మొగ్గలు(కవిత)-భీంపల్లి శ్రీకాంత్

ఎంతగా వేదనను అనుభవిస్తుందో అమ్మ
పురిటినొప్పుల బాధలను భరిస్తూ
ప్రసవవేదన పదాలకందని వర్ణనాతీతం
ఎంతగా ఆవేదన చెందుతుందో విత్తనం
భూమిని పొడుచుకుంటూ వస్తూ
మొక్కగా మొలకెత్తాలని దాని ఆరాటం
ఎంతగా తపన పడుతుందో అక్షరం
పదాలతో నిత్యం చెలిమి చేస్తూ
కవిత్వం సమాజాన వెలిగే సూర్యబింబం
ఎంతగా వేదన పడుతుందో పూలచెట్టు
మొగ్గలను పువ్వులుగా వికసింపచేయడానికి
పువ్వులు ఆహ్లాదపరిచే సుగంధరాజాలు
ఎంతగా కురవాలని ఆరాటపడుతుందో చినుకు
బీడువడిన పొలాన్ని పచ్చగా మార్చడానికి
చినుకంటే అన్నదాతకు అలవికాని ఆనందం
                              -డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్
                                   9032844017
కవితలుPermalink

4 Responses to మొగ్గలు(కవిత)-భీంపల్లి శ్రీకాంత్

 1. dasaraju ramarao says:

  బాగుంది భీంపల్లి

  • భీంపల్లి శ్రీకాంత్ says:

   ధన్యవాదాలు సార్

 2. వెంకటేశ్వరరావు says:

  ఎంత వేదన పడి ఈ మినీ కవితను వ్రాసి
  ఇలా విహంగ తెరకెక్కించగలిగారో కదా శ్రీ….

  • భీంపల్లి శ్రీకాంత్ says:

   ధన్యవాదాలు సార్