ఆధునిక విమర్శ స్వరూప స్వభావాలు (సాహిత్య వ్యాసం )-జూపూడి మార్జియాన

ISSN 2278-478

విమర్శ ` విమర్శకుడు :

విమర్శ ` ప్రకాశం అన్నది ఒక దాంతో ఒకటి ఎప్పటికి కలిసే ఉంటాయి. విమర్శ ముందే ఉంటుంది. ఈ రెండింటి  సంబంధం విడదీయకుండా ఉంటుంది. భారతీయ అలంకారిక  సిద్ధాంతాన్నీ కూడా విమర్శను కావ్య గత సౌందర్యాన్ని ప్రకాశింపజేయటానికి పనికి వచ్చేటట్లుగా చేస్తున్నాయి. స్థూలం గా ఈ రెండూ భిన్నంగా కనిపిస్తాయి. కాని సూక్ష్మంగా చూస్తే ఈ రెండు ఒక్కటే.

ఒక రచనను చదివినప్పుడు బాగుంది. ఆ రచనలో కొంత చదివి చాలా బాగుంది అన్నా ఆ రచన మనకు తెలిసినట్లు కాదు. ఆ రచనలో ఉన్న బాగు ఏంటి? దానికి ఏమైనా విపులంగా చెప్పడానికి వీలుంటుందా, దానిని వేరే విధంగా చెపితే బాగుంటుందా దాన్ని మాటల్లో చెప్పటానికి మీందావీలుందా  ? ఆ మాటలు మామూలు మాటలా, విశిష్టమైన మాటల్లోనా? దానివల్ల  ప్రయోజనం ఏమిటి? మనకు తెలియాలి. స్థూలంగా  చెప్పాంటే ఈ విమర్శ అంటే ఈ ప్రశ్నకు సమాధానమే.

సాహిత్య రచనలోని వైశిష్ట్యాన్ని చూపించేదే విమర్శ. దూసుకువస్తున్న ప్రతి కొత్త రీతి రచనకు వెనుకటి దానితో దానికున్న సంబంధం దాని ముందు ఎంత స్వతంత్రించింది అన్న విషయాలను విమర్శ ప్రతిక్షణం బేరీజు వేస్తూ ఉంటుంది. నూతనంగా ఆవిష్కారమైన విషయం సంప్రదాయంలో ఎలా కలిసిపోయిందో కూడా చూపడం విమర్శలోని అంశమే. దాంతో పాటు విమర్శ పాఠకుని అభిరుచిని తీర్చిదిద్దుతుంది ఇలా.

సాహిత్య విమర్శ ` శాస్త్ర ప్రతిపత్తి :
సాహిత్య విమర్శనే శాస్త్రమని అంటున్నాం. శాస్త్రం అనేది సమూహం మీద ఫలితాలను, నిర్ణయాల చూపిస్తుంది. అందుకు ఒక తర్కాన్ని, కొన్ని నిరూపణ విధానాలను తయారు చేసుకుంటుంది. సేకరించుకుంటుంది. (1) విషయ సమాచారం, (2). తర్కం, (3). నిరూపణ. సిద్ధాంతం, నిర్ణయం, ఫలితం ఏ రకం శాస్త్రంలోనైనా స్థూలంగా  ఈ అంశాలుంటాయి . ఎందుకోసం ? అన్నది ప్రధానమైన ప్రశ్న. సాహిత్య సృజన అనుభూతి పునాదిపైన జరుగుతుంది. అనుభూతి అన్నది జీవితానుభవాల  కారణంగా లభించే సంస్కారం, ఈ అనుభూతితో జ్ఞానం నిక్షిప్తమై ఉంటుంది. దాన్ని విడమర్చి వాఖ్యానించి సుస్పష్టం చేయడమే విమర్శ ప్రధాన లక్ష్యం. ఈ జ్ఞానం కూడా రెండు రకాలు ఉంటుంది.

