వీల్ చెయిర్లో విశ్వశాస్త్రం – పి. విక్టర్ విజయ్ కుమార్

స్టీఫెన్ హాకింగ్ స్మృతిలో ….

ఈ విశ్వం ఎలా మొదలయ్యింది? దీనిని ఎవరు సృష్టించారు ?? విశ్వం సృష్టించక ముందు ఏముంది? దేవుడే విశ్వాన్ని తయారు చేశాడా? మరి ఐతే దేవుడిని ఎవరు సృష్టించారు? అలా కాకుంటే విశ్వానికి ఆరంభం , అంతం ఏమిటి? విశ్వం ఎంత వరకు వ్యాపించి ఉంది? దేవుడు ఈ విశ్వ గతి చలనాన్ని ఎలా నియంత్రిస్తున్నాడు? కాలమన్నది ఎలా మొదలయింది? కాలమెందుకు ముందుకే వెళ్ళాలి, వెనక్కెందుకు వెళ్ళకూడదు? ఈ విశ్వాన్ని నిర్దేశించే గతి చలన సూత్రాలు ఉన్నాయా లేక ఈ విశ్వం అర్బిట్రరీ గా వృద్ధి చెందిందా?

మనిషికి అంతు చిక్కని విశ్వాన్ని గురించి బుర్ర తొలిచే దేవుడి అస్థిత్వాన్ని తాకుతూ సంక్లిష్ట విషయాలను కూడా సాధారణ భాషలో వివరిస్తూ రాసాడు స్టీఫెన్ హాకింగ్. ఆయనలో కొన్ని అద్భుతాలున్నాయి.. కొన్ని గమ్మత్తులు ఉన్నాయి. కొన్ని ఆశ్చర్యాలున్నాయి. అన్నిటికీ మించి అన్నిటినీ తలదన్నే ఆత్మ స్థైర్యం ఉంది. ఆత్మ విశ్వాసం ఉంది. వాస్తవాన్ని సునిశితంగా వివరించే మేధావి తనం ఉంది. సామాన్య మానవుడి సముచితమైన సందేహాల పట్ల Concern ఉంది.

ఆయనకు Motor Neuron Disease అంటే సుమారు శరీరం లోని ఏ అవయవమూ పని చేయని స్థితి. ఆయన ఒక వీల్ చెయిర్ లోనే జీవితాన్ని గడుపుతున్న పరిస్థితి. మాట సరిగ్గా రాదు. వినికిడి సరిగ్గా ఉండదు. చేతులు, కాళ్ళు అవి కదలాల్సిన రీతిలో కదలవు. ‘ ఎడాప్టివ్ కమ్యూనికేషన్’ అనే ఒక సంస్థ ఆయన కోసం ఒక వీల్ చెయిర్ కంప్యూటర్ ద్వారా స్పీచ్ సింథసైజర్ ను ఏర్పాటు చేయ గలిగింది. తన గొంతులోని నరాల కదలిక వల్ల వచ్చే ధ్వనులు మాటల రూపం లో అది వినిపించ గలుగుతుంది. ఎన్నో కోట్లల్లో ఒకరికి వచ్చే ఈ జబ్బు ఇలాంటి ఒక అద్భుత శాస్త్ర వేత్తకు రావడం దురదౄష్టము. అలాగే అలాంటి జబ్బును కాదని అంత పరిశోధన ఆయన చేయ గలగడం ఒక అద్భుతం.

