగిన్ ‘’,జస్ట్ ఫర్ కిక్స్ వంటివి నిర్మించింది .2006నుంచి 08వరకు ‘’వేక్ అప్ విత్ హూప్పీ ‘’ను నేషనల్ సిండికేట్ మార్నింగ్ రేడియో టాక్ చేసింది .2013లో ‘’నేకేడ్ బ్రదర్స్ బాండ్ ‘’లో గెస్ట్ గా ఉంది .2010 లో టివి షోలు చేసి౦దిమళ్ళీ .2016లో రియాలిటీ షో’ ‘’’స్టఫ్ ‘ చేసింది .2007 సెప్టెంబర్ లో ‘’దివ్యూ ‘’కు మోడరేటర్ ,కో హోస్ట్ .ఈమె వలన రెండు వారాలలో వ్యూయర్స్ సంఖ్య మూడున్నర మిలియన్లు అయి 7శాతం పెరగటం విశేషం .

పౌరహక్కుల ఉద్యమనాయకత్వం:

‘’ క్వీన్ ఆఫ్ ది ఐలాండ్ ఆఫ్ కాలిఫోర్నియా’’నాటకం లో కాలిఫా పాత్ర పోషించింది .2006లో ’’హాలీవుడ్ యూనివర్సల్ స్టూడియో ‘’ కు ముఖ్య అతిధి గోల్డ్ బెర్గ్ .నటనతో సంతృప్తి చెందకుండా పౌరహక్కుల కోసం చేసే పోరాటాలో ఉద్యమాలలో పాల్గొని 2009లో యు.యెన్. మానవహక్కుల ,చిన్నపిల్లలరక్షణ, టెర్రరిజం నిర్మూలన పానెల్ కు మోడరేటర్ గా వ్యవహరించింది .20-12-2009న వాల్ట్ డిస్నీలో ఎప్కాట్ లో జరిగిన ‘’కాండిల్ లైట్ ప్రోసేషన్ లో పాల్గొన్న గోల్డ్ బెర్గ్ కు ప్రేక్షకులందరూ గౌరవంగా లేచినిలబడి కరతాళ ధ్వనులతో స్వాగతం చెప్పారు .

స్త్రీ జన సంక్షేమం:

స్త్రీలు ఋతు సమయంలో పొందే బాధ నివారించే ‘’మెడికల్ కాన్నబిస్ ‘’లను ఉత్పత్తి చేసే ‘’హూప్పీ అండ్ మాయా ‘’సంస్థలో గోల్డ్ బెర్గ్ భాగస్వామిని .’’ఎల్జి బిటికమ్యూనిటీ’’ పై చూపుతున్న వివక్షతకు వ్యతిరేకంగా ‘’గివ్ ఎ డాం’’ఉద్యమం చేబట్టింది .ఆమె ప్రజాసేవకు ‘’జఫర్సన్ అవార్డ్ ‘’పొందింది .

అవార్డ్ ల సిరి గోల్డ్ బెర్గ్:

మూడుసార్లు వివాహం చేసుకొన్న గోల్డ్ బెర్గ్ కు ఒక్కరే సంతానం.గోల్డ్ బెర్గ్ నటనకుఆస్కార్ అవార్డ్ , ఎమ్మీ అవార్డ్ ,జర్మని అవార్డ్ ,,టోనీ అవార్డ్ వంటివి ఎన్నో పొందింది . ఆమె 150 సినిమాలలో నటించింది .1990లో హాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకున్న నటి గోల్డ్ బెర్గ్ .ఈమె నటించిన ‘’సిస్టర్ యాక్ట్ -2’’కు 7నుంచి 12 మిలియన్ డాలర్లు ఇచ్చారు .1990లో ‘’హార్లెం గ్లోబల్ ట్రోటర్స్’’ఎక్సిబిషన్ బాస్కెట్ బాల్ టీం కు గౌరవ సభ్యురాలినిచేశారు . 2010లో ‘రైడ్ ఆఫ్ ఫేం ‘’వాళ్ళు ఆమె చేసిన సేవకు జీవన సాఫల్య పురస్కారం గా న్యూయార్క్ సిటి డబుల్ డేకర్ టూర్ బస్ కు ఆమె పేరుపెట్టారు .2017లో డిస్నీకంపేని కి చేసిన చిరస్మరణీయ సేవకు ‘’డిస్నీ లెజెండ్ ‘’ గౌరవం ఇచ్చారు .

మొత్తం మీద 7 ధియేటర్ షోలు,ఒక ఫిల్మోగ్రఫీ ,10డిస్కోగ్రఫీ,6,పిల్లల పుస్తకాలు 4,నాన్ ఫిక్షన్ చేసిన బహుముఖీన ప్రజ్ఞాశాలిని ,నల్లజాతి నట శిరోమణి గోల్డ్ బెర్గ్ .

గబ్బిట దుర్గాప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)