దళిత వాదం – నాస్తికత్వం – క్రైస్తవత్వం ( Part 1 )

మతం మార్క్సిస్తులకు , ప్రగతి వాదులకు, నాస్తికులకు – stupidity గా అనిపిస్తుంది. ‘ మరీ ఇంత ఘోరమైన నమ్మకాలా ? ‘ అనిపిస్తుంది. మనుష్య సమాజం ఏరి కోరి మూఢత్వాన్ని అరువు ఎందుకు తెచ్చుకుంది ? మానవ మనుగడను ప్రశ్నించగలిగే మతం ఇన్నాళ్ళు ఎలా మనగలిగింది మరి ? మరి మతం హేతు వాదులకు దుర్మార్గంగా కూదా అనిపిస్తుంది. నిజమే…మనుష్యులను ఒకరినొకరు అదే అంధ విశ్వాసం తో కోసెసుకుంటున్నప్పుడు – అందులో intrinsic గా దుర్మార్గత లేకుందా ఎలా ఉంటుంది ? మరి సామాజిక మూఢత్వం ( Social stupidity or collective stupidity ) యుగాలు గడిచినా ఒక phenomenon గా ఎలా బతికి బట్ట గడుతుంది ? – ముందుగా మతాన్ని నాస్తికత్వ ఆయుధం తో ఎదుర్కునే ముందు వేసుకోవాల్సిన ప్ర్సశ్నలు ఇవి.

l
సైన్స్ తో అన్నీ సాధించగలిగేదుంటే – సేటిలైట్ ప్రయోగానికి ముందు కొబ్బరి కాయ కొట్టరు, హాస్పిటల్ లో గుడులు ఉండవు. సైన్స్ కు కూడా పరిమితి ఉంది. దేవుడు లేడు అని సామాన్య పరిఙాన చట్రం లో సైన్స్ ప్రూవ్ చేయగలిగే శక్తి సైన్స్ కు ఉంది కాని, అది మాత్రమే మతం పూర్తి స్థాయి చాలెంజ్ చేయగలిగే సమాధానం కాదు. ఎవరన్నా మతం ఉంది అంటే దేవుడు ఉన్నాడు అని నమ్మడం వలన మాత్రమే అనుకుంటే పొరపాటు. బుద్దిజం బర్మా దేశం లో చేస్తున్న ఊచ కోత అంతా ఇంతా కాదు. మరి బుద్దిజం దేవున్ని నమ్మదు. అదే విధంగా జైనిజం ( అసలు సిసలు జైనిజం గురించి మాట్లాదుకుంటున్నాము ఇక్కడ ) కూడా. ఇలాంటి హేతుబద్దమైన మతాలు కూదా పందగలు జరుపుకుంటాయి. ప్రజలను ఊచకోత కొస్తాయి.

మతం ప్రతి సామాన్య జీవి జీవితం లో మమేకమై ఉంది. మతం ప్రతి సంఘ జీవి దైనందిన చర్యలలో ఒక రొటీన్ గా కలిసిపోయి ఉంది. ఇది పాలక వర్గాల consistent and concealed effort అని ఆరోపించే వాళ్ళు ఉన్నారు. నిజానికి ఇది ప్రజలు తమ ఇష్ట పూర్వకంగా నమ్ముకున్నది కూడాను . కావాలనుకున్నది కూడాను . అదే కాకుంటే – మతానికి వ్యతిరేకంగా exclusive గా ఒక ప్రపంచ యుద్ధమే జరిగి ఉండేది ఇవ్వాళ. అయితే ఇది మత్తు లో ఉంచుతుంది కాబట్టి convenient గా ప్రజలు నమ్మేసుకుంటున్నారు అని ఒక వాదన. ఒక సామూహిక గుంపుగా మనిషి ఒకటి adopt చేసుకున్నాక దాని sociological base ఏంటో గమనించకుండా ప్రజలనే సామూహిక అహేతుక గుంపుగా గుర్తించడం, ప్రజలే చరిత్ర నిర్మాతలు అనే historical dialect కు విరుద్ధం…ప్రజల శక్తిని చిన్న చూపు చూడ్డం అవుతుంది.

ఐతే మతం – దేవుడి వల్ల ( మాత్రమే ) కాక, పాలక వర్గాల కుట్ర వల్ల ( మాత్రమే ) కాక – ఎందుకు ప్రజలు adopt చేసుకున్నారు ?

మతం ఒక సాంఘిక అవసరంగా మొదలయ్యింది. అలానే మనుగడ సాగిస్తుంది. ఉరుములు మెరుపులు వస్తే అడవిలో ఉరుకులెత్తె ఆది మానవుడి అవగాహన కు, ఈ రోజు మనిషికి ప్రకృతి మీదున్న అవగాహనను పోల్చి చూస్తే స్థూలంగా – super natural power మీద అపనమ్మకం రాడికల్ గా తగ్గలేదనే చెప్పవచ్చు. మతం ప్రకృతి పై ఉన్న లోపభూయిష్టమైన అవగాహన నుండి మొదలై , సామాజిక బలహీనతలకు సత్వర మానసిక సమాధానంగా పరిణమించేంతగా మారింది. మతం మనిషికి మానసిక సాంత్వన దగ్గర మొదలై వివక్షలను పెంచి పోషించేంతగా తయారయ్యింది. ఇందులో మతం పుట్టుక నిజానికి రాజ్యం పుట్టుక కంటే ముందు నుండి super natural power ను కొలిచే రూపం లో ఉండి పోయింది. లోహ సాంకేతికత అభివృధ్ధి చెంది Agriculture surplus వచ్చాక రాజ్యం పుట్టుకు రావడం , మతం రాజ్యం లోని పాలక వర్గాలకు అనుకూలంగా వాడుకునే పని ముట్టుగా ఉండడం మొదలయ్యింది. అంతే గాని – మతం పుట్టినప్పుడు లేదా మతం పుట్టుక ఉద్దేశ్యం ( దేవుడు కూడా ) ప్రాథమికంగా విద్వేషం లేదా వినాశనం కలిగించే స్వభావం కలిగించేలా లేదు. అసలు మతమే ఎన్నుకోక పోయి ఉంటే రాజ్యం మన గలిగి ఉండేదా ? ప్రజలపై పీడన తగ్గి ఉండేదా ? అని ప్రశ్నిస్తే – మతం లేకపోయినా రాజ్యం మహా భేషుగ్గా మన గలిగి ఉండేది , ప్రజలపై పీడన మహా చక్కగా జరిపి ఉండేది. అంటే – రాజ్యం కు మతం handy గా వచ్చిన institution తప్ప , మతమే లేకుంటే మన గలిగి ఉండే పరిస్థితి లేనిది కాదు. ఎందుకంటే రాజ్యం మన గలిగేది – surplus value మీద . అది పరిరక్షించుకోడానికి మతం కాపోతే ఇంకో గితం అనే ప్రజలు నమ్మే institution ను వాడుకునేది.

Durkheim అనే ప్రఖ్యాత ఫ్రెంచ్ సోషియాలజిస్ట్ suicides మీద విస్తృతంగా పరిశోధన 1890 లలో జరిపాడు. అందులో తెలిసిన విషయం ఏమంటే – కేథలిక్కులలో , ప్రొటెస్టెంట్ లకన్నా ఆత్మ హత్యలు తక్కువ సంఖ్యలో ఉండడం. అది పరిశోధిస్తే – మతం మనిషికి ఒక గొప్ప నమ్మకం జీవితంపై కలిపిస్తుంది. ఎక్కడైతే చర్చ్ involvement తక్కువుందో అక్కడ సగటు మనిషి ప్రత్యామ్నాయం లేని సమయం లో వ్యక్తిత్వం కోల్పోవల్సి వస్తుంది. జీవించగలిగే శక్తిపై నమ్మకం సన్నగిల్లుతుంది. మన దేశం లో ఇంకా ఆత్మ హత్యలు చేసుకోకుండ అంతో ఇంతో రైతులు మిగిలే ఉన్నారు అంటే – అది దేవుడు తమను ఆదుకుంటాడనే నమ్మకం వలన – అంటే కాదన గలమా ?