ఈ విశ్వం ఎలా ఏర్పడింది అనే విషయాన్ని ‘ బిగ్ బ్యాంగ్ ‘ అనే థియరీ ద్వారా వివరించాలని చూస్తాడు స్టీఫెన్ హాకింగ్. ప్రతి పదార్థం పుట్టుకు రావాలంటే అంతకు ముందు ఒక పదార్థం ఉండాల్సిందేనా? Can something evolve out of nothing ? అందుకు ఆయన అడిగేది ఏమంటే What is meant by nothing ? అని. మరి విశ్వం మొదలైనప్పుడు శూన్యం లేదా? మరి శూన్యమే లేనప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ? నిజానికి శూన్యం విశ్వంలో ఎప్పుడూ లేదు. ఇంకో రకంగా చూస్తే కూడా Something cannot evolve out of nothing . Nothing అన్నది నిజానికి రెండు విరుద్ధ శక్తుల resultant force ఫలితం గా ఉన్న శూన్యం. టెబుల్ మీద ఫోన్ కదలకుండా ఉందంటే దానర్థం అది నిజంగా కదలట్లేదు అని కాదు. అది కింద పడే ప్రయత్నం టేబుల్ వారిస్తుంది కనుక. అలాగే విశ్వం లో ఉన్న పదార్థం పొసితివె అంద్ నెగతివె ఫొర్చెస్ నులిఫ్య్ కావడం వల్ల మొదటగా అది శూన్యంగా అనిపించ వచ్చు. మొదట్లో విశ్వం శూన్యంగా అనిపించినా – విశ్వానికి మొదట్లో అసలు ఏమీ లేదు అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ఏమీ లేదు అన్న దానికి అర్థం లేదు. ఏమీ లేదు అని అనిపించాల్సిందే తప్ప ఏమీ లేదు అన్న విషయం వాస్తవంగా ఉండదు.

అయితే ఈ ప్రపంచం లో దేవుడిని నమ్మిన ప్రజలే ఎక్కువ. విశ్వం పైన చర్చ అందుకే మతం తో చాలా దగ్గరగా ఆనుకుని ఉంది. కొద్దిగా deviate అయ్యి మతం గురించి చూద్దాం. స్టీఫెన్ హాకింగ్ మార్కు నాసికత్వాన్ని తర్వాత తర్వాత అర్థం చేసుకుందాం.

మతం ప్రతి సామాన్య జీవి జీవితం లో మమేకమై ఉంది. మతం ప్రతి సంఘ జీవి దైనందిన చర్యలలో ఒక రొటీన్ గా కలిసిపోయి ఉంది. ఇది పాలక వర్గాల consistent and concealed effort అని ఆరోపించే వాళ్ళు ఉన్నారు. నిజానికి ఇది ప్రజలు తమ ఇష్ట పూర్వకంగా నమ్ముకున్నది కూడాను . కావాలనుకున్నది కూడాను . అదే కాకుంటే – మతానికి వ్యతిరేకంగా exclusive గా ఒక ప్రపంచ యుద్ధమే జరిగి ఉండేది ఇవ్వాళ. అయితే ఇది మత్తు లో ఉంచుతుంది కాబట్టి convenient గా ప్రజలు నమ్మేసుకుంటున్నారు అని ఒక వాదన. ఒక సామూహిక గుంపుగా మనిషి ఒకటి adopt చేసుకున్నాక దాని sociological base ఏంటో గమనించకుండా ప్రజలనే సామూహిక అహేతుక గుంపుగా గుర్తించడం irrational.