(1). ఆ కావ్యత్వానికి హేతువుల్ని చూపించేది,

(2). ఆ కావ్య ఇతివృత్తం `

వస్తువు విషయం దేన్ని సూచిస్తోంది. దాని ద్వారా ఏ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. జీవితానికి సంబంధించిన జీవితంలో ముడిపడి ఉన్న ఏయే చారిత్రక, సామాజిక ఆర్ధిక అంశాలు అందులో ఉన్నాయి. అన్ని వాటిని తెలిపేది. కవి మాత్రమే విమర్శకుడు కానక్కరలేదు.

కవి ప్రవృత్తికీ, విమర్శకుని ప్రవృత్తికీ బేధం ఉన్నప్పటికి ఇద్దరిలోను ఉండాల్సిన ముఖ్యాంశం సహృదయత, కవి మౌలికంగా చూసేది తన అనుభూతికి అభివ్యక్తి. విమర్శకుడు మౌలికంగా చూసేది రచన శాస్త్ర పరీక్షకు విలువిస్తుందా? అని ఒక దశలో కవికి ఉండే మన:స్థితిని ఇలియట్‌ ఇలా విశదీకరించాడు.

ఇతరుతో సంబంధం లేదు. సరైన శబ్దాలు  దొరుకుతున్నాయా ? ఇంకా మాట్లాడితే తప్పుడు శబ్దాలు  రావడం లేదు కదా ! అన్న వరకే సంబంధం ఉంటుందతనికి ఆ శబ్దాల్ని అసలెవరైనా వింటారా? లేదా? అన్నదాంతో కానీ, అసలెవరికైనా అర్ధం అవుతాయా? కావాలా ? అన్నదాంతో కానీ, అతనికి సంబంధం లేదు. అణిచిన భారం నుంచి అతడు విముక్తుడు కావాలంటే అతడు దానికి అంటే కవితకు జన్మనివ్వాలి.

విమర్శకు పాండిత్యావసరం :

విమర్శకు ఒక సాహిత్య రచనను విమర్శించటానికి అతనికి ఉండి తీరాల్సిన ముఖ్యాంశాలలో ఒకటి పాండిత్యం. భవనం ఉంది మీద మనకు థృగ్గోచరమయ్యే కట్టడం కాని దానికి అడుగున కనిపించకుండా ఉండే ఆధార నిర్మాణం భూమిలో ఉండాల్సిన పునాది. విమర్శ పాండిత్యా మధ్యన ఉండే సంబంధం కూడా ఇలాంటిదే. ఒక గొప్ప సాహిత్య గ్రంథాన్ని చదివే పాఠకులలో రకరకాల  వాళ్ళుంటారు. వారి విద్యాస్థాయిలో తారతమ్యాలుంటాయి . కావ్యశాస్త్ర అధ్యయనం లౌకిక ఆథ్యాత్మిక శాస్త్రా అధ్యయనం చేసిన పాఠకుని స్థాయితో, అవిద్యావంతుడైన పాఠకుని స్థాయి ఖచ్చితంగా తక్కువ ఉంటుంది. కొందరు పాఠకులు  రచనను కాలయాపన కాకుండా ప్రయోజన లక్ష్యానికి చదువుతారు, మరికొందరు కేవలం  పొద్దుపోక కాలయాపన చేయటానికో, మరేదైన అప్రయోజనపు లక్ష్యానికో చదువుతారు. ఒక రచనను చదివే హక్కు అందరికీ ఉంటుంది. కానీ దాన్ని అందరు విమర్శించటం మాత్రం కుదరదు. విమర్శ అన్నది సాహిత్య సంస్క ృతిని వృద్ధి చేసే అంశం కాబట్టి అది పాఠకుకు విద్యగా మారాలి. ఒక రచన పాఠకునికి అనుభూతిని కలిగిస్తే ఆ అనుభూతిని ఆ అనుభూతిని రక్షిస్తూ దాని వల్ల  లోకానికి సామాజిక, సాంస్క ృతిక లాభాలకు విమర్శ దోహదపడాలి. ఈ విశిష్ట కార్యాన్నే వ్యుత్పన్నపరుడైన విమర్శకుడే చేయ గలుగుతాడు  తప్ప కేవం పాఠకుడు చేయలేడు. విమర్శ తమాషా కోసం కాదు నిజానికి కావ్యం ఆనందం కోసం కూడా కాదు. కావ్యానందాన్ని శాశ్వతం చేసే కావ్య మననం అన్ని ముఖ్యాంశాన్ని క్రమబద్ధం చేసి పాఠకుని చైతన్యాన్ని పెంచుతూ, కావ్య గత మర్మాలను విశదీకరించడానికే విమర్శ ప్రధానంగా పనికి వస్తుంది.

