కళాకేళి పత్రికలో కథాసాహిత్యం(సాహిత్య వ్యాసం) – కిలారి గౌరినాయుడు

ISSN 2278-478

కళాకేళి సాహిత్య మాసపత్రికను ప్రముఖ అభ్యుదయ కవి, విమర్శకుడు డా॥ఆవంత్స సోమసుందర్‌ 1968 ఏప్రిల్‌ నెలలో ప్రారంభించారు. పత్రికా వ్యవస్థాపకులు, సంపాదకులు కూడా ఈయనే. అభ్యుదయ సాహిత్యాన్ని ప్రచారం చేయడం కోసం కళాకేళి పత్రికను ఒక సాధనంగా వాడుకున్నారు. ఈ పత్రికలో కవిత్వం, కథలు, వ్యాసాలు, గ్రంథ సమీక్షలు వంటి సాహిత్య ప్రక్రియకి ప్రాధాన్యం ఇస్తూ వెలువడేది. ఈ పత్రికలో ప్రచురింప బడిన కథను ఈ వ్యాసంలో పరిచయం చేస్తున్నాను.

కళాకేళి రెండవ సంచికలో ప్రచురింపబడిన ‘అయిదు నిమిషాలు’ కథ అనువాద రచన. హిందీ రచయిత ‘నియోగి మోహన్‌లాల్‌ మెహతో’ రాసిన దానిని ‘జజాసన’ కలం  పేరు కలిగిన రచయిత అనువాదం చేశాడు. ఈ కథలో ప్రధాన పాత్రధారి ప్రకాశం. అతను కడుపేదరికంలో ఉన్న వ్యక్తి. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు  ఉన్నారు. ప్రభుత్వం అతనికి ఉరిశిక్ష విధించింది. చివరికోరికగా భార్యాబిడ్డను చూపించమని అడుగుతాడు. అతని భార్య ఒక సామాజిక ప్రభుత్వంలో అస్తవ్యవస్థలను ప్రశ్నిస్తుంది. అయితే ప్రకాశం నేరం చేశాడు. దేని కోసం చేశాడు? తన ఆకలిని తీర్చుకోవడం కోసం, తనను నమ్ముకున్న భార్యాబిడ్డలను పోషించుకోవడానికి, కనీస అవసరాలను తీర్చుకోవడానికి నేరం చేశాడు. ఆ నేరానికి ఉరిశిక్ష పడింది . ఒకసారి  కూతురిని తీసుకొని తన భర్తను చూడడానికి వచ్చి ఒక బలమైన ప్రశ్నను న్యాయవ్యవస్థపై, ప్రభుత్వంపై, సమాజంపై సంధిస్తుంది. అయితే సమాజంలో ఉన్న రామథన్‌ అనే వడ్డీవ్యాపారి ప్రజల  రక్తం పీల్చినప్పుడు, జగన్నాథం అనే వాడు పరాయి స్త్రీలను వేశ్యగా  మార్చినప్పుడు, పాపిరెడ్డి అనేక అక్రమాలకు పాల్పడి ప్రభుత్వం తన భర్త అతిపేదరికంలో ఉండి నలుగురి ఆకలిని తీర్చడానికి చేసిన తప్పుని ఏ విధంగా బలీయమైన దానిగా చూపించడం, శిక్ష విధించడం వ్యవస్థ చేసిన తప్పుగా ఆమె నిరూపించింది. న్యాయం అనేది పేదవానికి కాదు, దరిద్రుడికి కాదు, దొరక్కుండా నేరాలు  చేసేవారిని రక్షించే సాధనంగా ఆమె నిరూపించింది. దరిద్రుడు, పేదవాడు ఈ వ్యవస్థలో బతకడానికి వీలు  లేదనే సంకేతమిస్తుంది. ఈ కథ. ‘అయిదు నిమిషాలు ’ అనే ఈ కథ హిందీ సాహిత్యంలో నిలిచిపోయిన కథగా పేర్కొనవచ్చు. ఇటువంటి గొప్ప కథను, వాస్తవిక రూపాన్ని సమాజానికి దిశానిర్దేశం చేసే కథను సంపాదకుడు ఎన్నుకొని ప్రచురించడం ఎంతో అభినందించదగ్గ విషయం. ఇటువంటి కథలు  పుంఖానుపుంఖాలుగా వస్తేనే సమాజంలో ఆలోచనాత్మక ధోరణి పెరుగుతుంది.