సో, మొత్తంగా మతం ను ఒక ప్రాథమిక సామాజిక రోగంగా తిరస్కరించే ముందు మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే

(1) మతం ప్రజలు స్వయంగా సృష్టించుకున్నది. ఇందులో పాలక వర్గాల కుట్ర అంటూ ఏమీ లేదు. ఎందుకంటే మతం రాజ్యం పుట్టుక ముండు నుండే ఉంది కాబట్టి

(2) మతం అంటేనే విద్వేషానికి మారు పేరు కాదు. అది మతం యొక్క ప్రాథమిక ఉద్దేశ్యం కూడా కాదు. కాని పాలక వర్గాల మనుగడ కోసం incidental గా మత వ్యవస్థ handy గా వచ్చింది. విద్వేషాలు ఆ క్రమం లోనే మొదలయ్యాయి.

(3) మతం ప్రజల సామాజిక జీవన శైలిలో ముఖ్యమైన భాగంగా ముడివడి ఉందనేది మనకు ఇష్టం లేక పోయినా నమ్మ వలసిన వాస్తవం.

ఇక్కడ ప్రజలు అంటే – పాలక వర్గాలకు సంబంధించిన వ్యక్తులు అని కాదు .

ఇక ఇలా మతం ను నమ్మిన ప్రజలను మొత్తంగా ఒక అహేతుక జాతిగా గుర్తిస్తే – మనం ప్రజలను చరిత్ర నిర్మాతలుగా గుర్తించలేము. మనం చేసే ఏ పోరాటమైనా అసంబద్ధమైన పోరాటం అవుతుంది. అందుకే ప్రజల నమ్మకాలను అవహేళన చేయడం, ప్రజల విశ్వాసాలపై ప్రత్యక్ష దాడికి పూనుకోవడం – regressive approach అవుతుంది తప్ప అందులో pragmatic approach ఉండదు.

స్థూలంగా లెనిన్ దృక్పథం తో చూస్తే నాస్తిక వాదం – అనేది ఒక స్వతంత్ర వాదమే ( Independent ideology ) కాదు. ఆ వాదం – సమాజం లో ఎటువంటీ ప్రాథమిక మార్పును కూడా చూపదు. over a period of time నాస్తిక వాదం ( అది అలా లేబుల్ వేసిన ఎక్కడో కొన్ని హేతు వాదుల సెక్షన్ లను పరిగణనలోకి తీసుకుంటే ) ఛాందస వాదం గా పరిణమించింది. Aetheism is also a form of fundamentalism as it sticks to certain dogmatic values and tries to vilify society of its genuine historically evolved weakness. అందుకే నాస్తిక వాదం – ఎటువంటి నీతిని కాని ప్రతిపాదించలేదు. నాస్తిక వాదం దేవుడు లేడనే foul cry తప్ప అరుపులతో ఆర్గ్యుమెంట్ లతో దేవుడు లేడని ప్రూవ్ చేయలేదు. మతం అవసరం లేదు అనే భావనను కల్పించలేదు . నాస్తిక వాదానికి practicality లేదు కాబట్టి ఆచరణీయత లేదు.

