కవితా కళ్యాణి – (కవిత )-దాసరి సుబ్రహ్మణ్యేశ్వ‌ాణరావు

పండితులారా !
పండితోత్తములారా !
కవుల్లారా !
కవిపుంగవుల్లారా !
నేను కవిత రాస్తానని
మీకు చూపిస్తానని
కలలొనైన ఊహించలేదు
కమ్మని కలలు కనలేదు
కానీ !
కాలం కలిసి వచ్చింది
కళ్యాణి ముందుకొచ్చింది
కలం చేతికిచ్చింది
కాగితం ముందు పెట్టింది
కన్నెర్రజేసింది
కవిత రాయమన్నది
కమ్మని కవిత రాస్తావా ? లేదా ? అని
కసరి కసరి కొట్టింది
కోపోద్రికురాలయ్యింది
నేను రాయక తప్పదేమోనని
యువ కవుల హృదయాలకు
బావకవిత పరువాలకు
ఆనకట్టల అడ్డువేసి
పేద వారి హృదయాలను
పరిశోధిస్తూ స్పర్శిస్తూ
కాగడాలు వెలిగిస్తూ
పగడాలతో పోలుస్తూ
ఛందస్సు లేని కవితను
చిందులు వేయిస్తూ
ఊరులు దాటి
ఏరులు దాటి
ఎల్లలు దాటి
కొండలు దాటి
కోనలు దాటి
భూలోక – భువర్లోక – పాతాళంలో విహరిస్తూ
చక్కనైన భావమును
చుక్కల్లోన ఊహిస్తూ
కనుగొన్నది కన్నుల్లో
వాక్కల్లోన కురిపిస్తూ
అలంకరించాను కవితను
ముందుంచాను నవ్యతను
( నా భార్య కళ్యాణి కవిత రాయమన్నప్పుడు అకస్మాత్తుగా వచ్చిన పదాలు )

-దాసరి సుబ్రహ్మణ్యేశ్వ‌ాణరావు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, UncategorizedPermalink

Comments are closed.