జీవితం కోసం పోరాటంలో
కష్టంనే ఆనందం గా మార్చుకొని
సగం చినిగిన బట్టలతో
మట్టిని పులుముకున్న ఒంటితో
చిరునవ్వును ముఖానికి తగిలించుకొని
ఎండలో చెప్పులు కూడా లేకుండా
కుటుంబం కై
పట్టెడు మెతుకులకోసం
ఆమె పోరాటం చూస్తే
దేవతలా అగుపించింది
కన్న బిడ్డలను పుట్‌పాత్ మీద పడుకోబెట్టి
ఎండ నుండి పిల్లల్ని కాపాడుకొంటూ
ఒక వైపు బిడ్డలని చూసుకుంటూ
మరోవైపు మొక్కజొన్న కండెలను కాలుస్తూ
కండె బాబు
మొక్కజొన్న కండె పది రూపాయిలు అని అరుస్తూ
ఆగిన బస్సులు వద్దకి వస్తుఅమ్ముతుంటే
ఆమె ఆడే బతుకాట
జనాల బేరాలు
బస్సు డ్రైవర్ల చీత్కారం
ఎవరో ఒకరు కొంటారనే ఆశతో
దినదిన గండంలా బతుకీడుస్తూ కూడ
ఆమె కళ్ళలో ఆనందం
కన్నోల్లపై ప్రేమలో
పట్ట పగలే వెన్నెలని చూసాను
ఆమె వ్యక్తిత్వం అమోఘం
అమ్మేకొద్దీ ఆమెలోని ఉత్సాహం చూసి
పది రూపాయి లతో కొన్న కండె రుచి అమృతం
– మార్టూరి శ్రీరామ్ ప్రసాద్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~