ఆ నాస్తిక వాదం గొడవ అలా నాస్తిక వాదుల జీవితాలకే వదిలేస్తే – మతం ను ప్రగతి వాదులుగా మనమెవరమూ నమ్మ వలసిన అవసరం లేదు. మన పరిధిలో నమ్మవద్దు అని కూడా propagate చేయవచ్చు చేయాలి కూడా. ఎందుకంటే మతం అనేది – ఒక బలహీనత ను ప్రతిబింబిస్తుంది. వాస్తవ లోకం లో ప్రజల సమూహాన్ని చైతన్య వంతులు చేయడం అన్నిటికన్నా ప్రధానం కాబట్టి. అయితే అందుకోసం ఎవరన్నా – విశ్వాసాలపై దాడి చేస్తాము, అవహేళన చేస్తాము – అంటే మాత్రం గర్హణీయం. మతం మనుగడ అది సృష్టించిన విశ్వాసాలలో లేదు. మతం తో ప్రజల సంక్షేమానికి సంబంధించి immediate conflict of interest కూడా ఏమీ లేదు. మతం ఉన్నా కూడా సామాజిక అభివృధ్ధి సాధించవచ్చు. మతం విద్వేష రూపం దాల్చిన రాజ్యం యొక్క దరిద్ర స్వరూపాన్ని ఎండగట్తకుండ చేసే నాస్తిక వాదం – శూన్యం లో కత్తి సాము చేయడం లాంటిదే.

ఐతే – హిందూ మత వ్యవస్థలో ఉన్న దేవుళ్ళను మాత్రమే టార్గెట్ చేయొచ్చా ? ముస్లిం , క్రిస్టియన్ మత విశ్వాసాలపై దాడి చేయకుండా ఉండదం అదెటువంటి నీతి పరమైన విధానం ? ప్రపంచం మొత్తం మీద unique closed staritification ను suggest చేసిన ఏకైక మతం అదే ! ఎందుకంటే అది అసలు ఆవిర్భవించడం మతంగా ఆవిర్భవించలేదు కాబట్టి. ప్రజలను వివక్ష తో విడదీసి తర్వాత దానికి హిందూ మతం అని బలవంతంగా unity ని సృష్టించడం జరిగింది. అది కూడా మహమ్మదీయులు భూగోళానికి ఇటుపక్క ఉన్న ప్రజలను పిలుచుకున్న పద్దతి మాత్రమే. ప్రపంచ వ్యాప్తంగా మతం సృష్టించబడ్డాక వివక్ష మొదలైతే హిందూ మతం మనుష్యులను వివక్ష పేరుతో విడదీయడానికే ఏర్పడ్డది. ఇక్కడ తర తరాలుగా మన దేశం లో economic rationality నే కొరవడింది. దాని వలన తగినంత స్థాయిలో ఆర్థిక వ్యవస్థ ఎదగలేదు. పైగా polarisation మన economy కి basic feature అయి కూర్చుంది. ఈ దేశం ఎదుర్కుంటున్న అతి హేయమైన సమస్య – హిందూ మెజారిటీ వాదం. దీన్ని ఎదుర్కోవడం లో ఏ మాత్రం మెతక వైఖరి చూపించినా ఎటువంటి ఉద్యమానికి కాని నిష్కృతి లేదు.

ఐతే – మరి మైనారిటీ మతాలను బుజ్జ గించాలా ?

మైనారిటీ ప్రజలను కూడ గట్టాల్సింది వారి సామాజిక ఆర్థిక ప్రగతి ని బట్టి కాని కేవలం మైనారిటీ సంఖ్యలో ఉన్న మతస్తులని కాదు. వారి కుండే సంస్కృతిని వారి అస్తిత్వానికి దెబ్బ పడకుండా ఉండడం కోసం పరిరక్షించాలి గాని వారి దేవుడి పై ఉన్న నమ్మకం కోసం కాదు. ఈ దేశం లో హిందువులు మెజారిటీ…అదే పాకిస్తాను లో మైనారిటీ. కుల తత్వ పూరితమైన మతమైనా – శూద్రులైనా , బ్రాహ్మలైనా అక్కడ ముస్లిం మెజారిటీ వాదుల నుండీ కలుగుతున్న భయాందోళన జీవితాలు, అధికారం లో కలిగిన చిన్న చూపు మనమందరం సింపథైజ్ చేయాలి. అయితే అది కులాల వారీ మైనారిటీలుగానే చూడాలి. ఇక్కడ ఆలోచించాల్సింది ఏమంటే – మనం ఇక్కడ ఎంత దారుణంగా fight launch చేస్తున్నమో, అదే తరహాలో , ఒక వేళ మనం పాకిస్తాన్ లో పుట్టి ఉంటే , ముస్లిం మెజారిటీ వాదానికి వ్యతిరేకంగా fight చేయాల్సి వచ్చేది. అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పాదు – ఈ మైనారిటీ మతాలను కూడ గట్టడం అంటే అది వాళ్ల సామాజిక ఆర్థిక పురోగతి ప్రాతిపదిక మీదనే జరగాలి అని.

