చిరుతప్రాయం రెసిడెన్సియల్ చదువుల్లో
మధ్యప్రాయం ధనార్జనల తొక్కిసలాటల్లో
ముసలిప్రాయం వృద్ధాశ్రమాల గదుల్లో
ఆయుర్దాయం అంతా వ్యయమైపోతోంది ఆదుర్దాల్లో
యాంత్రికమైపోతూన్న మానవజీవిత చక్రం పై
మనోనియంత్రణ పట్టుసడలుతోంది
ఆత్మీయతానురాగస్పృహల్ని కోల్పోతూ
యాంత్రికతత్వంతోమమేకమౌతూన్నమనస్
ఉనికిని కోల్పోతోంది
ఉనికిని కోల్పోతున్నమనస్సు తో
మనిషిలో మానవత్వం నశిస్తోంది
జంతువుల్లో కన్పిస్తోన్న
ప్రేమలుమమకారాల అల్లికలజాడలు
మానవుల్లో గల్లంతౌతున్నాయ్
జ్ఞాపకాలసమాధుల శ్మశానంగా
మారటం ఇష్టంలేని మనస్సు తో
అవసరంలేని మనిషి …పశువుకన్నా నీచంగా
క్రొత్తజీవితాన్నేదో నిర్లజ్జగా ఎంచుకుంటున్నాడు
తనస్థాయినిలోకంలో దిగజార్చుకుంటున్నాడు
శ్రీమతి జి సందిత (Sanditha)
బెంగుళూరు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~