తెర(కవిత )-దేవనపల్లి వీణావాణి

నాకేదీ నమ్మాలనిపించదు
జరిగింది

మాట్లాడాలని కూడా అనిపించదు
ఏమని చెప్పుకోవాలో
కూడా తోచదు

మనం అన్న మాట
తట్టినప్పుడల్లా
ఊడిన జుట్టు వెక్కిరిస్తుంది

సాగీ సాగీ విరిగిన మనసు
ఒక గాయపు మచ్చ

కొన్ని అంతేనేమో
అద్దం మీద నీటి బొట్లు
అందవు అతకవు..!

నిన్న నేడు రేపు
చక్రభ్రమణంలో చక్రవాకాలం
నువ్వూ నేనూ విడి విడి నిజాలుగా
ఇజాల తెర కప్పుకున్నప్పుడు
పోయే గాలికి
వచ్చే జల్లుకు జల్లెడగా మారటం తప్ప
‘మనం’గా చేసేదేముంది..?

ఇంతకన్నా రాసేదేముంటుంది..?

-దేవనపల్లి వీణావాణి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

One Response to తెర(కవిత )-దేవనపల్లి వీణావాణి

  1. దడాల వెoకటేశ్వరరావు says:

    మీరు వ్రాసేదే కవితైనా, నిజమైన
    దయచేసి ఇలామాత్రం వ్రాయకండి….

    ‘ ఏదీ నమ్మాలని అనిపించదు
    ఏమీ మాట్లాడాలని అనిపించదు
    ఏమని చెప్పుకోవాలో తెలియదు
    మనం మనంగా చేసేదేముంది
    ఇంతకన్నా రాసేదేముంటుంది’

    వేరు వేరు నిజాలు మనకున్నా
    వేరు వేరు ఇజాలలో బ్రతుకుతున్న
    గాయలై మనసులు అలసిపోయినా
    ఇంకా మిగిలున్నాముకనుకనే మనం
    తెలుసుకోలేకపోతున్నాం కనుకనే జనం

    పోయేది గాలే అయినా
    వచ్చేది జల్లే అయినా
    జల్లెడ విశాలంగాఉండాలి

    చేయాలంటే ఎంతో ఉంది
    అది ఇద్దరు అనుకుంటే అవుతుంది
    వ్రాయలంటే ఇంకా ఉంది
    అది ప్రశాంతమైన మనసుంటే నడుస్తుంది

    అన్ని రోజులు ఒకేలా ఉండవు
    అందరూ అన్నివేళలా ఒకేలా ఉండలేరు
    చక్రభ్రమణంలో నిన్న వేరు నేడు వేరు
    రేపు అనేదే మనల్ని కలుపుతుంది
    చక్రవాకంలా ఉండాలని ఎవరూ కోరుకోరు

    మనసున్నవారు మనిషైన వారు మాత్రమే మనం అనుకునేవారు
    వారే ఈ విశాల ప్రపంచంలో హాయిగా ఉండాలని
    అనుకునేవారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)