ప్రణయ్ హత్య – విస్మరించిన మైనారిటీ క్రైస్తవ అస్తిత్వ కోణం !- పి. విక్టర్ విజయ్ కుమార్

P.Victor Vijaya kumar

చుండూరు , కారం చేడులో చనిపోయింది కేవలం దళితులు కాదు. అదొక్కటే వాళ్ళ అస్తిత్వం కాదు. వాళ్ళు దళిత క్రైస్తవులు కూడా. వాళ్ళ faith system ఈ సామాజిక అవగాహనకు భిన్నంగ ఉన్న వ్యవస్థ నుండీ వచ్చారు. ఏ మాత్రం హిందూ వ్యవస్థ అంటే కలలో కూడా సింపథీ చూపించని వ్యవస్థ నుండి వచ్చారు వాళ్ళు. ఇన్నాళ్లు వారి పై జరిగే హత్యాచారాలకు దళిత క్రిస్టియన్ లు తప్ప మిగతా వర్గాలన్ని వెల్లువెత్తాయి. ఇందుకు మొదటి కారణం – మతం ఒక అస్తిత్వంగా గుర్తిస్తే దేవుడిని ఎక్కడ ఎంకరేజ్ చేస్తున్నామో అన్న అంబేద్కరీయుల కంఫ్యూజన్ మార్క్సిస్టులది కూడా. రెండు – ఆ కిరస్తాని మత విశ్వాసాలు కలిగి ఉన్న వాళ్ళు స్వతహాగానే గొర్రె స్వభావం కలిగి ఉంటారనే ఒక్ స్టీరియో టైపింగ్ isolation . దళిత క్రైస్తవులను మొదటగా సంఘటిత పర్చింది అంబేద్కర్ కాదు. మార్స్క్ కాదు. చర్చ్ ! చర్చ్ వ్యవస్థను మించిన కుల ( నిర్మూలన ) సంఘం ఈ దేశం లో లేదు. అయిటే చర్చ్ రాజకీయ దృక్కోణం ఎదగకుండా కేవలం” క్షమా గుణం ” అనే సూత్రాన్ని ఎక్కువగా ప్రాపగండా చేయడం తో క్రిస్టియన్ లను రాజకీయంగా మొబిలైజ్ చేయలేకపోయింది. ఇదే మాట అంబేద్కర్ ప్రస్తావించాడు. ఈ “ క్షమా గుణం “ వలన క్రైస్తవత్వం Political mobilisation అనే గుణం కోల్పోయింది అని.

ఈ రోజు వరకు మన తెలుగు సాహిత్యం లో ముస్లిం మైనారిటీ సాహిత్యంలో ఇన్ని పుస్తకాలు వచ్చాయి కాని , క్రైస్తవ అస్తిత్వ సాహిత్యం ఎందుకు రాలేదు ? ఒకటి – బాధిత వర్గం లో ఆ స్పృహ లేకపోవడం ఒక్కటే కారణమా ? అదే కారణం అయితే నిమ్న వర్గాలలో చైతన్యం ఎప్పుడూ కొదువే ! అధినాయకత్వం లో ఉన్న వాళ్లు క్రైస్తవులు కాక పోవడమా ? చుండూరులో , కారం చేడులో జరిగిన హత్యల్లో ఎంత మంది క్రైస్తవులు మొబిలైజ్ అయ్యారు ? ఎంత మందిని మొబిలైజ్ చేసారు ? ఇలా క్రైస్తవుల మీద జరిగే హత్యలకు అత్యాచారాలకు ఇక నాన్-క్రిస్టియన్స్ మీద ఆధారపడి అస్తిత్వాన్ని కాపాడుకోవల్సిందేనా ?

నాకు కొని ప్రశ్నలున్నాయి – బోణాలు పేరుతో వెనుకబడిన కులాల దైవిక నమ్మకాలను ఎంకరేజ్ చేసే ప్రగతి శీల వాదులు దళితుల్లో అన్ బ్రాహ్మినైజ్ద్ అస్తిత్వమైన క్రైస్తవం విషయం లో మాత్రం ఎందుకు అలా సిగ్గుతో మొహం చాటేసుకుంటారు ? మత విశ్వాసమే అడ్డు అయితే – ముస్లిం మతాన్ని ఒక వర్గంగా ఎందుకు గుర్తించగలుగుతున్నారు ?

