మేఘసందేశం-12 -వ్యాఖ్యానం : టేకుమళ్ళ వెంకటప్పయ్య

కాళిదాసు గురించి అఖండ భారతావనికి తెలియజేసిన కోలాచల మల్లినాథసూరి గురించి చెప్పుకోవలసి ఉంది. ఆయనే లేకుంటే కాళిదాసు అంతటి మహాకవి ప్రపంచానికి తెలిసేవాడు కాదంటే అతిశయోక్తి కాదేమో! తన వ్యాఖ్యానంతో కాళిదాసు సాహిత్యానికి జీవం పోసిన మహా మహోపాధ్యాయుడు మల్లినాథసూరి. 14వ శతాబ్దం చివర, 15వ శతాబ్దం ఆరంభంలో జీవించిన ఆయన రాచకొండను పాలించిన సర్వజ్ఞ సింగభూపాలుని ఆస్థానంలో ఉన్నట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా సంస్కృత పండితునిగా పేరుగాంచిన ఆయన పేరిట వారణాసి హిందూ విశ్వవిద్యాలయంలో సంస్కృత విభాగం పని చేస్తోంది. నిరుపేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన మల్లినాథుడు బాల్యంలో ఆడుకుంటూ తిరుమలయ్య గుట్టపైకి వెళ్లేవాడట. అక్కడ తపస్సు చేసుకుంటుండే మహాయోగి తన అవసానదశలో మల్లినాథుడికి నాలుకపై బీజాక్షరాలు లిఖించి సరస్వతీ మంత్రం ఉపదేశించారు. తర్వాత కాలంలో మల్లినాథుడు ఏడుపాయల దుర్గాభవాని క్షేత్రంలో కొంత కాలం తపస్సు చేసి కాశీకి వెళ్లిపోయాడు. అక్కడ తర్క, మీమాంస, వ్యాకరణ, చందోశాస్త్రాలు, వైద్య, జ్యోతిష్య, సంగీత, నాట్య, అశ్వ, గజ, రత్న, రాజనీతి, వేదాంత దర్శనం వంటి 19 శాస్త్రాల్లో ప్రావీణ్యం సంపాదించి మహాభాష్యకర్తగా కీర్తినార్జించారు. ఏడుపాయల అమ్మవారి ఆలయ చరిత్ర గ్రంథంలో మల్లినాథసూరి ప్రస్తావన ఉంది. సంస్కృత పంచ మహాకావ్యాలైన మహాకవి కాళిదాసు విరచిత రఘువంశము, మేఘ సందేశం, కుమార సంభవము, కవి భారవి రాసిన కిరాతార్జునీయం, మాఘుడు రచించిన శిశుపాలవధకు మల్లినాథసూరి వ్యాఖ్యానాలు చేసి వ్యాఖ్యాన చక్రవర్తి బిరుదాంకితులయ్యారు. జ్యోతిష్య గ్రంథము, రఘువీర చరిత, వైశ్యవంశ సుధార్ణవము వంటి రచనలు చేశారు. అలాంటి మల్లినాధసూరికి నమస్సులర్పిస్తూ…మనం మరలా మేఘసందేశ వ్యాఖ్యానంలోకి వద్దాం.

శ్లో.49. బ్రహ్మావర్తం జనపదమథ చ్ఛాయయా గాహమానః
క్షేత్రం క్షత్రప్రథనపిశునం కౌరవం తద్భజేథాః,
రాజన్యానాం శితశరశతైర్యత్ర గాండీవధన్వా
ధారాపాతైస్త్వమివ కమలాన్యభ్యవర్ష న్ముఖాని.

భావం: ఓ మేఘుడా అనంతరం, నీవు బ్రహ్మావర్తం అనే దేశం మీదుగా, ధార్తరాష్ట్ర పాండవ యుద్ధానికి కారణమైన కురుక్షేత్రాన్ని చేరు. మేఘుడా! ఆ కురుక్షేత్రంలో అర్జునుడు వందలకొలది పదునైన బాణాలతో, నీవు సాధారణంగా జలధారలను పద్మాలపై ఎలా వర్షిస్తావో, అలా రాజుల ముఖాలపై కురిపించాడు. ఆవిషయం గుర్తుచేస్తున్నాడు యక్షుడు.

