కె.వి . సత్యనారాయణ నృత్య రూపకాలు పరిశీలన(సాహిత్య వ్యాసం )- డా.లక్ష్మణరావు ఆదిమూలం

ISSN 2278-478

కూచిపూడి నాట్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నవారిలో కె.వి.సత్యనారాయణ ఒకరు. సత్యనారాయణ కోరాడ నరసింహారావు, వెంపటి చినసత్యం, వేదాంతం ప్రహ్లాద శర్మ వద్ద నాట్యాన్ని అభ్యసించారు. 1982లో ‘శ్రీ సత్య కూచిపూడి అకాడమీ’ నృత్య సంస్థను స్థాపించి ఎందరో కళాకారుకి నృత్యంలో శిక్షణ ఇస్తున్నారు.

శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌లో ‘ఆముక్తమ్యాద’ ధారావాహికకి కొరియోగ్రాఫీ చేసారు. తెలుగు సినిమాలో శృతిలయలు, స్వర్ణకమలం, సూత్రధారులు , స్వాతికిరణం సినిమాలకి నృత్య దర్శకత్వం వహించారు. మహిషాసురమర్ధని, మోహినీ భస్మాసుర, బుద్దం శరణం గచ్ఛామి, మూడునృత్య రూపకాను రచించి, నృత్య దర్శకత్వం వహించి ఎన్నో ప్రదర్శలను ఇచ్చారు.

భారతదేశంలోనే కాక న్యూజెర్సీ, యంగ్‌స్టోన్‌, చికాగో, టంపా, న్యూమెక్సికో, సింగపూర్‌ వంటి అనేక దేశాలో కొన్ని వంద ప్రదర్శలను ఇచ్చారు. గత 24 సంవత్సరాలుగా అమెరికాలో ప్రదర్శలను శిక్షణాతరగతులు నిర్వహిస్తున్నారు. ఇంకా నెదర్‌లాండ్స్‌, కెనడా, శ్రీలంక, దుబాయి, కొరియా, ఫ్రాన్స్‌ వంటి దేశాలు పర్యటించారు.

నాట్యకళావిపంచి, కళాస్వాతి, నాట్యకళావిశారద, విశ్వశ్రీ నాట్యాచార్య, కళారత్న(2009), విశిష్ట సేవ పురస్కారం(2008), భరతముని అవార్డు(1988), నాట్యకళా తపస్వి, ఆంధ్రకళామూర్తి, అవార్డు అందుకున్నారు.

ఆముక్తమాల్యద , పంచకావ్య, నృత్యాక్షరి, చిన్నాదేవి, శ్రీదత్తగాధ, భాగ్యనగరం, నృత్య రూపకాలను కూడా ప్రదర్శించారు. ఇప్పటికీ దేశవిదేశాలో కూచిపూడి నాట్యానికి సంబంధించిన శిక్షణ తరగతులు నిర్వహిస్తూనే ఉన్నారు.
వీరు రచించిన నృత్య రూపకాలు మోహిని భస్మాసుర, బుద్ధం, శరణం ` గచ్చామీ, మహిషాసురమర్ధని.

వస్తువు :
‘మోహినీ భస్మాసుర’ నృత్యరూపకంలో వృకాసురుడు శివునికై తపస్సుచేసి వరం పొందుతాడు. ఆ వరం వన వృకాసురుడు ఎవరి తపై చేయి పెడితే వాడు భస్మం అయిపోతారు. శివుడినే పరీక్షించాని వృకాసురుడు శివుని తపైనే చేయిపెట్టాని నిర్ణయించుకుంటాడు. అప్పుడు శివుడికి వేరే దారిలేక విష్ణువుని శరణు కోరతాడు. జరిగిన విషయాన్ని విష్ణువుకి వివరిస్తాడు. విష్ణువు మోహిని రూపంలో వచ్చి భస్మాసురుడిని మోహంలో ముంచి అతని చేతిని అతని తపైనే పెట్టుకునేలా చేస్తాడు. అంతటితో భస్మాసురుడు భస్మం అవుతాడు.

