” జీన్స్ “(కవిత )-  -డాక్టర్ మాను కొండ సూర్యకుమారి,

మా ఇంట్లో తరతరాలుగా
వంటిల్లు ఒక స్త్రీలింగం,
వీధిగది , కచేరీచావిడీ పుంలింగాలు.
అదేమిటో గానీ మా వంటిళ్ళు
నడుస్తాయి!ఎప్పుడు చూసినా
అలసిపోయి వుంటాయి అప్పుడప్పుడూ కళ్ళనీళ్ళు పెట్టుకుంటాయి!
‘తడి కట్టెలు ‘అనేది బామ్మ!
ఇప్పుడు గేస్ స్టౌలు వచ్చినా
వంటింటి కంటితడి ఆరడంలేదు.
అయినా పెద్దగా ఎవరూ పట్టించుకోరు.
వంటింటికి కూడా మనసుంటుందంటే
ఆశ్చర్యపడి పోతారు!
భోజనాలకి తప్ప అసలు ఎవరూ
అటు వైపు తొంగి చూడరు.
ఈ మధ్య అది కూడా మానేసారు.
ఇప్పుడు వంటిల్లే టివీ దగ్గరకు
వస్తోంది,భోజన సరంజామా పట్టుకుని!
వంటింటి విలువ పిల్లలకు
తెలిసినట్లు పెద్దవాళ్ళకు తెలీదు.
అక్కడ నుండి వచ్చే మమతలపరిమళాలకి పిల్లలంతా
వంటింటిచుట్టూ మూగుతారు.
Of course .అక్కడ చిరుతిళ్ళుకూడా
దొరుకుతాయి.
నా కూతుళ్ళను రేపటి వంటిళ్ళుగా
మార్చడం నాకిష్టం లేదు!
అందుకే మా modern kitchen లో
వంటిల్లు – ఒక జీతం పుచ్చుకునే పుంలింగం !
అయినా సరే మా చిన్నపిల్ల
మూడేళ్ళది, ఎప్పుడు మొదలెట్టిందో
వంటింటి ఆటలు మొదలెట్టింది.
దాని ఆటబొమ్మల్లో గేస్ స్టౌలు,సిలిండర్లూ,కుక్కర్లూ, టీ సెట్లు వుంటాయి.
అంట్లు తోముకునే ప్లాస్టిక్ పీచు కూడా
ఒకటి వుంది. గిన్నెలన్నీ శుభ్రం గా తోమేసి
ఉత్తుత్తి వంట చేసేసి, టీవీ దగ్గరకు
భోజన సరంజామా చేరవేస్తుంది.
నిర్ఘాంతపోయిన నన్నూ,నా చూపుల
బాకుల్నీ ignore చేసి వడ్డన ప్రారంభిస్తుంది.
తరతరాలుగా జీర్ణించుకుపోయిన
వంటింటి తత్వం, ఆడపిల్లల”జీన్స్ “లో
permanent మార్పు
తెచ్చేసింది కాబోలు!!

                                                               -డాక్టర్ మాను కొండ సూర్యకుమారి,

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)