శ్లో.50. హిత్వా హాలామభిమతరసాం రేవతీలోచనాంకాం
బంధుప్రీత్యా సమరవిముఖో లాంగలీ యాః సిషేవే,
కృత్వా తాసామభిగమమపాం సౌమ్య సారస్వతీనా
మంతఃశుద్ధస్త్వమపి భవితా వర్ణమాత్రేణ కృష్ణః.

భావం: ఓ మేఘుడా! బంధుప్రేమతో యుద్ధవిముఖుడైన బలరాముడు, అప్పటివరకూ ఎంతో ప్రేమగా సేవించే సురను విడిచి, సరస్వతీనదీజలాలను సేవించి, పరిశుద్ధుడయ్యాడు. ఓ సౌమ్యుడా! నా సలహా ఏమిటంటే నీవు కూడా ఆ సరస్వతీనదీ ఉదకాలను సేవిస్తే నీ అంతరాత్మ పరిశుద్ధం అవుతుంది. అప్పుడు వర్ణంచేత మాత్రమే నల్లనివాడవు అవుతావు.
ఇక్కడ విశేషం చూద్దాం. పూర్వం బలరాముడు ఇరుపక్షాలకూ బంధువులే కాబట్టి, కురు పాండవ యుద్ధంలో ఎవరి పక్షాన చేరడానికీ ఇష్టపడక తీర్థయాత్రలకు వెళ్లిపోయాడు. అప్పుడు తనకత్యంత ప్రియమైన సురను విడిచిపెట్టేశాడు. అసలు సురకు హలిప్రియ అనే పేరు బలరామునివల్లే వచ్చింది.హలి అంటే బలరాముడు. హలాన్ని ఆయుధంగా ధరించినవాడు. అందువల్ల ఆ హలికి ఇష్టమైనది అనే అర్థంలో కల్లుకు హలిప్రియ అనే పేరు వచ్చింది.పరమపావనమైన సరస్వతీ జలాలను గ్రోలి, శుద్ధుడయ్యాడు. ఈ కథను గుర్తుచేస్తున్నాడు యక్షుడు. ఓ మేఘుడా! ఆకారణంచేత ఆ ప్రాంతంలో సరస్వతీనది నదిని నీవు సేవిస్తే, నీ శరీరవర్ణం నల్లగా అలాగే ఉన్నా ఆ నదీజలప్రభావంతో నీ అంతరాత్మ పరిశుద్ధం అవుతుంది. అంటున్నాడు. అంటే శరీరపురంగును కాదు పట్టించుకోవలసింది. ఉన్న నలుపు ఎన్నివిధాలైన సౌందర్య సాధనాలు వాడినా పోదు. కావలసినది చేయవలసినది. కనీసం నల్లగా ఉన్న మనసును తెల్లగా చేసుకోవడమే. దానినే అంతఃశుద్ధి అంటారు కనుక అది చేసుకోమని సలహా ఇస్తున్నాడు యక్షుడు.

శ్లో.51. తస్మాద్గచ్ఛేరనుకనఖలం శైలరాజావతీర్ణాం
జహ్నోః కన్యాం సగరతనయస్వర్గసోపానపంక్తిం,
గౌరీవక్త్రభ్రుకుటిరచనాం యా విహస్యేవ ఫేనైః
శంభోః కేశగ్రహణమకరోదిందులగ్నోర్మిహస్తాః.

భావం: ఓ మేఘుడా! ఆ పుణ్యక్షేత్రమైన కురుక్షేత్రంనుండి బయలుదేరితే, కనఖలం అనే పర్వతం కనబడుతుంది. హిమవంతంనుండి, దాని సమీపంలో గంగానది దిగింది. తరువాత జహ్నుకన్య అయింది. సగరచక్రవర్తిపుత్రులు స్వర్గానికి పోవడానికి మెట్లవరుసలా మారిన పుణ్యరాశి అయిన అటువంటి గంగానదిని సేవించు. శివుని శిరసున ఉన్న గంగ, తన సవతి అయిన పార్వతిని పరిహాసం చేసినట్లుంటుంది. హిమవంతంలో పుట్టి తనలో మునిగిన వారికి పుణ్యాన్ని ఇచ్చి సవతిని తలదన్ని, భర్త తలమీద ఉండే సౌభాగ్యాన్ని పొందిన గంగను సేవిస్తే, నీకు శుభం కలుగుతుంది.