ఇక్కడ ఒక thin line ఉంది. మన దేశం లో 50 శాతం పైగా ఉర్శి క్ష పడ్డ వాళ్ళు ముస్లిములే. ఏ ఒక్క పార్టీలో కూడా ముస్లిములు ఎటువంటి నిర్ణయాత్మక స్థాయిలో లేరు. మార్క్సిస్టు పార్టీల్లో అయితే మరీ ఘోరం. ఇటువంటి ముస్లిములను – ప్రధాన స్రవంతిలో కలుపుకుంటూ , తగినంత నిబ్బరం అంద జేస్తూ ఎలా ముందు తీసుకెళ్ళాలి ? అంతర్జాతీయ పరిణామాల దృష్ట్యా , మత చాందసవాద శక్తుల ప్రబలడం దృష్ట్యా , వాళ్ళు తప్పు దారిన పోయే ప్రమాదం లో ఉన్నప్పుడు , ప్రగతి వాద శక్తులు వారిని ప్రధాన స్రవంతిలో తీసుకు రావడమే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రధాన ఉద్దేశ్యంగా ఉండి బ్రాహ్మణీయ మెజారిటీకి వ్యతిరేకంగా మొబిలైజ్ చేయాల్సిన అవసరం ఉంది.

వీళ్ల మత విశ్వాసాలను నాస్తిక వాదం తో దాడి చేస్తే , అవహేళన చేస్తే – మెజారిటీ వాదులకు మిగతా వాళ్లకు తేడా ఉండదు. క్రిస్టియన్ లు, ముస్లిములు – సాంస్కృతికంగా బ్రాహ్మణీయ మెజారిటీ వాదుల నుండి దాడి ని ఎదుర్కుంటారు. ఆపై నాస్తిక వాదుల నుండి కూడా. ఇక మెజారిటీ వాదులు నాస్తిక వాదుల పోరాటం తమకు అనుగుణంగా మల్చుకోవడం లో విజయవంతులు అవుతున్నారు. ద్వేష పూరిత వ్యాఖ్యలు చేసిన జాకిర్ నాయక్ మీద చర్యలు తీసుకోడానికి ప్రభుత్వం సమాయత్తం అవుతుంది గాని, తొగాడియా, సాధ్వి లాంటి వాళ్ల మీద కాదు. ప్రతి ప్రగతి వాది జాకిర్ నాయక్ ను ass hole అన్నారు . కరెక్టే ! అదే మాట ప్రభుత్వం కూడా అనింది. ఇక్కడ తటస్థత పేరుతో ప్రగతి వాదులు విస్మరించిందేమిటి ? half battles చేయరాదు అని. మైనారిటీలను విమర్శించాల్సిన పరిస్థితుల్లో , మెజారిటీ వాదాన్ని ఎండగట్తకుండా ఏం సాధించాలని విమర్శలు చేయాలి ? ఇక్కడ గమనించాల్సింది – మైనారిటీ మతాన్ని అప్పీజ్ చేయమని కాదు. మెజారిటీ వాదం పై చేసే యుద్ధం ఒక గొప్ప దృక్పథం కలిగినది. ఈ బ్రాహ్మినిస్ట్ మెజారిటీ ప్రపంచం లో , నాస్తిక వాదానికి తఠస్థత ఏమీ లేదు. మొత్తంగా నాస్తిక వాదం కూడా అటు తిరిగి ఇటు తిరిగి మైనారిటీ మత విశ్వాసాలపైనే దాడి చేస్తుంది. నాస్తిక వాదుల్లో ఎక్కువ భాగం అగ్ర బ్రాహ్మణీయ అగ్ర కుల వ్యవస్థ నుండి వచ్చిన వారే అని మనం గమనించాలి. వీరికి హైందవేతర మతాల insecurity సాంఘిక ఆర్థిక వెనుకబాటు తనం వారికి వాళ్ళ మతం లో దొరుకుతున్న ఉపశమనం ఏంటో అర్థం అయ్యే అవకాశాలు చాల తక్కువ. ఆందునా ఈ నాస్తిక వాదులు పిడివాదులుగానే ఉంటారు కాబట్టి – గుర్రానికి గంతలు కట్టినట్టుగా ‘ దేవుడు ‘ అని ఎక్కడన్నా వినిపిస్తే చాలు , ప్రస్తుత రాజకీయ పరిస్థితులను విస్మరించి ఒకటే దాడికి గురి చేస్తారు.