మతం ఒక సాంఘిక అవసరంగా మొదలయ్యింది. అలానే మనుగడ సాగిస్తుంది. ఉరుములు మెరుపులు వస్తే అడవిలో ఉరుకులెత్తె ఆది మానవుడి అవగాహన కు, ఈ రోజు మనిషికి ప్రకృతి మీదున్న అవగాహనను పోల్చి చూస్తే స్థూలంగా – super natural power మీద అపనమ్మకం రాడికల్ గా తగ్గలేదనే చెప్పవచ్చు. మతం ప్రకృతి పై ఉన్న లోప భూయిష్టమైన అవగాహన నుండి మొదలై , సామాజిక బలహీనతలకు సత్వర మానసిక సమాధానం గా పరిణమించేంతగా మారింది. మతం మనిషికి మానసిక సాంత్వన దగ్గర మొదలై వివక్షలను పెంచి పోషించేంతగా తయారయ్యింది. ఇందులో మతం పుట్టుక నిజానికి రాజ్యం పుట్టుక కంటే ముందు నుండి super natural power ను కొలిచే రూపం లో ఉండి పోయింది. లోహ సాంకేతికత అభివృధ్ధి చెంది Agriculture surplus వచ్చాక రాజ్యం పుట్టుకు రావడం , మతం రాజ్యం లోని పాలక వర్గాలకు అనుకూలంగా వాడుకునే పని ముట్టుగా ఉండడం మొదలయ్యింది. అంతే గాని – మతం పుట్టినప్పుడు లేదా మతం పుట్టుక ఉద్దేశ్యం ( దేవుడు కూడా ) ప్రాథమికంగా విద్వేషం లేదా వినాశనం కలిగించే స్వభావం కలిగించేలా లేదు. అసలు మతమే ఎన్నుకోక పోయి ఉంటే రాజ్యం మన గలిగి ఉండేదా ? ప్రజలపై పీడన తగ్గి ఉండేదా ? అని ప్రశ్నిస్తే – మతం లేకపోయినా రాజ్యం మహా భేషుగ్గా మన గలిగి ఉండేది , ప్రజలపై పీడన మహా చక్కగా జరిపి ఉండేది. అంటే – రాజ్యం కు మతం handy గా వచ్చిన institution తప్ప , మతమే లేకుంటే మన గలిగి ఉండే పరిస్థితి లేనిది కాదు. ఎందుకంటే రాజ్యం మన గలిగేది – surplus value మీద అది ప్రైవేటు శక్తులు సృష్టించిన వారి ఆకాంక్షల మీద . అది పరిరక్షించుకోడానికి మతం కాపోతే ఇంకో గితం అనే ప్రజలు నమ్మే institution ను వాడుకునేది.

అందుకే స్టీఫెన్ హాకింగ్ దేవుడి గురించి ఒక మాట అంటాడు ” దేవుడు ఈ సృష్టిని కొన్ని నియమాలతో ఏర్పరిచాడు. అవి ఎలాంటి నియమాలంటే , వాటిని ఆయన కూడా మార్చలేడు ” అని. ఈ నియమాలను అధ్యయనం చేయడమే కదా మన పని ? అవి దేవుడు చేసాడా లేదా అనే చర్చ దేనికి అవసరమిక ? నాస్తికత్వానికి ఒక చక్కటి రూపు రేఖలు తొడిగాడు స్టీఫెన్ హాకింగ్. విశ్వాసాలపై దాడి కాకుండా, విశ్వాసాలను గౌరవిస్తూనే , ఒక ఆత్మ నిబ్బరం తో బతికే భరోసా కల్పించే దిశలో మనమడుగులు వేయడం అవసరం.

ఇది తెలీని ఛాందస వాద నాస్తికులు నాస్తికత్వాన్ని ఒక మతంగా మార్చారు. నాస్తిక వాదాన్ని సువార్తగా ప్రకటించుకున్నారు. ” మీరు ఇంత వరకు దేవుడు లేదు అని ప్రూవ్ చేయగలిగారా ? ” అని ఒక సారి ఒక ప్రముఖ కమ్మ నాస్తికవాది ఫాలోయర్ ను అడిగాను. ” అదేంటి మీరు దేవుడు ఉన్నాడని ప్రూవ్ చేయలేదుగా ” అని అన్నాడు. ” నేను ప్రూవ్ చేసుకోలేదు కాబట్టి నీవు ప్రూవ్ చేసుకున్నట్టు ఎలా అవుతుంది ? ” అని అడిగాను. ఇక అంతకంటే తెలివి ఎక్కువ వాడలేకపోయాడేమో గమ్మునయ్యాడు. తెలివి గల్ల నాస్తిక వాది చేయవలసింది ” దేవుడున్నాడా ? లేడా ? ” అనే ప్రశ్నను వీరావేశంగా డిబేట్ చేయడు. అది తెలివి తక్కువ తనం. Science ఇంత వరకు ఒక్కో విషయాన్ని కనుక్కుంటూ వస్తుంది. అలా కాక మనం ఈ ప్రపంచ గతి నియమాలపై ఫోకస్ చేస్తే ఆ నాస్తికత్వానికి ఒక రంగు రుచి రూపు ఉంటుంది.