శ్లో.52. తస్యాః పాతుం సురగజ ఇవ వ్యోమ్ని పశ్చార్ధలంబీ
త్వం చేదచ్ఛస్ఫటికవిశదం తర్కయేస్తిర్యగంభః,
సంసర్పంత్యా సపది భవతః స్రోతసి చ్ఛాయయా౭సౌ
స్యాదస్థానోపగతయమునాసంగమేవాభిరామా.

భావం: ఓ మేఘుడా! స్వచ్ఛమైన స్ఫటికంలా శుభ్రమైన ఆ గంగానది నీటిని త్రాగడానికి నీవు సగం శరీరం వంచినపుడు చూడడానికి దిగ్గజంలా ఉంటావు. నీ నీడ ఆ గంగాప్రవాహమందు వ్యాపించి చోటు గాని చోట (అంటే ప్రయాగలోనే కాక ఇక్కడ కూడా) యమునానది ఈ నదితో కూడినదా అన్నట్లు చూడ బహు సుందరంగా ఉంటుంది.
ఇక్కడి విశేషము ఏమిటంటే గంగ నీరు తెల్లగా స్వఛ్చంగా ఉంటుంది. యమునా నది నీరు నల్లగా ఉంటుంది. నల్లగా ఉన్న మేఘుని నీడ గంగా నదిలో పడితే యమున నీటివలె కనిపిస్తుంది. దీనిలో రెండు అలంకారాలు ఉన్నాయి. 1. ఐరావతమువలె అన్న చోట ఉపమాలంకారం కాగా 2. “అస్థానోపగతయమునాసంగమేవా” అనడంలో ఉత్ప్రేక్ష మనకు కనిపిస్తుంది.

శ్లో.53. ఆసీనానాం సురభితశిలం నాభిగంధైర్మృగాణాం
తస్యాః ఏవ ప్రభవ మచలం ప్రాప్య గౌరం తుషారైః,
వక్ష్యస్యధ్వశ్రమవినయనే తస్య శృంగే నిషణ్ణః
శోభాం శుభ్రత్రినయనవృషోత్ఖాతపంకోపమేయాం.

భావం: కాళిదాసు ఎంత చమత్కారంగా చెప్తాడో గమనించండి. ఓ మేఘుడా! ఆ గంగానది హిమవంతం దగ్గరే ఉంటుంది. ఆ హిమవత్పర్వత శిలలపై కస్తూరిమృగాలు కూర్చొంటాయి కాబట్టి వాటి బొడ్డుల్లోని కస్తూరిగంధంతో ఆ అద్రి శిలలు పరిమళాలు క్రమ్ముతూంటాయి. ఆ గంగానది పుట్టుకకే కారణమైన ఎక్కువ మంచుతో ఆ గిరి, తెల్లగా కనబడుతూంటుంది. అటువంటి పవిత్రమైన ఆ హిమవత్పర్వతశిఖరమందు కూర్చొంటే, నీకు మార్గాయాసం కూడా తీరుతుంది. ఇక్కడ కొంచెం చిలిపిగా ఓ మేఘుడా! తెల్లని ఆ కొండమీద కూర్చొన్న నల్లని వర్ణం కలిగిన నీవు శివుని వృషభం కుమ్మితే కొమ్మున అంటుకొన్న బురదమట్టిలా చూడడానికి బహు చక్కగా ఉంటావు సుమా! అని చమత్కరిస్తున్నాడు. హిమాద్రిని నందితోను, మేఘాన్ని బురదతోను పోల్చి ఉపమానాలంకారం రసవత్తరంగా చూపించాడు కాళిదాసు.

మేఘ సందేశం, వ్యాసాలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)