నత్త ( కవిత )-డా. ఇక్బాల్ చంద్

తల కొంచెం సేపు బయటికీ
మరి వెంటనే లోలోనికీ
హైడ్ అండ్ సీక్ సిక్ నెస్ –

బహుశా
లోనా ఉండలేను
బయటా
ఉండనివ్వరు –

తప్పించుకొని
తప్పించుకొని
మళ్ళీ
తప్పించుకొనే
తిరుగుతున్నాను
మీ నీంచి నేనూ
నా నీంచి నేనూ –
అప్రతిష్ట కవచకుండలాల్తో
పుట్టిన వాడి కంటేనూ
కాళ్ళకు చక్రాల్తో పుట్టిన
వొంటరి మనో సంచారి
మహా శాపగ్రస్తుడు –

ఊరించి ఉడికించి
తీరా రెక్కలిప్పే తొలి ఉదయానికే
నలభై ఐదు   కుక్క కాటుకు వేసే కసి సూదుల్ని
కనిపించకుండా పొడిచిపోయింది
ఇది పీడకలే కాదు తలనరికిన తిమిర ఖడ్గం –
నీయబ్బ !
హత్యించిన వేయేళ్ళ ఆయుశ్శు ఎవడికి కావాలి ?
మింగిన నిద్ర మాత్రల సాక్షిగా
I’m so much doing my self !
ఇకనా ఇంకానా ఇంకెంతకూ
పరిహాసపడలేను

– డా. ఇక్బాల్ చంద్

కవితలుPermalink

Comments are closed.