కళాకేళి ఆరవ సంచికలో కుమారి లక్ష్మి రాసిన కథ ‘ఆ దూరపు కొండలు ’. పల్లెల్లో బ్రతకలేక పట్టణాలకు వలస వెళ్ళినప్పుడు పడే బాధలు , అదే ఒంటరిగా వెళితే ఇంకా సమస్యల్లో ఇరుక్కుపోవడం ఈ కథలో కనిపిస్తుంది. ఉన్న ఊరిలో బ్రతకలేక పట్టణాల్లో అమానుషత్వానికి బలి అవుతూ ఎన్నో కుటుంబాలు  అనాది నుంచి అరాచకానికి గురవుతున్నాయి. ‘పోలీస్‌’ అనే వ్యక్తి లేకలేక పుట్టిన ఒక బిడ్డ. ఆ రోజుల్లో పిల్లలు  పుట్టకపోతే విక్షణమైన పేర్లు పెట్టుకునేవారు. తల్లి అప్పమ్మకి ముగ్గురు పిల్లలు  పుట్టి చనిపోతే ఈ పిల్లాడైనా బతుకుతాడని పోలీస్‌ అని పేరుపెట్టింది. వయసొచ్చేసరికి ఒక నిరుపేద కుటుంబం లోని అమ్మాయిని తీసుకువచ్చి పెళ్ళిచేసింది. పెద్ద పెద్ద ఆర్భాటాలేమి చేయకుండా తమకు ఉన్నదానితో సర్దుకుపోయి, పల్లెటూళ్ళో చిన్న చితక పనులు  చేసుకుంటూ బ్రతుకుతున్నారు. అయితే వారు సంపాదించేది పొట్టకు కూడా సరిపోకపోతుంటే ఇంటి యజమాని పోలీస్‌ తన తల్లిని, భార్యను విడిచిపెట్టి కొద్దిగా సంపాదించి వారి చిన్న చిన్న కోరికను తీర్చానే ఉద్దేశంతో ఎవరో చెప్పిన మాటలు  విని ‘దూరపు కొండు నునుపు’ అనే సామెతను మర్చిపోయి కాకినాడకు పయనమవుతాడు. అయితే అక్కడి పరిస్థితి భిన్నంగా ఉంటుంది. సహాయం చేస్తానన్న రిక్షావాడు కనిపించడు. ఒకటి రెండు చోట్ల పనికి వెళితే నిన్ను నమ్మేదెట్లా అని ప్రశ్నిస్తారు. ఇంతలో తొందరగా తెలిసిన వ్యక్తిని కలుసుకుందామని త్వర త్వరగా వెళుతుంటే ఒక పోలీస్‌ పట్టుకొని తీసుకువెళ్ళి కొట్టి పాత కేసులో ఇరికిస్తాడు. ఇదీ కథ.

పోలీసు దౌర్జన్యానికి పేదవాళ్ళు, అమాయకులైనావాళ్ళు ఏ విధంగా బలవుతున్నారో తెలియజెప్పిన కథ. ఈ కథలో తల్లి ప్రేమను, భార్య అమాయకత్వంతో కూడిన స్వచ్ఛమైన ప్రేమను, పోలీస్‌ కష్టపడి తన తల్లిని, భార్యని పోషించానే తత్వాన్ని రచయిత్రి చక్కగా వివరించింది.

కళాకేళి ఏడవ సంచికలో పి.సరళాదేవి రచించిన ‘మర్రిచెట్టు నీడలో’ కథ ప్రచురింపబడిరది. ఈ కథలో వెంకటేశ్వర్లు అనే కుర్రవాడు అయిదుగురు అక్కచెల్లెళ్ళ తర్వాత పుట్టిన పిల్లవాడు. ఇంట్లో తల్లిపెత్తనంతో పెరిగి పెద్దవాడవుతాడు. పెండ్లీడు వచ్చింది. ఒక అందమైన చురుకైన అమ్మాయినిచ్చి పెళ్ళి చేస్తారు. అతనికి కుటుంబాలు  ఎట్లా ఉంటాయో, తన తల్లి అక్క మధ్య తన వ్యక్తిత్వం ఏ విధంగా మార్పు చెందిందో అర్థం చేసుకోలేడు. అయితే భార్య ప్రేమానురాగాల వలన, తెలివితేటల  వలన ఇంతకాలం  తాను ఏ విధంగా తల్లి అనే మర్రిచెట్టు నీడలో ఎదగలేకపోయాననే స్పృహ కలుగుతుంది. ఇక్కడ ఉంటే తనతో పాటు తన భార్య కూడా అనేక ఇబ్బందుకలు  గురికావలసి వస్తుందని ఊరి నుంచి ట్రాన్స్‌ఫర్‌ పెట్టుకొని సుఖంగా జీవిస్తాడు.

