కొత్త నిర్ణయం – యలమర్తి అనురాధ

సగం సగం అని చెప్పుకోవటమేనా
33% రిజర్వేషన్తో సరిపెట్టుకోవటమేనా
కొత్త సంవత్సరంలో  
అన్నీ సమానమైతేనేనని పట్టుబడదాం
పనిలో,బడిలో,గుడిలో
ఉద్యోగాలలో ,వ్యాపారాలలో
ఎక్కడైనా ఎప్పుడైనా ఎంతైనా
పైసా తక్కువంటే ఒప్పుకునేది లేదు
అమ్మాయిలని ఇక కోతంటే చెల్లదు
మహిళలందరిదీ ఒకే నినాదమైతే
రాజకీయాల్లోనూ సగభాగం ఇవ్వక తప్పదు
ఉగాదికే శ్రీకారం
శంఖారావం పూరిద్దాం ఇప్పుడే !

– యలమర్తి అనురాధ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

2 Responses to కొత్త నిర్ణయం – యలమర్తి అనురాధ

 1. అజిత్ కుమార్ says:

  శంఖం పూరిద్దాం అనవచ్చు. లేదా శంఖారావం చేద్దాం అనవచ్చు.

 2. వెంకటేశ్వరరావు says:

  1996 మహిళా రిజర్వేషన్ బిల్లు మహిళలకు భారత రాజకీయాల్లో 33 శాతం సీట్లను రిజర్వ్ చేయాలని ప్రతిపాదించింది
  2009 లో 10.9% 2014 నాటికి 11% మహిళలు భారత రాజకీయాల్లోకి చేరుకున్నారు. చాలామంది పురుషులు
  మహిళల రిజర్వేషన్ కోసం పిలుపునిచ్చారు. అయితే, వాస్తవానికి భారతదేశంలో మహిళల పరిస్థితి నిజంగా
  మెరుగుపడాల్సిఉంది. అలా అని 33% కి ఎప్పటికి చేరుకుంటుందో తెలియని పరిస్థితులలో 50% అడగడంలో లేదా
  దానికోసం శంఖారావం పూరించి పోరాడమంలో అర్థంలేదేమో అనిపిస్తుంది.