వొరుప్పోటు(పుస్తక సమీక్ష)-అఖిలాశ

ప్రజల మనసులలో చిరస్థాయిగా నిలిచే కవిత్వం

కవి వాస్తవ అనుభవాలను, చూసిన సన్నివేశాలను కవిత్వీకరిస్తేనే ఇలాంటి కవిత్వం రాయగలడని శ్రీ యాములపల్లి నరసిరెడ్డి గారు రాసిన వొరుప్పోటు దీర్ఘ కవిత చదవుతున్నంత సేపు మనకు అర్థం అవుతుంది. కవి అనుభవాలను కవిత్వకరించడంలో నూటికి నూరుపాళ్ళు విజయం సాధించారనే చెప్పాలి. ఈనాడు మెటాఫర్ కవిత్వం రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో సాధారణమైన ప్రజలకు కవిత్వం దూరం అవుతున్నదనే చెప్పుకోవాల్సిన దుస్థితిలోనే ఉన్నాము.

అసలు కవి కవిత్వం ఎందుకు రాస్తాడు? తన భావాలు ప్రజలతో పంచుకొని కాస్తైన సమాజాన్ని మార్చడానికి లేదా తను గమనించిన విషయాలను అందరి దృష్టికి తీసుకువెళ్ళడానికి. నేడు చాలా మంది కవులు ఏదేదో అసహజ ప్రమాణాలతో కవిత్వం రాస్తున్నారు ఆ భాషా ఎప్పటికి సాధారణమైన ప్రజలకు చేరదు. గొప్ప కవి అంటే ఎవరికీ అర్థం కాకుండా ఏదేదో ఉదాహరణలతో కవిత్వం రాయడం కాదు. మన చుట్టూ పక్కల ఉండే మామూలు విషయాలనే తీసుకొని సరళ భాషలో రాయడం ద్వారా ఆ కవి ఎప్పటికి ప్రజా కవిగా నిలిచిపోతారు.

ఆ కోవలో మన నరసిరెడ్డి గారు ఉంటారు. ఈ దీర్ఘకవిత రాయలసీమలో ఎక్కువగా పండించే చెనిక్కాయ పంట గురించి రాశారు. దీర్ఘకవితను రెండు భాగాలుగా చూడవచ్చు. మొదటి భాగం చెనిక్కాయ పంట ఆరోజుల్లో ఎలా ఉండేది . చెనిక్కాయల విశిష్టత వివరిస్తూ రాశారు . రైతు పంటను ఎలా పండిస్తాడు ? దానిని ఎంత అపురూపంగా చూసుకుంటాడు. దానితో ఎలా సొమ్ము చేసుకుంటాడు అని ఉంటుంది. రెండో భాగం నేడు ఆ చెనిక్కాయ పంట పండించే రైతు దుస్థితి ఎలా ? ఉందని చెప్తూ తన భాదను తీవ్ర ఆగ్రహంగా మన ముందు ఉంచారు.

ఈ దీర్గకవితలోని పద బంధాలు, ప్రతీకలు సాధారణమైన ప్రజలకు కూడా అర్థం అయ్యి వారి మనసులలో నిలిచిపోతుంది. ఈ పంటపై నాకు తెలిసి ఇదే మొదటి దీర్గ కవిత అనుకుంటాను. రాయలసీమ యాస కూడా మనకు ఈ కవిత్వంలో కనపడుతుంది. మొత్తం మీద రాయలసీమలో ఎక్కువగా కథా రచయితలు ఉన్నారు. కాని ఇలాంటి యువ కవులు కూడా తమ కవిత్వంలో సత్త చాటుతున్నారనే చెప్పాలి. రాయలసీమలో పద్య కవులు,కథా రచయితలే కాడు అమోఘమైన కవిత్వం రాసే యువకవులలో ముందు వరుసలో ఉన్నారనే చెప్పాలి.

ఈ కవి మరిన్ని మంచి కవిత్వ పుస్తకాలు తెలుగు సాహిత్యానికి అందించాలని మనస్పూర్తిగా కోరుతూ మంచి కవిత్వాన్ని అందించిన కవి నరసిరెడ్డి గారికి అభినందనలు తెలుపుతూ…!!

అఖిలాశ,

బెంగుళూరు,7259511956

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

పుస్తక పరిచయం, Permalink

Comments are closed.