రెండవది బుద్ధం`శరణం`గచ్చామి. చారిత్రక పురుషుడైన బుద్దుని జీవిత కథ. నృత్య నాటకం. లుంంబిని వనంలో మాయదేవి, సిద్ధార్ధునకు జన్మించినవాడు .బుద్దుడు. మహారాజు అయినప్పటికి సన్యాసాన్ని స్వీకరిస్తాడు. చివరికి అడవులకి ప్రయాణం అవుతాడు. అప్పుడు నృత్యనాటిక ప్రారంభమవుతుంది. బుద్దుడు తన నృత్యబోధనతో బింబిసారుడికి తత్వ బోధన చేయడం, వైశాలి నగరంలో అతిలోక సౌందర్యరాశి ఆమ్రపాలి సౌందర్యానికి వైశాలి నగర యువకులు ఆమె పొందుకొరకు యుద్దాలు చేయడంతో రాజ్యం అల్లకల్లోంగా ఉంటుంది. ఈ పరిస్థితికి మనసు చలించి బాధపడుతున్న అమ్రపాలికి తన చెలికత్తె బుద్దుడి గురించి చెబుతుంది. బుద్ధుడిని దర్శించి తన ఇంట ఆతిథ్యం స్వీకరించమని అర్ధిస్తుంది. అమ్రపాలి. అమ్రపాలికి ఒక మామిడిపండు ఇచ్చి నేను మరల వైశాలికి వచ్చినప్పుడు ఈ పండుని తిరిగి తీసుకుంటానని చెప్పి బుద్ధుడు వెళ్లిపోతాడు. మరల కొంత కాలానికి బుద్ధుడు వైశాలి నగరానికి వచ్చి ఆమ్రపాలిని మామిడిపండుని తీసుకురమ్మని చెబుతాడు. బంగారు పెట్టెలో భద్రంగా దాచిన పండును తీసుకువస్తుంది ఆమ్రపాలి. ఆ మామిడిపండు కుళ్లిపోయి ఉంటుంది. అది గమనించి బుద్ధుడు చెప్పిన తత్త్వబోధన ఆమ్రపాలి బుద్ధునికి సేవకురాలిగా మారిపోతుంది.

మూడవది ‘మహిషాసుర మర్ధిని’ నృత్యరూపకం. శూన్యవిశ్వం. శూన్య విశ్వం నుండి ఓంకారం జనియిస్తుంది. ఆ ఓంకారంనుండి సక శక్తిస్వరూపిణి అయిన ఆదిపరాశక్తి ఉద్భవించెను. త్రిమూర్తులకు, త్రిమాతకు అద్భుతమైన ఈ లోకాన్ని పాలించి తరించండి. ఆపద సమయంలో నన్ను తంచిన మిమ్మల్ని రక్షించగనని హామి ఇస్తుంది. దానవ సామ్రాజ్యాధిపతి అయిన మహిషాసురుడు ప్రజలకు అనేక ఇబ్బందులు కలిగించడం మొదలుపెడతాడు. మహిషాసురుడి తపస్సుకు మెచ్చి బ్రహ్మ ఏం వరం కావాలో కోరుకోమని అంటాడు. అప్పుడు మహిషాసురుడు సుర, నర, కిన్నెర, యక్ష, గరుడ, గంధర్వాదిగ సృష్టిలోని పురుషుచే నాకు మరణం లేకుండా వరం ఇవ్వమని అడుగుతాడు. ఆ వరం వన మహిషాసురుడి ఆగడాలు మితిమీరిపోతాయి. త్రిమూర్తులు, దేవతలు ఆదిశక్తిని ప్రార్ధిస్తారు. ఆదిశక్తి కాళిమాతగా మారి మహిషాసురుడిని అంతమొందిస్తుంది.

పాత్రలు :
ప్రదర్శనకి కథ ఎంత ముఖ్యమో , పాత్రల ప్రాధాన్యత కూడా అంతే ముఖ్యమైనది . బుద్ధం`శరణం`గచ్చామి. చారిత్రక పురుషుడైన బుద్దుని జీవిత కథ. ఆమ్రపాలి , బింబిసారుడు , మహారాజు , రాజ్య యువకులు , పరిచారికల పాత్రలు .
మహిషాసుర మర్ధిని’ నృత్యరూపకం త్రిమూర్తులు , త్రిమాత, మహిషాసురుడు , దేవతలు , దానవులు .

