గోదావరి జిల్లా గిరిజనుల జీవనశైలి(సాహిత్య వ్యాసం )- దొడ్డి శ్రీదేవి,

ISSN 2278-478

తెలుగు రాష్ట్రాల  జీవనాడి గోదావరి. గోదావరి జిల్లాలు  అనగానే మనకు మనసులో మెదిలేది పచ్చని వరిపైర్లు, కొండకోనలు  దాటుకుంటూ తెలుగు  రాష్ట్రాలను పలకరిస్తూ అంతర్వేది నరసింహస్వామి పాదాలచెంత కడలిలో కలిసే గోదావరి నదీ అందాలు , పాపికొండలు , కాటన్‌ దొర ఆనకట్ట, రోడ్డు మరియు రైలు  వంతెన, తెరచాప పడవలు , ప్రసిద్ధిచెందిన పుణ్యక్షేత్రాలు , పులస చేప రుచులు , కోనసీమ అందాలు , అడవిసోయగాలు , పోలవరం ప్రాజెక్టుతో సహా ఇలా ఒకటేమిటి చెప్పుకుంటూపోవాలేగాని ఇంకా చాలానే ఉన్నాయి.

గోదావరి జిల్లా ప్రకృతి అందాలే కాకుండా అక్కడి ప్రజల  సంస్కృతి, సంప్రదాయాలు , పండుగలకు చాలా ప్రాధాన్యత ఉంది. అందులోని భాగమే గోదావరి జిల్లా గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు , ఆచార వ్యవహారాలు . మైదాన ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలు , గిరిజన ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలు  భిన్నంగా ఉంటాయి. గిరిజను భాషలు , పండుగలు , వివాహాలు, అవాట్లులు, కట్టుబాట్లులు, గృహసంబంధ విషయాలు ఇలా అనేక విషయాలో కొంత భిన్నత్వం కనబడుతుంది. అడవిని కాపాడుతూ, ఆ అడవితల్లి ఒడిలోనే సేద తీరుతున్న అడవిబిడ్డులు ఈ గిరిజనులు.

గోదావరి జిల్లాల్లో ఏజెన్సీ ప్రాంతంలో అడవితల్లి బిడ్డలైన ఆదివాసీలు నివశిస్తున్నారు. నాగరిక సమాజానికి దూరంగా కొండకోనల్లో జీవిస్తున్నారు. మనిషికి మనిషికి అంతరం ఏర్పడిన నేటి కాలంలో ఈ నాగరిక సమాజంలో నేటికి చెట్టుతోను, పుట్టలతోను, తోటి మనిషితోను మమేకమై జీవిస్తున్నారు.  వారికి నాగరిక సమాజపు గాలి పెద్దగా తగలకపోవడం వల్లనేమో. గోదావరి జిల్లాల్లో గిరిజనులు  ప్రకృతిలో భాగంకాగా, ప్రకృతి వారి జీవితాలో మమేకమయ్యింది. నాగరిక ప్రపంచం తెలియకపోయిన ప్రకృతి అందించిన అడవితల్లి గురించి అణువణువూ తెలుసు .

అడవిని నాశనం చేయకుండా అవసరాలకు ఎలా వినియోగించుకోవాలో తెలుసు . అలాంటిది ఈ రోజు ఈ అడవి బిడ్డలు  అడవి తల్లిని వదిలి (అ)నాగరిక సమాజంలోనికి రావలిసిన  పరిస్థితి ఏర్పడింది. ప్రాజెక్టు పేరుతో వారి గూడేలను ఖాళీ చేయిస్తున్నారు. దిక్కుతోచని స్థితిలో నేడు ఆదివాసీలు బిక్కుబిక్కుమంటూ కాలం  వెళ్ళుదీస్తున్నారు. పునరావాసం పేరుతో అడవి నుంచి ఆదివాసీలను ఖాళీ చేయించి బయటకు తీసుకు వస్తున్నారు. అక్కడితో ఆదివాసీలకు అడవి తల్లితో పెనవేసుకున్న బంధం తెగిపోతుంది, వారి జీవితం చిన్నా భిన్నమవుతుంది. మనసు అల్లకల్లోమై తల్లడిల్లుతుంది.  వారి ఆవేదన అరణ్యరోధనే అవుతుంది.

గోదావరి జిల్లాల్లో ఎక్కువగా కనబడే గిరిజన తెగులు కోయలు, కొండరెడ్లులు, కొండదొరలు, భగతలు, సుగాలీలు మొదలైన తెగలు నివశిస్తున్నారు. వీరికి తెలిసిన విద్య వేటాడడం. అదివారి సంప్రదాయం. వారి సంస్కృతి, సంప్రదాయానికి విరుద్దంగా నేడు నాగరిక సమాజంలోకి రావలసిన పరిస్థితి ఏర్పడింది.

