నానీలు – ఎన్.పి.కృష్ణమూర్తి

ఇలలో దేవత
అమ్మ
వృద్ధాప్యంలో
పనికిరాని బొమ్మ

చెట్టున మాగితే
తీయని పండు
వయసు పండితే
అనుభావాలు మెండు

స్వార్థంతో చేసే
దానం
చేప కోసం
వేసే గాలం

సెల్ ఫోన్ ఉంటే
స్వర్గం
మితిమీరితే
నరకం

మొక్కను పెంచితే
పండ్లు బహుమానం
కొడుకును పెంచితే
వృద్ధాశ్రమమే శరణ్యం

నెలవారి జీతం
ఖర్చులకు సొంతం
పొదుపు మంత్రం
భవితకు ఆనందం

కట్తె కాలితే
మిగిలేది భస్మం
అహం దగ్థమయితే
వచ్చేది జ్ఞానం

మంచి పలుకు
ఉత్సాహం నింపు
నిరుత్సాహపు మాట
తిరోగమనం చూపు

                                         -ఎన్.పి.కృష్ణమూర్తి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

One Response to నానీలు – ఎన్.పి.కృష్ణమూర్తి

  1. అజిత్ కుమార్ says:

    సహజంగా కొడుకులు తల్లిని ప్రేమిస్తారు. కోడలు అత్తను ద్వేషించవచ్చు/ అత్త కోడలిని ద్వేషించవచ్చు.