ది చిల్డ్రన్స్ అవర్ (కవిత )-దేవనపల్లి వీణావాణి

పగటి వెళుతురికీ , చీకటికీ మధ్య
రాత్రి కిందకు దిగుతున్న వేళ
రోజువారీ పనులకు తెరిపినిచ్చిన
ఘడియ…పిల్లలది..

నేను,పైనున్న గదినుంచి
చిన్ని పాదాల సవ్వడిని,
మృదు మధుర స్వరాలనీ ,
తెరుచుకున్న తలుపు శబ్దాన్ని
వింటూంటాను..

నేనా ఆలోచనలో ఉండగానే
విశాలమైన మెట్లమీద నుంచి
దీప కాంతిలో బంగారు జుట్టుతో ఎడిత్ ,
నవ్వుతున్న అల్లెగ్ర ,
గ్రేవ్ అలెస్ కిందకు దిగుతుంటారు

ఓ గుస గుస, మళ్లా ఓ నిశ్శబ్దం:
మెరుస్తున్న వాళ్ళ కళ్ళను చూస్తుంటేనే తెలుస్తోంది..
నన్ను ఆశ్చర్య పరచాలని
యుక్తంగా ప్రణాళికలు వేస్తున్నారని..

వాళ్లలా మూడు తలుపుల్ని వదిలి
మెట్ల మీద నుంచి దౌడు తీసి
హటాత్తుగా హాలులో చొరబడి
నా మందిరంలోకి ప్రవేశిస్తారు..!

నా కుర్చీకి చేరబడి
నా భుజాలదాకా ఎక్కేస్తారు..
నేను తప్పించుకుందామనుకుంటే
వాళ్ళంతటా వ్యాపించి ఉన్నట్టు
నన్ను చుట్టేస్తారు..

వాళ్ళ భుజాలతో నన్ను అల్లుకొని
ముద్దులతోముంచేసినప్పుడు
Mouse – Tower on the Rhine కథలో
Bishop of Bingen లా తోస్తుంది నాకు..!

ఓ నీలి కళ్ల దొంగా..
నువ్వు గోడ మీద కొలుచుకుంటున్నావు కదా..
నీకెప్పుడయినా అనిపించిందా
ఈ ముసలి గడ్డం వాడు నీతో
సరితూకం కాదని..!!

యే వియోగమూ చేధించలేనంతగా
నా మనోదుర్గంలో మీ కోసం తపిస్తాను..
నా హృదయమనే గుండ్రనిమేడని
మీ బంధిఖానా చేశాను..

అవును , ఎప్పటికీ
మిమ్మల్ని అక్కడే దాచుకుంటాను…
ఎప్పటివరకయితే
నా హృదయ ప్రాకారాలు
విరిగి నశించుతాయో, ధూళియయి
గాలిలో కలిసిపోతాయో
ఆ రోజు వరకు…!!

(హెన్రీ వర్డ్స్ వర్త్ లాంగ్ ఫెలో రాసిన ప్రసిద్ది గాంచిన ” The Children’s Hour ” కవితకి స్వేచ్చానువాదం )

-దేవనపల్లి వీణావాణి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)