సముద్రం(కవిత )-దేవనపల్లి వీణావాణి

ఇక్కడ
ఎన్నాళ్ళ నుంచి ఉందో
తన అప్రసవిత గర్భంలో
ఎన్నెన్ని కథల దాచుకుందో…

అనంతాయువు మోస్తున్న ఆ అలలు
గాలికి ఏ ముచ్చట్ల చెప్పి పోతున్నయో..

దివారాత్రుల కాంతి రేఖలు
సముద్ర దేహానికి రేపిన ఉద్వేగానికి
చెలరేగిన అలలు
మోసిన ఏ జ్ఞాపకాన్నీ తీరానికి
అతకకుండా తడిమి వెళ్తున్నాయి…

నేను
సన్నని నీటి పొరల చల్లదనాన్ని
తాకుతూ తన లోలోకి చూడాలనుకున్నాను
జీవితం లాగే అంతుబట్టని లోతు…
మనసు తప్పించుకోలేని బాధ మోసినట్టే
తనలో లవణ సమ్మేళనం

ఇసుక మీద నడుస్తున్న
నా పాదాల గుర్తుల్ని చెరిపేస్తూ
తన జీవత్వాన్ని
జీవన అల్పత్వాన్ని చూపెట్టి
వెనక్కి తిరిగి చూసి నవ్వే ఆప్త హృదిలా
మళ్ళీ మళ్ళీ ఎగిసే చిన్ని అల

సముద్రం సముద్రంగా ఇక్కడ ఉంది గానీ
నిజానికి తానే అంతటా ఉంది
ఒఱ్ఱె ఒంకలై కొండకోనల కొసల జారిన వాన చినుకుల్లోనే కాదు
ప్రతి కణంలోనూ
రెప్పచాటు ఉప్పు కయ్యలోనూ
తడి తడి గుండెలోనూ

-దేవనపల్లి వీణావాణి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో