కాలిఫోర్నియాలోని బే ఏరియా సాహితీ వేదిక “వీక్షణం” ఆరవ వార్షికోత్సవం

కాలిఫోర్నియాలోని బే ఏరియా సాహితీ వేదిక “వీక్షణం” ఆరవ వార్షికోత్సవం సెప్టెంబరు16, 2018న మిల్పిటాస్ లోని స్వాగత్ హోటల్ లో ఘనంగా జరిగింది.

ఉదయం 10 గం.నుండి సాయంత్రం 6 గంటల వరకు జరిగిన ఈ సమావేశం ఆద్యంతం అత్యంత రసవత్తరంగా జరిగింది.
సభను ప్రారంభిస్తూ వీక్షణం సంస్థాపకురాలు డా||కె.గీత ఆరేళ్ల ప్రస్థానాన్ని తల్చుకుంటూ ఇప్పుడు వీక్షణం ఇక్కడి వారి జీవితంలో భాగస్వామ్యమైపోయిందనీ, ఆపాలనుకున్నా ఆగని నిరంతర సాహితీ వాహిని గా అందరినీ అలరిస్తూందని, ఈ సంవత్సరం శేక్రమెంటో లో మరో శాఖతో విస్తరిస్తూ సాహితీ సేవలో మరో అడుగు ముందుకేసిందనీ అంటూ అందరికీ ఆహ్వానం పలికారు.

మొదటి సెషన్ కు శ్రీ చుక్కా శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ఇందులో ముందుగా శ్రీ తాటిపామల మృత్యుంజయుడు “భగవద్గీత ను చదవడం ఎలా?” అనే అంశమ్మీద శాస్త్రీయంగా ఉపన్యసించారు. తరువాత శ్రీ మధు బుడమగుంట పత్రికా సంపాదకీయ ప్రస్థానాన్ని గురించి ప్రసంగించగా, శ్రీ అప్పాజీ పంచాగం ప్రహ్లాదుని కథలో సంస్కృత పదాల గురించి వివరణాత్మక ప్రసంగం చేశారు.

భోజన విరామానంతరం జరిగిన రెండవ సెషన్ కు శ్రీ రావు తల్లాప్రగడ అధ్యక్షత వహించారు.

ముందుగా వీక్షణం ప్రత్యేక సంచికల ఆవిష్కరణ శ్రీ అక్కిరాజు రమాపతిరావు, శ్రీ గంగిశెట్టి లక్ష్మీ నారాయణ గార్ల చేతుల మీదుగా జరిగింది. అనంతరం శ్రీ అక్కిరాజు రమాపతిరావు గారి సహస్ర చంద్ర దర్శన ప్రత్యేక సందర్భంగా వీక్షణం తరఫున ఘన సన్మానం జరిగింది. ఆ సందర్భంగా వారి సోదరులు శ్రీ అక్కిరాజు సుందర రామకృష్ణ ప్రసంగించారు. తర్వాత “తెలుగు రచయిత” తొమ్మిది వందల రచయితల పేజీలతో దిగ్విజయంగా మూడు సం.రాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సభ్యులు డా||కె.గీత, శ్రీ వేణు ఆసూరి, శ్రీ సుభాష్ పెద్దు సభకు తెలుగు రచయిత. ఆర్గ్ ను పరిచయం చేసారు. ఈ సందర్భంగా వెబ్సైటు కి తగిన చేయూతనివ్వాలని రచయితలందరికీ గీత విజ్ఞప్తి చేశారు.

మధ్యాహ్నం సెషన్ లో శ్రీ సుభాష్ పెద్దు “వేంకటాధ్వరి గుణాదర్శం” గ్రంథ పరిచయం తర్వాత, శ్రీమతి ఆర్ దమయంతి గారి ఆధ్వర్యాన సాహితీ క్విజ్ ఆసక్తిదాయకంగా జరిగింది.

తరువాత జరిగిన కవితా సమ్మేళనంలో శ్రీ అక్కిరాజు సుందర రామకృష్ణ, డా|| కె.గీత, శ్రీ శశి ఇంగువ, శ్రీమతి షంషాద్, శ్రీ మేకా రామస్వామి, శ్రీమతి ఛాయాదేవి, శ్రీ హర్ నాథ్ మున్నగువారు పాల్గొన్నారు.

ఆ తర్వాత సింగపూర్ తెలుగు సమితి ఉపాధ్యక్షులు శ్రీ వెంకటరమణ సభకు హాజరై తమ సందేశాన్ని వినిపించడం విశేషం.
చివరగా వీనుల విందుగా జరిగిన సంగీత లహరి కార్యక్రమం లో డా|| కె.గీత, శ్రీమతి ఆర్ దమయంతి, శ్రీమతి గీతా గురుమణి, చి|| ఈశా పాటలు పాడారు.

ఆద్యంతం అత్యంత ఆసక్తిదాయకంగా, విశేషంగా జరిగిన ఈ సభలో స్థానిక ప్రముఖులు, సాహిత్యాభిమానులు విశేషంగా పాల్గొన్నారు.

-వీక్షణం

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సాహిత్య సమావేశాలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)