అంకాలు :
ప్రదర్శన సౌలభ్యం కోసం నాటకం లోని వస్తువు ని భాగాలుగా విభజిస్తారు . ఆ భాగాలను అంకాలుగా , రంగాలుగా పేర్కొనడం జరుగుతుంది . రూపకంలోని భాగాకు అంకాలు అని పేరు. వీటినే రంగాలు అని కూడా పిుస్తున్నారు. రూపకంలో రంగాలు సన్నివేశాల్ని, కథాగమనాన్ని నడిపించడంలో ప్రముఖపాత్ర పోషిస్తాయి. రంగాల్నిబట్టే ఆ నృత్యరూపకం నిడివి ఆధారపడి ఉంటుంది. నాటకం, నాటిక రెండిరటిలోని తేడాని ప్రధానంగా అంకా సంఖ్యనుబట్టే నేడు నిర్ణయించడం జరుగుతుంది.
కె.వి.సత్యనారాయణ రచించిన నృత్యరూపకాలో ‘మోహినీ భస్మాసుర’ రూపకం 3 రంగాలున్నాయి. నారదుడు, వృకాసురుడి ప్రవేశం మొదటిరంగం, వృకాసురుడు పరమశివుని అనుగ్రహం పొందడానికి తపమాచరించడం రెండవ రంగం, వైకుంఠంలో శ్రీమహావిష్ణువు వృత్తాంతం మూడవ రంగం, విష్ణువు మోహినీ అవతారం ద్చాడం నాలుగవ రంగం.

‘బుద్ధం శరణం గచ్చామీ’ నృత్యరూపంలో ఎనిమిది రంగాలున్నాయి. బుద్దుని ప్రవేశం మొదటి రంగం, మగధ రాజు బింబిసారుడు రెండవరంగం, వైశాలి రంగంలోని ఆమ్రపాలి వృత్తాంతం మూడవ రంగం, ఆమ్రపాలి చెలికత్తెతో నాట్యం చేయటం నాలుగవ రంగం, ఆమ్రపాలి బుద్దుని వద్దకు రావడం ఐదవ రంగం, బుద్ధుడు ఆమ్రపాలి గృహమునకు విచ్చేయడం ఆరవరంగం, కొంతకాం తరువాత బుద్ధుడు తిరిగి వైశాలి నగరానికి రావడం ఏడవ రంగం, బుద్ధుని బోధనతో అందరూ ప్రభావితంకావడం ఎనిమిదవ రంగం. ఇక్కడితో నృత్యరూపకం ముగుస్తుంది.

మరొక నృత్యరూపం ‘మహిషాసుర మర్ధని’. దీనిలో మొత్తం ఐదు రంగాలున్నాయి. సక శక్తి స్వరూపిణియైన ఆదిపరాశక్తి ఉద్భవించడం మొదటి రంగం, దానవ సామ్రాజ్యాధిపతి మహిషాసుర సార్వభౌముడు విధానాన్ని తెలిపేది రెండవరంగం, బ్రహ్మదేవుని కోసం తపస్సు చేయడం మూడవ రంగం, రాక్షస సైన్యం నరును పీడిరచడం నాలుగవ రంగం, రక్తబీజుడి ప్రవేశం ఐదవ రంగం, ఆదిపరాశక్తి రక్తబీజుడిని సంహరించడం ఆరవరంగం.

వచనం :
నృత్య రూపకా సాహిత్యంలోని గద్యాలే వచనాు. సంధి ప్రయోజనాత్మకంగాను, పాత్ర సంభాషణా సందర్భములోనూ, వర్ణన సందర్భంలోనూ వచనాు కన్పిస్తాయి.

కె.వి. సత్యనారాయణ రచించిన ‘మహిషాసుర మర్ధిని’ నృత్య రూపకంలో ప్రారంభంలో వచనంలో రచించబడిరది. ‘శూన్య విశ్వమునుండి ఓంకారము జనియించె. ఆ ఓంకారమునుండి సక శక్తి స్వరూపిణి అయినా ఆదిపరాశక్తి ఉద్భవించె’’ వచనంలో చెప్పడం కనిపిస్తుంది .

