పిపీలికం (కవిత )-దేవనపల్లి వీణావాణి

మళ్ళీ ఓడిపోయాను
నా శేరు మస్తిష్కమ్ అకశేరుకం
ముందు బొక్క బోర్లా పడిపోయింది
అవి ఎంగిలి పడని ఏ మధుర పదార్ధం ఏదీ
మా చూరుకింద లేదు

వాటి చిన్నకళ్ళ నుంచి తప్పుకోడానికి
మా చక్కర డబ్బా ఎన్ని దాగుడుమూతలు ఆడిందని..
ఆ జిహ్వ ఎప్పుడూ నిరాశ పడలేదనుకుంటాను

ఇంత ఘ్రాణ శక్తి కోసం
ఎన్ని సాధనా తంత్రాలు చేసాయో…

అడుగు అడుగు కొలుచుకుంటూ
గొలుసుల దండలా నడిచే
ఈ ఆరు కాళ్ళ పొదుపరులు
పూసా పూసా పోగేసి నింపే
వాల్మీకాల ముందు నా జీవిత కాలపు
ఖాతా చిన్నబోతది

ఆ కేశమంటి పాదాల దారిని మళ్లించే
లక్షణ రేఖా వలయం వీటి సంకల్పం
ముందు నీళ్ల మూటే

నీ దాడికి
ఎంత విసిగిపోయినా

ఓ చిట్టి చీమా…

నీ బుజ్జి నడకలో
ఎంత క్రమ శిక్షణ ఉందో కదా
కాస్త మా బుద్ది జీవులకు కాస్త అద్దిపోదువూ…

 -దేవనపల్లి వీణావాణి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)