పీడిత ప్రజల విశ్వాసాలను మెజారిటీ వాదానికి వ్యతిరేకంగా మొబిలైజ్ చేసే క్రమం లో గౌరవించాలి. అస్సలామా లేకుం అని ముస్లిం సోదరున్ని పలకరిస్తే మనకు మతం మైల అంటదు. మనిషి మనసు దగ్గరౌతుంది. ఆ దగ్గరైన మనస్సుకే మనం చైతన్యం నింపగలం. శతృ పూరిత వాతా వరణం కల్పించి , మైనారిటీ లను బ్రాహ్మణీయ మెజారిటీకి వ్యతిరేకంగా చైతన్యం చేస్తామని ఎవరన్నా అంటే – వాళ్ళు ఈ భువి ఇంకా స్వర్గమనే భావనలో ఉన్నరనే చెప్పొచ్చు.

అలాగని – కాంగ్రెస్, ఆప్ లా వెళ్ళి వేషాలేసుకుని మనకు లేని మత నమ్మకాన్ని ప్రదర్శించాలని చూస్తే – అది విరుగుడు అవుతుంది. ఎందుకంటె ప్రజలు మతాని నమ్మినా మత వ్యతిరేకులను కూడా గౌరవిస్తారు గాని hypocrites ను కాదు. ప్రగతి వాదులు తమకున్న భావజాల వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూ , మైనారిటీ సంస్కృతిని గౌరవిస్తూ, బ్రాహ్మణీయ మెజారితీకి వ్యతిరేకంగా చైతన్య వంతం చేస్తూ ముందుకు కదలాలి.

ఐతే మరి మతం మీద యుద్ధం ఎప్పుడు ?

ఇంకా మనం ఆ స్థాయి సమాజానికి చేరుకోలేదు. మతం ను ప్రధాన శతృవుగా ప్రకటించే రోజులు రాలేదు. మైనారిటీలను కూడ గట్టడం మతానికి వ్యతిరేకంగా జరిగే యుద్ధం లో మొదటి స్టెప్. వారికి జరిగే అన్యాయం – మెజారిటీ మత సంస్కృతి వలనే. మొదట మెజారిటీల మత సంస్కృతిపై పడే దెబ్బ eventual గా మత వ్యవస్థనే కూల దోసి , ప్రజలకు మతం వలన కలిగే అనర్థాలను సరి అయిన విధానం లో , సరి అయిన దృక్పథం లో వివరిస్తుంది. ఆ మార్గం లోనే మతం యొక్క వివక్ష లక్షణాన్ని, ద్వేష భావాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారు.

Summary

(1) మతం ప్రతి సామాన్య జీవి జీవితం లో మమేకమై ఉంది.ఒక సామూహిక గుంపుగా మనిషి ఒకటి adopt చేసుకున్నాక దాని sociological base ఏంటో గమనించకుండా ప్రజలనే సామూహిక అహేతుక గుంపుగా గుర్తించడం, ప్రజలే చరిత్ర నిర్మాతలు అనే historical dialect కు విరుద్ధం…ప్రజల శక్తిని చిన్న చూపు చూడ్డం అవుతుంది.

