యాంత్రికమైన జీవితాలు (కవిత )- గంజాం భ్రమరాంబ

జీవన మాధుర్యం
ఆస్వాదించలేని
యాంత్రికమైన జీవితాలు
జీవంలేని సంపదలకు
సాష్టాంగ పడుతుంటాయి.

ఆనందానికి నిర్వచనాలు
సృష్టించుకోలేక
నిర్లిప్తంగా కొన ఊపిరితో చతికిలబడుతుంటాయి.

కళల్లోని వైశిష్ట్యం
అర్థం చేసుకోలేక
నిస్సారమైన కలలకు
స్వాగతం పలుకుతుంటాయి.

జీవితానికి ఉన్న ఉత్కృష్టతను
అందిపుచ్చుకోలేక
పలాయనవాదాన్ని
ఆకళింపు చేసుకుంటాయి.

నవరసాల సారాన్ని కోల్పోయి
నిస్సహాయంగా రోజులు
మౌనంగా కదలిపోతుంటాయి.

ఎంచుకున్న లక్ష్యం..గమ్య కోసం
ప్రాణాలర్పించే వారిని చూసి
వారి అచంచలమైన విశ్వాసం తెలిసి
కాస్త సిగ్గుపడి.. మరికాస్త దిగులు పడి
తమ బ్రతుకులలో
మరణించినదేమిటో ఉందని
విస్ఫోటనం చెందుతారు.
చేజారిన కాలాన్ని నిందిస్తారు.
తమ యాంత్రికమైన జీవితాన్ని
మనసారా ద్వేషిస్తారు.

                                                     – గంజాం భ్రమరాంబ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , Permalink

One Response to యాంత్రికమైన జీవితాలు (కవిత )- గంజాం భ్రమరాంబ

  1. వెంకటేశ్వరరావు says:

    అవునా
    నిజమేనా
    నిజమైతే
    ఇంతేనా
    యాంత్రిక
    జీవితం
    భ్రమేనా
    జీవిత
    పరమార్ధం
    ఇదేనా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)