రక్ష రేఖలు(కవిత )-దేవనపల్లి వీణావాణి

నేలను తాకుతూ
నడవాలనే ఆశ తీరేట్టు లేదు
ఇంటిముందూ బజారూ రోడ్లూ
హాళ్ళూ మాళ్ళూ నేలంతటా
మరకల మయమే

వాస్తవాన్ని స్పర్శించే ధైర్యం పోయిందేమో
నాకు నిజానికి మధ్య ఈ తోలు దళాలు
తచ్చాడుతుంటాయి

వాకిట్లో సాష్టాంగ పడి
నా పాద స్పర్శకు పాకులాడే
రక్ష రేఖలు ఇప్పుడు నా బాహ్య ధారణలో
అవిభాజ్యమయ్యాయి

ఇంటా బయటా
గజిబిజి దారుల గందరగోళాల
నడుమ నడవలేక
నడిచి గమ్యం చేరే సరికి
నాకూ …నేలకు నడుమ
ఎదురుపడ్డ ముళ్ళకో రాళ్లకో సెగల నెగళ్లకో
తమ వీపు నిచ్చి
పాదాలను పదిలంగా హత్తుకుంటాయి

అప్పుడప్పుడూ
తెగిన చెప్పులో అన్నాన్ని
వెతుక్కునే మూల మలుపు
చెట్టు కింది నైపుణ్య చకోరాల చేతిలో
మృత్యుంజయులవుతాయి

ఎంత అరిగి ఆదుకున్నా
అవమాన కొలమానమెందుకు చేశారోనని
వగచినట్టు పాలిపోతాయి
అవసరం తీరాక ఆదరణకు నోచని
ఆప్తులకు మల్లే గడప ముందు
నిట్టూర్పు విడిచి కూల పడతాయి..!

-దేవనపల్లి వీణావాణి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)