క్రైస్తవత్వం సౌత్ ఇండియాలోనే ఎక్కువ ప్రబలంగా ఉంది. కారణం నార్త్ ఇండియా లోని బ్రాహ్మణీకత తీవ్రతను అది ఎదుర్కోలేకపోవడం వలననే. ద్రవిడ ఉద్యమాలు బ్రాహ్మణీయతను నీరు కార్చగలిగాయి గాని, హిందూ మతానికి ప్రత్యామ్న్యాయాన్ని నాస్తికత్వాన్నే చూపాయి. అది సత్వర అద్ధ్యాత్మిక అవసరాలను తీర్చగలిగే సమాధానం కాకపోవడం తో impractical గా మిగిలిపోయింది.

ఈ రోజు రియాలిటీ ఏంటి ? క్రైస్తవ సమూహం ఒక వర్గంగా ఎందుకు గుర్తింపబడలేకపోతున్నారు ? వారికి సాంఘిక విశిష్టత ఎందుకు కొరవడింది ? బీ జే పీ అధికారం లోకి వచ్చాక ఇక్కడున్న క్రైస్తవ సంఘాలు , పాస్టర్ల అంచనాల ప్రకారం సుమారు 400 -700 దాడులు చర్చ ల పైన , సువార్తీకులపైన జరిగాయి. ఈ దాడులను కూడా దళిత వర్గాల నుండీ వచ్చిన క్రైస్తవుల అస్తిత్వాన్ని తెలపట్లెదా ?

దళిత క్రైస్తవుని హత్య జరిగిన ప్రతి సారి దళితున్ని మాత్రమే చూడ్డం అది పూర్తి అస్తిత్వ కోణం కాదు. ఒక వేళ నిజంగా అస్తిత్వం ఇదే యాంత్రిక కోణం లో చూడాలనుకుంటే ప్రణయ్ డి ధన బలం , రాజకీయ బలం లేని వర్గ అస్తిత్వం. ప్రతి బాధితుడికి ఒక వర్గం ఉంది. అతనికో ” సోషల్ కేపిటల్ ” ఉంది. అతనికి 10 మంది మితృలుంటే అందులొ కనీసం ఐదు మంది క్రైస్తవులే ఉంటారు. అతని బంధువుల్లో సుమారు మూడుపాళ్ళు క్రైస్తవులే ఉంటారు. అతని సహాయం కోరే వాళ్ళు, అతను సహాయం చేయగలిగే వాళ్ళలో మెజారిటీ వ్యక్తులు క్రైస్తవులే ఉంటారు. అతని హితులు శ్రేయోభిలాశులు క్రైస్తవులే ఉంటారు. మరి అతను ఉత్తి దళితుడెట్లా అవుతాడు ? అతని క్రైస్తవ అస్తిత్వం అన్నది మరుగు పర్చడం వల్ల – అతను ఏ సామూహిక వర్గం లో పెరిగాడో , ఏ గుంపుతో అయితే identify అయి ఉన్నాడో , ఆ గుంపు కు సంబంధించి అస్తిత్వం అన్నది ఏమీ లేదా ఇక ?

నిజాయితీ గా అడిగే ‘ చర్చ్ లో కూడా కుల తత్వం ఉంది కదా ఆ ప్రాతిపదిక మీద ఎలా మొబిలైజ్ చేస్తాము ‘ అనే ప్రశ్న సమంజసమే. మనిషి అస్తిత్వం ఎలా నిర్ణయించబడుతుంది ? క్రైస్తవునిగా నా బంధువులు, హితులు, నా అభివృద్ధ్ధికి తోడ్పడుతున్న వాళ్ళు మెజారిటీ భాగం క్రైస్తవులే అయినప్పుడు నేను క్రైస్తవుని identity ని ఎలా కాదనుకుంటాను ? మనం ఒక closed stratified society లో ఉన్నామన్నది పదే పదే గుర్తుంచుకోవాల్సిన అంశం. ప్రణయ్ కుటుంబానికి రాజకీయంగా ప్రతి పార్టీ మద్దతు ఇవ్వచ్చు. అయితే ఆ ఫేమిలీతో కలిసి ఉండి వాళ్ళతో తిని నిద్రపోకుండా.

