చెరువు (కవిత )-దేవనపల్లి వీణావాణి

చేతులు తొల్చిన
నేల పొత్తి
ఊరొడ్డుకు మొల్చి
ఊపిరిడిసినా
జోకొట్టె గంగమ్మ కొంగు…!

కల్లాలు పూయించిన నీళ్ళు
కరువు మింగితే
కురచబడ్డది నెరువు

రొక్కం మీది దప్పి
శిఖాలు మింగితే
నెత్తురుబికిన చేను మీద
రెక్కలార్చినయి
ఎర్క కొట్టిన చేతులు …!!

వలసల్ని చూసిన చూర్ల కింద
వేసారిన పల్లె వాకిట్లు
ముసలోల్ల పాలై
బోసిపోయినయి గొడ్ల కొట్టాలు

నాగళ్ళు చెదలు పడితే
మెతుకులు పూయవు
నాలాలకు నాగా పెడితే
బతుకులు పండవు…!!

పూడిక ఊడ్చి,బీటలు పూడ్చి
చెమ్మగిల్లితే చెరువు, నవ్వదా ఊరు…?
పుష్కరాలు లేకపోతేనేం….
ఎప్పట్లాగే….
చెరువు మళ్ళీ నీళ్ళోసుకోదా.!?
చేటల నిండా బిడ్డల్ని కనదా..!!?

                                                – దేవనపల్లి వీణావాణి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

2 Responses to చెరువు (కవిత )-దేవనపల్లి వీణావాణి

  1. sudarshan says:

    రొక్కం యొక్క అర్థం ఏమిటి మేడమ్

    • దేవనపల్లి వీణా వాణి says:

      రొక్కం అంటే డబ్బు…
      డబ్బుల కోసం రియల్ ఎస్టేట్ రంగం చెరువు శిఖం భూముల్ని మాయం చేశారనే అర్థంతో ఆ వాక్యాన్ని రాయడం జరిగింది..ఆలస్యంగా స్పందించినందుకు క్షంతవ్యురాలను…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)