కైవారం :
వివిధ పాత్రలు ప్రవేశించే సమయంలో ఆ పాత్ర గొప్పతనాన్ని తెలియజేస్తూ సమానభరిత పదబంధముతో కూడిన అంత్యప్రాసు కలిగినదే కైవారం. పాత్ర స్థాయినిబట్టి తేవారం, దేహరం, పరాకు పదాలు ఉపయోగిస్తారు.
కె.వి. సత్యనారాయణ రచించిన ‘మోహినీ భస్మాసుర’ నృత్యరూపంలో ‘వృకాసురుడు’ ప్రవేశించే సమయంలో కైవారంలో సాగుతుంది.

‘‘రాజాధిరాజ, రాజగంభీర, దానవ సామ్రాజ్యనేత
శ్రీశ్రీశ్రీ వృకాసుర మహారాజునకు విజయోస్తు`3
రాక్షస రాజు వృకాసురుడు
రమణలు కొలువగా ` వెడలెను సభకు
వందిద మాగదులు జయమును పలుకగా’’ 43.

‘బుద్దం శరణం గచ్ఛామీ’ నృత్య రూపకంలో మగధ దేశాధినేత బింబిసారుడు ప్రవేశించే సమయంలో వంది మాగదు కైవారం చేస్తారు.
‘‘జయము జయము మగధ సామ్రాజ్యాధి నేత
బింబిసార మహారాజుకు జయోస్తు, విజయోస్తు
` ` ` ` ` ` ` ` ` ` ` ` ` ` ` ` `
పరాక్రమవంతుడు పావనచరితుడు
పండిత జనుకు బాంధవుడు’’ 44.

‘మహిషాసురమర్ధిని’ నృత్యరూపకంలో మహిషాసురుడు ప్రవేశించే సందర్భంలో కైవారంగా రచించబడినది.
‘‘రాజాధిరాజ దానవకు సార్వభౌమ
మహిషాసుర నామధేయ
జయోస్తు ` విజయోస్తు
అసుర నాయకుడు ` అమిత భీకరుడు
మహిషాసురుడు ` వెడలె’’ 45.

ప్రార్ధన :
నృత్యరూపకాలో తమ ప్రదర్శన ప్రారంభించే ముందు రంగస్ధం వెనుక ప్రార్ధను చేస్తారు. ఇవి ఎక్కువగా గణపతికి సంబంధించినవై ఉంటాయి. ఈ పద్యంలో ప్రార్ధన చేసే ముందు వీరు గణపతి పద్యం ఒక రాగయుక్తంగా పాడతారు.
కె.వి.సత్యనారాయణ రచించిన ‘మహిషాసురమర్ధని’ నృత్యరూపం గణపతి ప్రార్ధనతో మొదవుతుంది.
‘‘గిరిజ సుతునకు వందనము
విఘ్నాధిపతికీ వందనము
శుభకరుడు భయహరుడు
మమ్మ్లెరగాచే సిద్ధి వినాయకుడు
నృత్యగణపతికి నృత్యాంజలి’’ 38.

కీర్తనలు :
భగవంతుని రూప, గుణ లీలాదుల్ని మహిమల్ని వర్ణిస్తూ పరవశించడం, హరికథల్ని ఇతరుకు చెప్పడం, భక్తి కలిగించడం కీర్తన భక్త క్షణం. భగవంతుని గురించి ఏకాంతంగా కానీ, సామూహికంగా కానీ కీర్తించవచ్చు. కూచిపూడి నృత్య రూపకాు చాలావరకు రామాయణ, భారత, భగవత సంబంధ కథను ఆధారంగా చేసుకుని రచించిన నృత్య రూపాలే ఎక్కువ. దైవ సంబంధమైన కథు, మహిమను చెబుతూ నృత్యరూపకా రచన సాగింది. ప్రస్తుతకాంలో వస్తువును గ్రహించడం మార్పు చోటు చేసుకుంటున్నాయి.
కె.వి.సత్య నారాయణ రచించిన ‘మోహినీ భస్మాసుర’ నృత్య రూపంలో మూడవ రంగంలో వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణుని గురించి చెప్పే సందర్భం ‘కీర్తన’ రూపంలో రచించబడిరది.

