ఆమె వెళ్ళి పోతుంది (కవిత )-దేవనపల్లి వీణావాణి

1

ఆమె
చూపు విసిరిన చోటల్లా
దిరిసెన పూల వాన

అడుగుపడితే
పర్వతాలు పచ్చల హారాలు

నవ్వినప్పుడల్లా
జాలువారిన చినుకుల తడికి
పురుడుపోసుకున్న
జీవామృతం

నిలబడ్డచోట
కుదురుకున్న బొడ్రాళ్లు

నడిడిచిన చోటల్లా
జెండాలెత్తుకున్న నాగరికతలు…

2

ఆమె
వెళ్ళిపోతోంది…

ఒక్క మొలక కూడా
తలెత్తకుండా
కప్పుతూఉన్న గచ్చుదుప్పట్ల నుంచి
సహచర మృణ్మయదేహాన్ని
తడపలేక విషణ్ణమయి
ఆమె వెళ్ళిపోతోంది…

నిర్లక్ష్యంగా
నల్లబరిచిన తన నీలం రంగు
చీరను
జల్లెడలా చిల్లులు చేసి
ఎగ బీల్చుకున్న జల ధారల్ని
ఇగిర్చి
ప్రాణ దారాల్ని తెంచుకుంటోంది…

తాను రూపుదిద్దిన
మేధ ఒకటి
జీవజాలాన్ని ఉరితీసి
అనంత విశ్వంలో లుప్తమౌతుందని తలచి
ఎర్రబడ్డ కళ్ళనుంచి
చివరి కన్నీటి బొట్టయి
రాలి పోతోంది…

ఆమె వెళ్ళిపోతోంది…

దేవనపల్లి వీణావాణి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

4 Responses to ఆమె వెళ్ళి పోతుంది (కవిత )-దేవనపల్లి వీణావాణి

  1. వెంకటేశ్వరరావు says:

    ఆమె వెళ్ళలేదు- వెళ్ళదు
    ఆమె ఎక్కడికి వెళ్ళలేదు

    విసిరిన చూపును
    అడుగిడిన చోటును వదలి
    ఆమె ఎక్కడికి వెళ్ళలేదు

    నవ్వుతూ జాలువార్చిన
    చినుకుల జీవామృతాన్ని
    మన అందరికి అందేవరకు
    ఆమె ఎక్కడికి వెళ్ళలేదు

    జీవజాలాన్నీ తలెత్తుకునేలా చేయకుండా
    తన్మయత్వంతోఓలలాడేలా చేయకుండా
    ఆమె ఎక్కడికి వెళ్ళలేదు

    గంగ యములో
    గోదావరి బ్రహ్మపుత్రలో
    కావేరి తుంగభద్రలో కలసి
    మనుషుల మనసుల
    కలుషాలను కడగకుండా
    ఆమె ఎక్కడికి వెళ్ళలేదు

    మేధావంతుడైన మానవుడు
    తన శక్తినొడ్డి
    ఆమెనుండి వచ్చే
    ఒకబొట్టునుకూడా
    వృధాకానీయకుండా చూడగలడు
    ఆమెకూడా తనుతడిపిన నేలనువదలి
    మరెక్కడికి వెళ్ళలేదు

    • దేవనపల్లి వీణా వాణి says:

      మీరన్నట్టు జరగాలని కోరుకుంటున్నాను… మీ సుదీర్ఘమైన బదులుకు ధన్యవాదాలు సర్..
      నమస్సులు

  2. Vijay says:

    చాలా బాగుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)