పండుగొచ్చిన వేళ (కవిత ) -దాసరాజు రామారావు

గుడిసె మీదెక్కిన కోడిపుంజు
పండుగ పిలుపును తీయగా కూసింది
తూర్పు సమీరం
అప్పుడే విచ్చిన సూర్యగుచ్చాన్ని కానుకగా మోసుకొస్తున్నది
గూట్లోని గువ్వపిల్లలు రెక్కలు మొలిపించుకొని
పనులకు బయలెల్లినయి
చెట్లు
ఆహ్వాన పత్రాల్నిలిఖిస్తున్నయి
మేఘాలు
చలువ పందిళ్ళల్లుతున్నయి
దారులన్నీ
పూలతేరులై పరచుకున్నయి
మామిళ్ళు విరగ కాసి
లోకం వాకిట్ల తోరణాలవుతున్నయి
పొలిమేరల్లో ఎనిమిది దిక్కులు
బాజా భజంత్రీలు మోగిస్తున్నయి
కొత్తబట్టల్ని ,
ఆకుపచ్చ రంగుల్లో నేసి
ప్రక్రుతి పంచుతున్నది
సింగారించుకున్న ఆటవిక సుందరి
గానా బజానా మొదలవుతున్నది

ఆయుధాలన్నీ
బంగాళాఖాతంలోకి విసరబడుతున్నయి
యుద్దాలన్నీ
నేల మాళిగలో సమాధై పోతున్నయి
పొర పొచ్చాలన్నీ
ఇచ్చకాలవుతున్నయి
ఎక్కువ తక్కువలన్నీ
సమతూకాలవుతున్నయి

అరిటాకు విస్తరి ఒకటే వేసింది
అన్ని రుచుల వడ్డన ఒకటే జరిగింది
గుండ్రంగా కూచున్న జన ప్రపంచానికి
పెద్ద పెద్ద ముద్దలు చేసి ,
చేతుల్లో పెడుతున్నది
పేదరాశి పెద్దమ్మ-

– దాసరాజు రామారావు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, Permalink

One Response to పండుగొచ్చిన వేళ (కవిత ) -దాసరాజు రామారావు

 1. వెంకటేశ్వరరావు says:

  ఆశకు అంతుండాలి
  ఊహకు అదుపుండాలి
  కవితకు హద్దుండాలి
  వేళకు ముద్దఉండాలి

  నిజమైన పండగెప్పుడొచ్చిందండి
  కడుపునిండా తినడానికి
  పేదరాశి పెద్దమ్మను ఎక్కడ వెతకాలండి
  పెద్దపెద్ద ముద్దలు తినిపించుకోవడానికి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)