(2) మతం ఒక సాంఘిక అవసరంగా మొదలయ్యింది. అలానే మనుగడ సాగిస్తుంది. ఇందులో మతం పుట్టుక నిజానికి రాజ్యం పుట్టుక కంటే ముందు నుండి super natural power ను కొలిచే రూపం లో ఉండి పోయింది. లోహ సాంకేతికత అభివృధ్ధి చెంది Agriculture surplus వచ్చాక రాజ్యం పుట్టుకు రావడం , మతం రాజ్యం లోని పాలక వర్గాలకు అనుకూలంగా వాడుకునే పని ముట్టుగా ఉండడం మొదలయ్యింది. అంతే గాని – మతం పుట్టినప్పుడు లేదా మతం పుట్టుక ఉద్దేశ్యం ( దేవుడు కూడా ) ప్రాథమికంగా విద్వేషం లేదా వినాశనం కలిగించే స్వభావం కలిగించేలా లేదు. రాజ్యం కు మతం handy గా వచ్చిన institution తప్ప , మతమే లేకుంటే మన గలిగి ఉండే పరిస్థితి లేనిది కాదు. ఎందుకంటే రాజ్యం మన గలిగేది – surplus value మీద . అది పరిరక్షించుకోడానికి మతం కాపోతే ఇంకో గితం అనే ప్రజలు నమ్మే institution ను వాడుకునేది.

(3) మతం అంటేనే విద్వేషానికి మారు పేరు కాదు. అది మతం యొక్క ప్రాథమిక ఉద్దేశ్యం కూడా కాదు. కాని పాలక వర్గాల మనుగడ కోసం incidental గా మత వ్యవస్థ handy గా వచ్చింది. విద్వేషాలు ఆ క్రమం లోనే మొదలయ్యాయి.

(4) మతం ప్రజల సామాజిక జీవన శైలిలో ముఖ్యమైన భాగంగా ముడివడి ఉందనేది మనకు ఇష్టం లేక పోయినా నమ్మ వలసిన వాస్తవం.

(5) స్థూలంగా లెనిన్ దృక్పథం తో చూస్తే నాస్తిక వాదం – అనేది ఒక స్వతంత్ర వాదమే ( Independent ideology ) కాదు. ఆ వాదం – సమాజం లో ఎటువంటీ ప్రాథమిక మార్పును కూడా చూపదు. నాస్తిక వాదానికి practicality లేదు కాబట్టి ఆచరణీయత లేదు.

(6) పీడిత ప్రజల విశ్వాసాలను మెజారిటీ వాదానికి వ్యతిరేకంగా మొబిలైజ్ చేసే క్రమం లో గౌరవించాలి. శతృ పూరిత వాతా వరణం కల్పించి , మనారిటీలను బ్రాహ్మణీయ మెజారిటీకి వ్యతిరేకంగా చైతన్యం చేస్తామని ఎవరన్నా అంటే – వాళ్ళు ఈ భువి ఇంకా స్వర్గమనే భావనలో ఉన్నరనే చెప్పొచ్చు.

(7) . మతం ను ప్రధాన శతృవుగా ప్రకటించే రోజులు రాలేదు. మైనారిటీలను కూడ గట్టడం మతానికి వ్యతిరేకంగా జరిగే యుద్ధం లో మొదటి స్టెప్.

అయితే క్రైస్తవత్వాన్ని ఎలా చూడాలి ? అంబేద్కర్ క్రైస్త్వత్వం గురించి ఏమని చెప్పాడు ? క్రైస్తవత్వం సమర్థించడం అంటే దేవుడిని సమర్థించినట్టు కాదా ?

– పి.విక్టర్ విజయకుమార్

( రచయితనుfacebook ID “ P V Vijay Kumar” పై గాని, ఈ మెయిల్ ఐడీ pvvkumar€yahoo.co.uk పై గాని సంప్రదించవచ్చు)

వ్యాసాలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)