ఎమోషనల్ గా లేడా ఎటువంటి భౌతిక అవసరం దృష్ట్యా అయినా సరే తోడుగా నిలబడేది ప్రణయ బంధువులైన క్రైస్తవులు, ప్రణయ కుటుంబ మితృలైన క్రైస్తవులు, ప్రణయ్ కుటుంబం ప్రతి వారం ప్రార్థన పేరుతో సంఘటితమయ్యే చర్చ్ సభ్యులు ! ఆ రోజు రాత్రంతా వాళ్ళ కుటుంబం తో గడిపి కీర్తనలు పాడుతూ Emotional support ఇవ్వగలిగిన వాళ్ళు వీళ్ళే ! ఏ రాజకీయ పార్టీ కాదు ! ప్రణయ్ కుటుంబం లో మూర్ఖత్వాన్ని encash చేసుకున్నారు ఆ చర్చ్ సభ్యులు అని అనవచ్చు. మరి ప్రణయ్ కుటుంబం మూర్ఖులైతే వాళ్ళ గురించి పోట్లాడ్డం ఎందుకు ? కాబట్టి ఈ దిశగా ఈ ప్రశ్న ఇమ్మెచ్యూర్డ్ ప్రశ్న. ప్రణయ్ కుటుంబ చుట్టూ అల్లుకున్న ఈ social network ను ఎలా ఇగ్నోర్ చేస్తాము ? తర్వాత మత విశ్వాసాలా ప్రాతిపదిక గా మొబిలైజ్ చేద్దాం అన్నంతవరకే మనం మాట్లాడుకుంటూన్నాము. మత విశ్వాసాలకు అధికారం నాయకత్వం అప్పగించాలా అనే స్థాయి లో మాట్లాట్టం లేదు. ఆరాచకంగా జరిగే విగ్రాహారాధ పూరితమైన బోణాల పండుగ పేరుతో వెనుకబడిన కులాలను ఆర్గనైజ్ చేయడం లో ఉన్న అస్తిత్వ నిన్నాదం ఈ విషయం లో వెనుక సీట్ తీసుకోవాల్సిన అవసరం లేదు.

నెక్స్ట్ ప్రశ్న ఇంకోటి చూద్దాం – ప్రణయ్ దళితుడు కాబట్టి హత్య చేయబడ్డాడు కాని , క్రైస్తవుడు కాబట్టి హత్య చేయబడ్డాడా ? అవును మొదటగా ప్రణయ్ దళితుడు. ప్రణయ్ రాజకీయ దృక్పథం చైతన్యం నుండీ పెరిగిన వ్యక్తి కాదు. కుటుంబం కూడా అంతే ! అయితే అదే అమ్మాయి ఏ అగ్ర కుల క్రిస్టియన్ ను పెళ్ళి చేసుకుని ఉంటే ఈ సమస్య వచ్చేది కాదేమో ?! ఈ probability ని కూడా కొట్టేయలేము. మనం సమస్యను కలగాపులగం చేయకుండా సింపుల్ గా ఆలోచిద్దాం – ప్రణయ్ అస్తిత్వం ఏమిటి ? అందులో నుండి క్రైస్తవాన్ని పక్కన తీసి పెట్టి చూడ్డం ఎంత వరకు సబబు ? కారంచేడు, చుండూరు లొ కూడా క్రైస్తవాన్ని పక్కన పెట్టి క్రైస్తవులను ఉద్యమాలకు దూరంగా పెట్టారు. ఆ కోణం లో పని చేసిందే లేదు. ఇలా ఎన్నాళ్ళు ఈ అస్తిత్వ కోణాన్ని మరుగు పరిచి , నిజానికి అణచివేత ఎదుర్కుంటున్న సమూహానికి చైతన్యం ఇవ్వగలం ? హిందూ దళితులకు బీ జే పీ కూడా సపోర్ట్ ఇస్తుంది. క్రైస్తవుడైతే ఇవ్వదు. ఈ కోణం ఎలా అర్థం చేసుకుంటారు ? అన్ బ్రాహ్మినైజ్ద్ సెక్షన్ ఇది. హిందుత్వం వ్యాపించకుండా చల్లని గుడ్డ వేసి గొంతు కోసేసినట్టు చేసిందిది….ఎటువంటి ఉద్యమం లేదు..ఎటువంటి తిరుగుబాటు లేదు ఇందులో. ఈ క్రైస్తవ అస్తిత్వం పెంపొందించడం చేస్తున్నప్పుడు మొదటగా పడే దెబ్బ బ్రాహ్మణిజం మీద ! అది సవర్ణ హిందూత్వం మీద ! దళిత కోణం ( అది బుద్దిస్టు దళిత కోణమా, హిందూ దళిత కోణమా, నాస్తికవాద దళిత కోణమా ఏదో ఒకటి కానీలెండి, ) ను కొనసాగించండి . అయితే క్రైస్తవ అస్తిత్వాన్ని విస్మరించకండి ! ఇన్నాళ్ళు జరిగిన పొరపాటు ఇది ! ఏదో ఒక సమయం లో దీన్ని కరెక్ట్ చేయాలి ! ఏం ? ఇప్పుడు చేద్దాం !

-పి. విక్టర్ విజయ్ కుమార్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో