రాత్రి-అక్షర సైన్యం-కవయిత్రుల వేదిక

గత నెల ది. 24.12.2017 న “చిటికెన వ్రేలు” అంశంపై జరిగిన “అక్షర సైన్యం-కవయిత్రుల వేదిక” నుంచి క్రొత్త క్రొత్త కోణాలను, కవితా వస్తువులను వెతుక్కుంటూ, తమ ఊహా జగతి రెక్కలను మరింతగా విప్పార్చుకుంటూ, తమ ఆలోచనలకు మరింతగా పదును పెట్టుకుంటూ ముందుకు సాగుతున్న తరుణంలో ఈ సారి “రాత్రి” అనే అంశాన్ని తీసుకుని ది.21.01.2018 తేదీ సాయంత్రం గం.3.00 లకు మరలా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోనే సమావేశం కావటం జరిగింది. సమావేశాన్ని ప్రారంభిస్తూ కొండేపూడి నిర్మల 1980-90లతో పోల్చుకుంటే ప్రస్తుతం చాలా మంది స్త్రీలు కవిత్వం ద్వారా తమ భావాలను వ్యక్తపరుస్తున్నారనీ, అప్పట్లో కవయిత్రులపై చాలా చులకన భావం ఉండేదనీ, ప్రజామోదం చాలా తక్కువగా ఉండేదనీ చెపుతూ  కవిత్వంలో వస్తు వైవిధ్యంతో పాటు మరిన్ని వైవిధ్యమైన కోణాలు, నిర్మాణపరమైన మెళకువలు నేర్చుకుంటూ ఈ వేదికను మరింతగా ముందుకు తీసుకువెళ్ళటమే తమ లక్ష్యం అన్నారు.

ఈ సారి అక్షర సైన్యం – కవయిత్రుల సమావేశానికి ముఖ్య అతిధిగా ప్రముఖ సాహితీ వేత్త, విమర్శకులు శ్రీ గుంటూరు లక్ష్మీ నర్సయ్యగారు అక్షర సైన్యంలో పాలుపంచుకున్నారు.  అక్షర సైన్యం వేదికగా జరిగే కవయిత్రుల సమావేశాలలో ఇది నాలుగవది.

కాల ప్రవాహంలో గ్రహాల గమన రీత్యా ఏర్పడే పగలు రాత్రులు మానవ జీవితంలో ఎన్నో అనుభవాలకు, అనుభూతులకు ప్రతీకలుగా నిలుస్తాయి. ఈ క్రమంలో పూర్వం నుంచి కవన లోకం తమ భావుక వనంలో రాత్రికి అత్యున్నత పట్టాన్నే కట్టింది. పగలు ఆశకు, రాత్రి నిరాశకు సాధారణ చిహ్నాలుగా భావించటం జరుగుతూ ఉంది. అయితే కవి లోకపు ఊహా జగత్తు యొక్క రెక్కల విస్తారం అనంతమైనందున ప్రస్తుతం రాత్రి అనే కవితా వస్తువు ఎన్నో అంశాలకు ప్రతీకగా నిలిచింది. రాత్రిని చీకటి, నిరాశ, భయం, పేదరికం వంటి నిరాశావహ దృక్పధాలకే కాకుండా ఆశకు, విజయానికి సంధికాలంగా భావించటం కూడా జరుగుతోంది.

ఈ నేపధ్యంలో మనోజ్ఞమైన మౌన మనో రాగాలను పలికించే రేయి సరిగమల పాటల నుండి అభాగ్యులు, ఆర్తుల జీవన చిత్రాలను సైతం సందర్శించే సామాజిక దుఃఖ గానాన్ని ఆలపిస్తూ జరిగిన అక్షర సైన్యం – కవయిత్రుల సమ్మేళనంలోనిర్మలకొండేపూడి, రేణుకఅయోల, అరుణనారదభట్ల, బండారువిజయ, జ్వలితదెంచనాల, వి. శాంతిప్రభోద, శీలా సుభద్రా దేవి, పోతన జ్యోతి, గుత్తా జ్యోత్స్న, డా. డి. ఎల్. సుహాసిని, డా. సి. భవానీ దేవి, డా. జరీనా బేగం, సి.హెచ్. ఉషా రాణి, సమ్మెట విజయ మరియు సత్యవాణి గంధం తమ  తమకవితలను చదివి వినిపించారు. శ్రోతలుగా బొమ్మదేవర నాగ కుమారి, అత్తలూరి విజయ లక్ష్మి, హిమబిందు మొదలైన వారు పాల్గొన్నారు.

ప్రస్తుత సమాజంలో చీకటి మాటున జరిగే అరాచకాలకు సాక్షిగా నిలుస్తున్న రాత్రి పూట స్వేచ్ఛగా తిరగాలనుంది అంటూ జ్యోత్స్న, అమావసను వెన్నెలగా మలిచే నిషిద్ధ స్వప్నాల సాగు చేయమంటూ తరంగాల ప్రసారం చేస్తున్న నిశిరాత్రి అంటూ శాంతి ప్రబోధ, ధైర్యాన్ని, చెలిమిని ఇచ్చే రాత్రికి నాకు తీరని అనుబంధం అంటూ అరుణ, చావు పుట్టుకలు లేని కాలం పాడే మౌన రాగంలో ఆ రాత్రి… అక్కడ… అంటూ బండారు విజయ, ప్రతి రాత్రికీ నడుమ జీవ స్పందనను కల్పించే రాత్రి పట్ల నాకు వ్యామోహం అంటూ సుహాసిని, చల్లగా మెల్లగా ఉన్నానంటూ ఎందర్నో దగా చేస్తూ, ఏమీ తెలియని నంగనాచిలా రాత్రి ఎన్నో విధాలుగా గుచ్చుకుంటుంది అంటూ సమ్మెట విజయ, నిద్రపోతున్న నగరంలో రాత్రి జీవన చిత్రం దుఃఖాన్ని మించిన దుఃఖాన్నిఓదారుస్తుందంటూ రేణుక, నిద్రని జార్చేసిన కను రెప్పల నీలి నీడల్లో రేకెత్తిన ఆలోచనలు నాలోకి, లోలోకి కొనసాగుతున్న ప్రయాణం బాధల తేనెటీగలను ఝుమ్మనిపించటంతో పాటు చిరు జ్ఞాపకాల కాగడా పరచిన వెలుగులో రాత్రి దుప్పటిని విదిలించుకుని వెలుతురు పిట్టనై సాగిపోతున్నానంటూ సుభద్రా దేవి, నేను కూడా రాత్రి కురిసే వానలాంటి దాన్నే నంటూ భవాని, నేరాల ఘోరాలే కాదు శరత్చంద్రికల విలాసాలు కూడా రాత్రి బహురూపాలేనంటూ జ్వలిత, ప్రకృతి ప్రసవ వేదన, సామాజిక సంఘర్షణ ఏదైనా ఈ రాత్రిలోనే అంటూ జ్యోతి, ఆలోచన అంకురాన నాటుకునే కల చేను, పగటి మలినాలను వడబోసే శుద్ధ కర్మాగారం రాత్రి అంటూ ఉషా రాణి,  వానను వెన్నంటి ఉన్న బురద లాగానే సమాజం వేసిన సంకెలలు మాటున దాగిన మంచితనపు ఆత్మ గౌరవం తడవకొక తులం చొప్పున బలి అయిపోతుందంటూ నిర్మల, రాత్రికి ఆవల…అచేతన మనసులకు, సజీవ శరీరాల గాధలకు మౌన సాక్షి ఈ రాత్రి అంటూ సత్యవాణి, సంక్రాంతి సెలవుల నాటి రాత్రిలో అమ్మా నాన్నల బ్రతుకు సంఘర్షణ చిత్రాన్ని పలికిస్తూ జరీనా కవితా పఠనాన్ని ముగించారు.

కవిత్వ పఠనానంతరం ముఖ్య అతిధి లక్ష్మీ నర్సయ్య గారు మాట్లాడుతూ కవితలన్నీ తెచ్చి పెట్టుకున్న పదాలు, మాటలు లేకుండా తాజాగా, తేటగా వ్యక్తీకరించబడ్డాయన్నారు. కవయిత్రులందరూ చదివిన కవితల్లో తాను గమనించిన అంశాలను ఇలా వివరించారు.

 • సామాజిక / సాంస్కృతిక భాష
 • సామాజిక దృష్టి
 • సున్నితత్వపు సృజన
 • నాటకీయ వర్ణన
 • సామాజిక మానవుడికై అన్వేషణ
 • సామాజిక జీవిత అనువర్తనం
 • మానసిక నాటకం

తరువాత కవిత్వ రచనకు సంబంధించిన మెళకువల గురుంచి తెలియ చేస్తూ ఏదైనా కవితా వస్తువును వాచ్యపరంగా కవితలో స్పృశించవలసిన అవసరం లేదనీ, భావస్ఫోరకంగా సృజిస్తే సరిపోతుందనీ అన్నారు. అందుకు నిదర్శనంగా వేరు వేరు భాషా రచయితలు రచించిన కవితలను, కవిత్వీకరణలో టెక్నిక్ లను ఇలా ఉదహరించారు.

Elinor Hazan: Night will not stay, it will go away though you pin the night with the sky with million stars Bind it with wind, buckle it with belt, go away like a sorrow (the experiential technique)

Syrian Poet:నా చుట్టూ ఉన్న రాత్రిని గురించి నేనెప్పుడూ భయపడలేదు. లోపలి రాత్రంటేనే వణుకు. బయటి రాత్రి తెల్లవారుతోంది కానీ లోపలి రాత్రి తెల్లవారుతుందో లేదో తెలియదు. “నా లోపల తిరగాల్సిన ఖండాలు చాల ఉన్నాయి”

OctavioPaz: Night fall

As the birds go settle down on the branches

They bend down towards the darkness

The grooves become silent lakes

The grass grows black

The edges blur

The lemon is black

The world is less credible

Derris: The moon opens the cloud as a boy opens the door of his house

“Night is an anonymous eye, not a simple eye, a black eye”

“చంద్రుడు వెన్నెలనే చేతి కర్రను పట్టుకుని నడుస్తూ ఉండటమే రాత్రి”

ఎంత అందమైన వ్యక్తీకరణ మనసుకు, కనులకు కట్టేసినట్టు, చదువరుల మేధలలో ఈ చిక్కని కవిత్వం తాలూకు ఊహా చిత్రం అల్లుకుని ఒక చక్కని అనుభవాన్ని, అనుభూతిని మిగులుస్తుంది.

తరువాత కవిత్వానికి ఉండవలసిన 3 ముఖ్యమైన లక్షణాలను వివరించారు.

 • విషయం లేదా కవితా వస్తువు
 • కవితా శిల్పం లేదా కవిత్వీకరణ
 • ఊహా విస్తృతి

స్త్రీవాద కవిత్వం అయినా, దళితవాద కవిత్వం అయినా నిలబడుతున్నాయంటే అందుకు కారణం ఒకే అంశాన్ని వివిధ కోణాలలో ఆవిష్కరించడమేనన్నారు.

కవిత్వ రచనలో ఎవరి ఆత్మ, గొంతుక వారివేననీ, ఏ ఇద్దరివీ ఒకేలా ఉండవనీ, కవిత్వానికి మార్మిక ఊహ, మానసిక కోణం, చెప్పదలుచుకున్న కోణం యొక్క బేరీజు, కవితా స్వభావం, నాణ్యత చాలా అవసరమనీ చెప్తూ కవిత్వ ప్రపంచంలో ప్రముఖులైన నెరుడా, శ్రీ శ్రీ మాటలను గుర్తు చేసారు.

నెరుడా: ప్రపంచంలో ఉన్న కోయిలలను నిలబెట్టి పాదమంటే అన్నీ పాడలేవు. అన్నీ కోయిలలే అయినా ఏ కోయిలకు ఆ కోయిలే ప్రత్యేకం. మనుషులు కూడా అంతే! VoiceDiffersfromeachother.

శ్రీ శ్రీ: నా గాయాన్నే నే పలవరించాలి. మరొకరి గాయాన్ని పలవరిస్తే ఎవరో వాడేసిన కర్చీఫ్ తో మన ముఖం తుడుచుకున్నట్టు.

లారెన్స్: విషయాన్ని కవిత్వంగా రాయటమంటే విషయానికి సంబంధించిన సాక్ష్యాల వర్ణన.

జీవన సంబంధాలు, సంఘర్షణలు, అవసరాలు, ఆకాంక్షల ఆధారంగా కవిత్వం భిన్నంగా పరిణమిస్తుందనీ, ఇతివృత్తాలు, కవిత్వ శిల్పం ఎప్పుడూ స్థిరంగా ఉండదనీ మారుతూనే ఉంటుందనీ (చలన శీలి), నిఘంటువులను తిరగ రాసే కవిత్వాలు తీసుకు వచ్చాయి అన్నారు.

చివరిగా “విషయం తాలూకు అనుభవం అక్షరాల్లో ప్రతిఫలించాలనీ, ఆలోచనకు అతీతమైనదేదో పాఠకుడి హృదయంలో మెదలాలి” అని చెప్తూ అందుకు ప్రతీకలుగా ఈ వాక్యాలను చెప్పి ముగించారు.

“పిట్టలు లేకుండానే ఈ చెట్టు నిదురపోవాలి కాబోలు”

“అక్షర రహితాలుగానే ఈ ముఖ పత్రాలు”

ఈ సమావేశానికి కొసమెరుపు బొమ్మదేవర నాగ కుమారి స్పందన: “ఘనీభవించిన అక్షరం కవిత్వం”.

ఆద్యంతం ఆసక్తికరం ఈ సమ్మేళనం, ఇప్పుడు నేర్చుకున్న మెళకువలతో మరో కవితా వస్తువు పై వచ్చే సమావేశంలో కవన సమరం సాగించే దిశగా అక్షర సైన్యం ప్రయాణం మొదలు పెట్టింది. ఇప్పటికి ఇక సెలవు. మరిన్ని విషయాలతో మరోసారి…

ఇట్లు

మీ సత్యవాణి (గంధం)

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సాహిత్య సమావేశాలుPermalink

One Response to రాత్రి-అక్షర సైన్యం-కవయిత్రుల వేదిక

 1. dasaraju ramarao says:

  spurtimantam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)