ప్రశంస ` విమర్శ :

ప్రశంసించడం, విమర్శించడం రెండూ ఒక్కటి కావు. ప్రశంసించడం అన్న దానిలో అభిమాన దురభిమానాలు  అతార్కికమైన అతిశయోక్తులు , కేవలం  ప్రోత్సాహకత్వం రచయితకు, విమర్శకో నిర్హేతుకంగా కీర్తి సంపాదించి పెట్టాలన్న తపన మొదలైన విమర్శేతర విషయాలుంటాయి . కొందరు విమర్శకుని పేరు పొందినవాళ్ళు కూడా అప్పుడప్పుడు ప్రశంసలోకి దిగడం చేత పాఠకులకు విమర్శ వల్ల  ప్రయోజనం దక్కదు. అంతే కాకుండా అతనికి విమర్శకు మీద, విమర్శ మీద విశ్వాసం సడలుతుంది. ప్రశంసలో కావ్యకర్త మీద ప్రశంసకునికి (విమర్శ) ఉన్న గౌరవం, అభిమానం, ప్రేమలు  కనిస్తాయి. లేదా పాఠకుణ్ణి ప్రశంసకుడు తాను ప్రశంసిస్తున్న రచయితను గౌరవించమని పరోక్షంగా డిమాండ్‌ చేయడం ఉంటుంది. ఒక్కొక్కప్పుడు అతడీ పని కావాలని చేస్తాడు. ప్రశంస అన్న దానిలో విశ్లేషణాత్మక దృష్టి కాని, తులనాత్మక పరిశీలన కాని ఉండవు. కాని విమర్శలో ఈ రెండు అత్యంత ప్రధానమైనవి. అతిశయోక్తి అన్నది సత్యాన్వేషణకు, సత్యానికి విరుద్ధమైనది. కాని విమర్శ పరమార్ధమే సత్యాన్ని తెలుసుకోవడం రానున్న వాళ్ళకు మన మార్గం అనుసరణీయంగా ఉండాలి. విమర్శ శాస్త్రీయత ఉన్న విద్య కాబట్టి సత్యాన్ని తెలుసుకోవటానికి అది బాగా పనికి వస్తుంది.

కావ్యాత్మ ` రచనలోని విమర్శ  :
కావ్యాత్మ అని భారతీయు చేసిన సిద్ధాంతాన్ని ఈనాటి విమర్శ శాస్త్రానికి ఎంతో అవసరమైనవి. రిచర్డ్స్‌ మొదలైన వాళ్ళు ప్రారంభించిన ‘‘మిమ’’ అన్న చర్చకీ దీనికి పోలికలున్నాయి. ఒక సృజనాత్మక రచనను విమర్శిస్తున్నప్పుడు విమర్శకుని ప్రధాన ల దాని విలువను  తీర్చిదిద్దడం ద్వారా రచయిత చూపిన నైపుణ్యం. అందువల్ల వ్ల ఈ పాఠకుల్లో కల్గిన ‘వస్తువు అనుభూతి’ మొదలైన విషయాలను విమర్శకుడు తార్కికంగా వివరిస్తాడు. మొదట మాత్రం అతని దృష్టి అసలా రచన ఎందువల్ల  గొప్పది? అన్న దాని మీద ఉంటుంది. ఈ ప్రశ్ననే మరొక రకంగా కూడా వేయవచ్చు. సృజనాత్మక రచన గొప్పదనం దీన్ని బట్టి నిర్ణయమౌతుంది.