॥ప॥ ‘‘వైకుంఠ పురవాసుడు
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు
॥చ॥ శంఖు చక్రగధ పంకజములొప్పగ
నీ వర్ణుడు నిరుపమానుడు
సాగర శయనుడు అమృత రూపుడు
చంద్రసహోదరి సమతుడు’’ 61.

‘బుద్ధం`శరణం`గచ్చామి’ నృత్య రూపంలో బుద్ధుని బోధను ప్రపంచం అంతా నమ్ముతున్న సమయంలో కొందరు బుద్ధుడిని అప్రతిష్ట పాు చేయాని ప్రయత్నంలో వచ్చే సందర్భం కీర్తన రూపంలో రచించబడిరది.

‘‘విన్నారా ఇది విన్నారా
ఆ బుద్ధుని మాటు విన్నారా
జాతిలేదంట, కుము లేదంట ॥వి॥
హీన, గొప్ప అన్నది లేదంట
పండిత పాయరున్నది లేదట
అంతా ఒక్కటేనన్నది మిధ్యత’’ 62. ॥వి॥

‘మహిషాసుర మర్ధని’ నృత్యరూపకంలో మహిషుడి దురాక్రమణు ఎక్కువ కావడంతో త్రిమూర్తు, దేవమునుంతా మహిషుని సంహరించమని ఆదిశక్తిని ప్రార్ధించే సమయంలో రచించబడిరది.

॥ప॥ ‘‘శ్రీ చక్ర సంచారిణి దేవి
శ్రితజన పాలిత కల్పివల్లి
శ్రీకరి ` శంకరి
॥చ॥ తేజోమయి త్రిభువనైక మోహినీ
పావన పరమ పూజిత జననీ
మండిత నేత్రత్రయి ముఖ విసిత మండలే
కనక కంకణా కణకణ రవము కల్పిత అమృత హస్తే
చంద్రశోభిత మంజు మంగళ దివ్య సుందర రూపిణీ
విశ్వమాతే విశ్వేశ్వరి విశ్వసంరక్షిణి’’ 63.

వచనం :
నృత్య రూపకా సాహిత్యంలోని గద్యాలే వచనాు. సంధి ప్రయోజనాత్మకంగాను, పాత్ర సంభాషణా సందర్భములోనూ, వర్ణన సందర్భంలోనూ వచనాలు కన్పిస్తాయి.

“మహిషాసుర మర్ధని” నృత్య నాటకంలో శూన్య విశ్వము నుండి ఓంకారం జనియించెను . ఆ ఓంకారం నుండి సకల్ స్వరూపిణి అయిన ఆదిపరాశక్తి ఉద్భవించెను “ అంటూ కథా గమనం వచనలో సాగుతుంది .

మోహిని భస్మాసుర , మహిషాసుర మర్ధని , బుద్ధం శరణం గచ్చామి మూడు నృత్య నాటకాలలో వస్తువు , అంకాలు వచనం , కీర్తనలు , ప్రార్ధనలు , పాత్రలు , కైవారాలు కనిపిస్తాయి . సాధారణంగా సాగే తెలుగు నాటకాలకి , ఈ నృత్య నాటకాల రచన భిన్నంగా ఉంటుంది . అటు సాహిత్యం , ఇటు నాట్యం తెలిస్తేనే రచన చేయడం సులువు అవుతుంది . అందుకే నాట్య కళాకారులుకు సాహిత్యం తో సంబంధం , ప్రవేశం ఉంటుంది కాబట్టి వారే నృత్య నాటకాలు రచించడం మనకు కనిపిస్తుంది . ఆకోవలోకే కె .వి సత్యనారాయణ కూడా వస్తారు . మీరు రచించి , నృత్య రూపకంగా మలిచి వీటిని దేశ విదేశాలలో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు .

– డా.లక్ష్మణరావు ఆదిమూలం

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలుPermalink

Comments are closed.