సంస్కృతి ఒక జీవనదిలాంటిది. సంస్కృతి అనేది ఒక తెగ, ఒక ప్రాంతం, ఒక జాతికి సంబంధించిన జీవన విధానం. దీనిలో భాగమే గిరిజన సంస్కృతి, సంప్రదాయం. వారి జీవనవిధానం, వేషధారణ, భాష, సంప్రదాయాలు, పండుగలు ప్రత్యేకంగా ఉంటాయి. ముంపు ప్రాంతా పేరుతో వీరిని నాగరిక సమాజంలోనికి తీసుకురావడంతో నాగరిక సమాజపు ప్రభావం వల్ల  వీరి సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిరది.

అడవి తల్లి ఒడిలో ఆదివాసీ జీవనశైలిః:
వ్యవసాయం :

గోదావరి జిల్లాల్లోని గిరిజనులకు వ్యవసాయమే ప్రధాన వృత్తి. తమకు కావలసిన వస్తువులను తయారు చేసుకోవడంలోను, సమకూర్చుకోవడంలోను వీరికి వీరేసాటి. వీరు చేసే వ్యవసాయం పోడు వ్యవసాయం. అడవిలో కొంత భూభాగాన్ని చదును చేసి వ్యవసాయం చేయడం పోడు వ్యవసాయం. వీరు ముఖ్యంగా వ్యవసాయాధార పంటలైన జొన్ను, సజ్జు, రాగaలు, కొర్రులు మొదలైన పంటు పండిస్తారు. వ్యవసాయానికి అవసరమైన పనిముట్లు తుగు, అరుసు, గుణపం, గొడ్డలి, పార మొదలగు పరికరాలను ఎవరి మీద ఆధారపడకుండా వీరే సొంతంగా తయారు చేసుకోవడం వీరి ప్రత్యేకత. వీరి నిత్య జీవితంలో వాడే రోలు, తిరగలి, కొర్రరాయి, గొగ్గొలు, కోడితుప్ప, నిచ్చెన లేదా కొర్రు, కొండ చీపుర్లు, ఈత చీపుర్లు, రోకలి, పీట, తుంగచాప, వీరే తయారు చేసుకుంటారు. పంటలు పండిరచటానికి అధునాతన పద్దతులు, ఎరువు వాడకుండా సంప్రదాయ పద్దతులు, సేంద్రియ పద్దతులు ద్వారానే పంటు పండిస్తారు.

భాష :

గిరిజన తెగలో కొన్ని తెగల వారి మాతృభాష ఉంటుంది. వారు ఆ తెగ వారితో వారి మాతృ భాషలోనే మాట్లాడుతారు. ఇతరులతో తెలుగులోనే మాట్లాడుతారు. ఉదా॥ కోయ, సుగాలి. కొన్ని తెగలో వారికి ప్రత్యేకంగా మాతృభాష లేకపోవడం వల్ల  వారు తెలుగులోనే మాట్లాడుతారు. ఉదా॥ కొండరెడ్లు, కొండదొరులు.

గోదావరి జిల్లాలలోని నివశించే గిరిజనులు భాషకు లిపి లేదు. ముద్రిత గ్రంథాలు కూడా ఏమి లేవు. కాకపోతే ఒక తరం నుంచి ఇంకొక తరానికి భాష వ్యాప్తి చెందుతూ ఉంటుంది. వీరి జీవనోపాధికోసం, ఉన్నత చదువుకోసం వలసపోవడం వల్ల వారి సంఖ్యా మనుగడకు ప్రమాదం ఏర్పడి కనుమరుగవుతూ ఉంది.

సంస్కృతి, సంప్రదాయాలు ` ఆచార వ్యవహారాలు :

