లాస్ ఏంజెలెస్(కవిత )- సురేంద్ర దేవ్ చెల్లి

లోలోపల మనసును చూడలేని వాడే
గోర్లపై పూసిన నెయిల్ ఆర్ట్ ని
స్పిరిట్ లాలాజలంతో తుడిచేస్తాడు
పువ్వులను పీల్చి
కాళ్లతో నలిపేస్తాడు
-పోలెన్ ఈజ్ అడల్టిఫైడ్

అవే చూపులు
దేహపు వొంపుల మీద
స్లో మోషన్ రైడ్స్ తీసుకుంటాయి
-పారామీటర్ ఆఫ్ ది రెసిస్టెన్స్

అవకాశాలను నీడ కన్నా ముందే పరిగెత్తించి
అవసరాలను గుర్తుచేస్తూ
ఆకలి తీర్చమని చీకటిని సృష్టిస్తుంటారు
– ఎంప్టీ గ్రోసరీస్ టీచింగ్స్

లైటింగ్ మీద జెల్ పేపర్స్ లా
ఆకలి ఆత్మగౌరవాన్ని కరగదీస్తుంది
హై రేడియేషన్ చూపుల నడుమ
కప్పుకోడానికి చేతులు సరిపోవు
– విజన్ ఈజ్ టూ ఫేస్డ్

లాస్ ఏంజెలెస్ లో
లాస్ట్ ఏంజిల్స్ ఎందరో

కొందరికి మాత్రమే లాస్ వెగాస్
జీవితాన్ని ర్యాపిడ్ వేగంతో తిరిగి ఇస్తుంది

(కరేన్‌జిత్ కౌర్ వోహ్రా కి ప్రేమతో)

-సురేంద్ర దేవ్ చెల్లి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)