కావ్య ముఖ్యంగా ధ్వని :

భారతీయ అంకారికులు  సాధించిన గొప్ప విమర్శ సాధనం ధ్వని. దీన్నే కావ్యాత్మగా ఆనందవర్థనుడు తమ వైదుష్యంతో ప్రతిష్టించారు. ఒక కావ్యం పఠితను ఆకర్షించడానికి హేతువేమిటో ఆయన ధన్యాలోకం విమర్శనాత్మకంగా పరిశీలించింది. ఈ సిద్ధాంతంలో  ప్రాధాన్యాన్ని విమర్శకు నిరసించడానికి శాస్త్రీయమైన భూమిక లభించింది. కావ్య ప్రాణం ఏదో దాన్ని సహృదయ విమర్శకుడు గ్రహించి, దానివల్ల  కావ్యానికెట్లు రమణీయకం. ఆకర్షణ కలుగుతాయో పాఠకుకు విశదీకరించాలి. కావ్య ధ్వనిని విశదీకరించడం విమర్శకుని బాధ్యత. పాఠకుందరు ఈ శక్తిని పరిపూర్ణంగా కలిగి ఉండరూ. చాలా మంది పాఠకులు  కావ్య ధ్వని స్పృహ ఉండకపోవచ్చు కూడా. ధ్వని మీద అభిరుచి పాఠకునికి కలిగేలా చేయడంలో విమర్శకునికి మించిన వాళ్ళు లేరు. ప్రసన్న కథా కలితార్థయుక్తి అన్న విశ్వనాథ వారి విమర్శ నుంచి ‘‘మీన కవిత’’ అన్న అద్దేపల్లి రామమోహన్‌రావు విమర్శ వరకు ఎందరో విమర్శకు ఆధునిక కాంలో ఈ పనే చేశారు.

అంకారం ` ఒక కొలమానం :

రచన పాఠకుణ్ణి తన సాహిత్య మూల్యం  చేతనే ఆకర్షించి అతని మీద ప్రభావాన్ని వేస్తుంది. అప్పుడే రచనలో వస్తువు పాఠకుని సొంతం అవుతుంది. ఆకర్షణ లేని రచన నిర్జీవమైంది. సాహిత్య ప్రక్రియన్నింటిలోనూ కవిత్వం అభివ్యక్తి విధానం విశిష్టమైంది. కేవలం  కథన ప్రధానమైన నవల , కథ లాంటి రచనకు కవితా రచనకు అభివ్యక్తిలో ఎంతో బేధం ఉంటుంది. కవిత్వంలో అలంకారం ఒక భాగం. అంకారమే వక్రోక్తి సిద్థాంతంలోని ఒక ముఖ్యాంశం అయింది. ధ్వని సిద్థాంత ప్రవక్త కూడా అలంకార ధ్వనిని త్రివిధ ధ్వనులో ప్రతిష్టాపించాడు. ఆధునిక కాలంలో అంకారమే భావచిత్రంగా రూపొందింది. సాహిత్య సిద్ధాంతాలు  పుట్టిన అన్ని యుగాల్లోను ఏదో ఒక విధంగా అలంకారం ప్రాధాన్యం పొందుతూనే ఉంది. అయితే బాధ్యతారహితంగా మితిమీరి అలంకార రచన చేయకూడదన్న భావం ఉంది.

మహా కావ్య రచన జరుగుతున్నప్పుడు అందులో అలంకారం రసపోషకంగా ఉండాలి. విమర్శకుడు రచనను విమర్శిస్తున్నప్పుడు రచన ప్రధానమైన విలువుగా  అలంకారం వల్ల  కలిగిన సౌందర్యాన్ని గ్రహించి వివరించడం ఒక పద్ధతి. మరో పద్ధతి అంకారం ఎలా పరిపోషకం అవుతుందో పరిశీలించడం.

-జూపూడి మార్జియాన

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సాహిత్య వ్యాసాలు ​Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)