గోదావరి జిల్లా గిరిజను సంస్కృతి, సంప్రదాయాలు సామాజిక విలువలు ఉంటాయి . ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాల  నడుమ ఆదివాసీ జీవనం వైవిద్యంగా సాగుతుంది. భిన్నమైన సంస్కృతి, సంప్రదాయాు గిరిజనుకి సొంతం. తమ సంస్కృతి, సంప్రదాయా మనుగడ కోసం గోదావరి జిల్లా గిరిజనుల  నిత్యపోరాటం సాగిస్తున్నారు. వీరిలో అనేక తెగలు ఉండటం వల్ల  ఒక్కొక్కరిది ఒక్కొక్క విభిన్న సంస్కృతి, సంప్రదాయం. ముఖ్యంగా ఆదిమ జాతులు జరుపుకునే పండుగలో భూదేవి పండుగ ఒకటి. తొలకరివానులు కురిసే సమయానికి ముందు అంటే వ్యవసాయ పనులు ప్రారంభించడానికి ముందు భూమాతను పూజిస్తారు. దానిలో భాగంగా జంతువులును బలి  ఇస్తారు. వీరికి ప్రత్యేకంగా కొన్ని నృత్యాలు కల. వీటిలో డప్పునృత్యం, కొమ్మునృత్యం మొదలగునవి. పండుగ సమయాలలో ఆడ, మగ అనే భేదం లేకుండా తాటికల్లు,  సేవిస్తారు. ఆ చెట్లను వీరు పరమ పవిత్రంగా భావిస్తారు. గిరిజనులకు తమవైన ఆచారవ్యవహారాలు, సాంఫీుక కట్టుబాట్లు ఉన్నాయి. వారు సాధారణంగా పంచాయితీ పెద్ద చెప్పిన తీర్పుకి కట్టుబడి ఉంటారు. పంచాయితీ తీర్పుని గౌరవించని వారిని కుల బహిష్కరణ చేస్తారు. వారిని ఎలాంటి వేడుకల్లోను, ఉత్సవాల్లోను పాల్గొననివ్వరు. ముఖ్యంగా పెళ్ళిళ్ళు, పండుగలు వంటి వాటికి రానివ్వరు. వాటిలో పాల్గొనాంటే కులం  కట్టుబాట్లు ప్రకారం మరలా కులంరి కు కట్టుబాట్లు చాలా కఠినంగా ఉంటాయి.

వివాహ వ్యవస్థ:

గోదావరి జిల్లాలోని గిరిజను వివాహ వ్యవస్థలో కొన్ని ప్రత్యేక పద్దతున్నాయి. అవి `
1. పెద్దలు  నిర్ణయం ప్రకారం నిశ్చయించిన వారిని పెళ్ళి చేసుకోవడం.
2. అమ్మాయిని బలవంతంగా ఎత్తుకుపోయి పెళ్ళి చేసుకోవడం. దీనినే రాక్షస వివాహం అంటారు.
3. కాబోయే మామగారి ఇంట్లో కొంత కాలం  పాటు వారికి సేవ చేసి వారి అమ్మాయిని పెళ్ళి చేసుకోవడం. ఈ పద్దతిని పరాయనం లేదా మగనాలు  అంటారు.
4. అమ్మాయి, అబ్బాయి ఇష్టపడి పెళ్ళి చేసుకోవడం.
5. తల్లిదండ్రు ఒప్పుకోకపోతే అబ్యాయి, అమ్మాయి కలిసి పారిపోయి పెళ్ళి చేసుకోవడం.

వైద్యం:

గిరిజన సమాజంలో వైద్యానికి సంబంధించి కొంత ప్రత్యేకత ఉంది. అదేమిటంటే గిరిజనులందరికి  వనమూలిక వైద్యంపై కొంత అవగాహన ఉండటం. అడవిలో వెళుతున్నప్పుడు తేలు కాటేసిన ఆకు రసం పిండుకుంటే ఉపసమనం  కలుగుతుంది . దీనిని వారు ప్రాథమిక వైద్యంగా భావిస్తారు. తర్వాత వారు వైద్యుడి దగ్గరికి వెళతారు. గిరిజన వైద్య విషయంలో మరొక ముఖ్య విషయం ఏమిటంటే వీరు వైద్యులపై పూర్తి నమ్మకాన్ని కలిగి ఉంటారు. అతడికి మానవాతీత శక్తుంటాయని భావిస్తారు. మంత్రాలతో వైద్యం చేసే వారిని ‘‘వెజ్జు’’ అంటారు. ఈ వైద్యం చేసే వెజ్జు ప్రత్యేకంగా ఉంటారు. వారిపై వీరు విశ్వాసాన్ని కలిగి ఉంటారు.

ముగింపు :

గోదావరి జిల్లా గిరిజనుల అడవితల్లిని, ప్రకృతిని ప్రేమించడమే తెలుసు. ఏదైనా సరే మనది అని కలుపుకుని అందరితో ఉండడమే వారికి ఇష్టం. అటువంటి ఈ గిరిజన తెగ ఉనికి ఇప్పుడు ప్రశ్నార్ధకమైంది. విక్షణమైన వీరి జీవన విధానం సంస్కృతీ, సంప్రదాయాలు కాలలో కలిసిపోతాయని చరిత్రకారులు, పరిశోధకులు, ఆంధ్రోపాజిస్టులు దోళన చెందుతున్నారు. శతాబ్ధాలుగా, సజీవంగా ఉన్న ఈ గిరిజన తెగ ప్రాచీన సంస్కృతి నాగరిక సమాజపు కొత్త పోకడ వలన కనుమరుగవుతుందనడంతో సందేహం లేదు.

దొడ్డి శ్రీదేవి,
పరిశోధక విద్యార్ధి,
తెలుగు ప్రాచ్యభాషా విభాగం,
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాయం,
నాగార్జుననగర్‌, గుంటూరు.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

UncategorizedPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)