ఏ శాస్త్ర వేత్త ఐనా, ఏ చరిత్ర కారుడైనా, ఏ గణిత శాస్త్రఙుడైనా, ఏ మేధావి అయినా ఒక సామాన్య మానవుడి దగ్గర మొదలు పెట్టి అదే సామాన్య మానవుడి దగ్గర ఆగకుంటే అతని శాస్త్రము, సూత్రము చట్టు బండలు తప్ప ఏమీ కాదు. స్టీఫెన్ హాకింగ్ ఒక సామాన్య మానవుడికి ఈ విశ్వము, దేవుడి గురించి ఉండే అనుమానాలను సంక్లిష్టమైన సైన్స్ భాషలో కాక తనను తాను ఎంతో తగ్గించుకుని సామాన్య భాషలో వివరించి అతనిని సమాధాన పరచాలని చేసే ప్రయత్నం నిజంగా కొనియాడదగ్గది. గెలీలియో, కొపర్నికస్’ లాంటి శాస్త్ర వేత్తలు మనం మనసుల నిండా గుర్తుంచుకుని కృతఙతలు అర్పించాల్సిన వ్యక్తులు. ఇదే వరసలో తన అంగ వైకల్యాన్ని తలదన్ని మానవ జాతి మొత్తం విశ్వాన్ని బెరుకుగా చూసే తరుణంలో సమాజానికుండే collective confidence ఇంప్రూవ్ చేసే ప్రయత్నంలో స్టీఫెన్ హాకింగ్ చేసిన ప్రయత్నం మనకందరికీ ఆదర్శం కావాలి. అయోధ్యలో రాముడి గుడి గురించి మాట్లాడని చరిత్ర కారుడు శుద్ధ దండుగ. సమాజంలో ఆర్థిక అసమానతల గురించి నోరు తెరవని ఆర్థిక వేత్త ఎందుకూ పనికి రాని వాడు. అలా కాక తన మేధను పది మంది మంచి కోసం తనను తాను తగ్గించుకుని ముందుకు వచ్చిన హీరో స్టీఫెన్ హాకింగ్.

ఐన్’ స్టీన్ సాపేక్ష సిద్ధాంతము, డాప్లర్ అనునాద సిధ్ధాంతాలని వేగాలను కొలవ డానికి అన్వయించినా డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం తో మనిషి పుట్టుకకు అన్వయించినా ఇవన్నీ విశ్వాన్ని అర్థం చేసుకోవడంలో ఒక మార్గాన్ని చూపిస్తాయి. ఇవి నిజానికి టెక్నికల్ గా వేరైనా, వీటి మూల సూత్రం ఒకటే. అందువల్లనే వేర్వేరు శాస్త్రవేత్తలు కనుగొన్న ఈ నియమాలు కలిసే ఒక్కటిగా విరుద్ధ ఫలితాలు ఇవ్వకుండా విశ్వాన్ని ఒక్కలాగే వివరిస్తాయి. ఈ మొత్తాన్ని ఒక చట్రం లో బిగించి ఒక Unified theory త్వరలోనే ఆవిర్భవించ బడుతుందని స్టీఫెన్ హాకింగ్ ఆశిస్తాడు. అదే జరిగితే ఈ విశ్వాన్ని వివరించడానికి తత్వ వేత్తలు , శాస్త్రఙులు అవసరం ఉండదు. సామాన్య మానవుడు చాలు అని ఎంతో అశాజనకంగా ప్రకటిస్తాడు స్టీఫెన్ హాకింగ్.

– పి విక్టర్ విజయ్ కుమార్

( రచయితను ఈమెయిల్ ఐ డీ ” pvvkumar@yahoo.co.uk ” లేదా ఫేస్ బుక్ ఐ డీ P V Vijay Kumar వద్ద సంప్రదించవచ్చు )

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)