ఇటువంటి కుటుంబాలో అనేక రకాలైన వ్యక్తులు  ఉండి, మానసికంగా బలహీనమైనవారిని తెలివితేటలు  అంతగా లేనివారిని తమ గుప్పిట్లో పెట్టుకొని అధికారం సాగించి తమ స్వార్థప్రయోజనాలు  నెరవేర్చుకుంటారు. ఆ విషయాన్ని అర్థం చేసుకోలేని వారు జీవితాంతం ఆ సాలిగూడులోనే బ్రతుకుతారు. అర్థం చేసుకున్నవారు వెంకటేశ్వర్లు అతని భార్య పద్మ మాదిరిగా తెలివిగా ప్రవర్తించి జీవితాన్ని సరిదిద్దుకొని సుఖంగా జీవిస్తారు. ఈ విధంగా వ్యక్తులు  మనస్తత్వాలను తెలుసుకొని యువకులు  తమ జీవితాలు  ఉచ్చులో పడకుండా చూసుకోవాలని ఈ కథలో రచయిత్రి తెలియజేసింది.

కళాకేళి కథ ప్రత్యేక సంచికలో ‘రాజీ’ అనే కథను డి.హనుమంతురావు రచించాడు. ఈ కథ వర్ణనతో ప్రారంభమైంది. రామ్మూర్తి అనే వ్యక్తి ఈ కథలో ప్రధాన పాత్రధారి. వాల్తేరులో చదువుకున్నవాడు. మంచి అభ్యుదయభావాలు  కలిగిన వ్యక్తి. శాంతి, జానకి, రమ, శకుంతల  వంటి వారితో మంచి పరిచయాలున్నాయి. వీళ్ళంతా సౌందర్యం, సంస్కృతి, మంచితనం, తెలివితేటలు , నిర్మలత్వం, పరిశుభ్రత వంటి ఎన్నో మంచిగుణాలకి కాణాచి అయినవాళ్ళు. అయితే రామ్మూర్తి వాళ్ళ క్షణాలను ప్రేమించినంతగా వాళ్ళను ప్రేమించలేదు. పెళ్ళంటూ చేసుకుంటే అతని ఆదర్శానికి ఏ కొద్దిగానైనా చేరువుగా వచ్చే అమ్మాయిని చేసుకోవాలని అనుకునేవాడు. చివరికి సుధని పెళ్ళిచేసుకున్నాడు. చదువు పూర్తయ్యేవరకు మనకు పిల్లలు  వద్దని సుధ రామ్మూర్తితో అంటుంది. దానికేం పిల్లలు  పుట్టకుండా ఉండడానికి చాలా మార్గాలున్నాయని అంటాడు. పెళ్ళయిన తర్వాత పరిస్థితుతో రాజీపడాల్సివస్తుందంటూ సుధ వాళ్ళ చెల్లెలు రాజేశ్వరికి లేఖ రాసింది. ఆ ఉత్తరంలో చిన్న నాటి విషయాలను గురించి, అనుకున్నది సాధించాలన్న పట్టుదల , మొండితనం వంటివి తనలో ఉండేవని లేఖలో ప్రస్తావిస్తుంది. చివరిగా పుట్టింది మొదలు  చచ్చేదాకా అన్ని విషయాలలో ‘రాజీ’పడుతూ బ్రతకడమే జీవితం అంటూ కథ ముగిస్తుంది. ఆనాటి మధ్య తరగతి యువకుల  మనస్తత్వానికి ఈ కథ అద్దం పడుతుంది.

ఇదే సంచికలో ‘సమ(యుగ)ధర్మం’ అనే కథను పరుచూరి రాజారాం రచించాడు. ఈ కథ ఆస్తి`నాస్తి అనే వాదాలతో ప్రారంభమై మధ్యలో విశ్వనాథం, రామ్మూర్తి తిరుపతి వెళ్ళడం అక్కడ ప్రమాదం జరగటం, ఒకడేమో వెంకటేశ్వరుని దయ వల్ల  బ్రతికామని, ఇంకొకడు యాదృచ్ఛికంగా బ్రతికామని వాదోపవాదాలు  చేసుకుంటారు. దేవుడు, దెయ్యం అనే వాటిపై స్పష్టమైన అవగాహన లేకపోతే అభిప్రాయాలు , రచనలు  అసంపూర్తిగా మిగిలిపోతాయి. రచయితకి ఈ విషయంలో స్పష్టత అవసరం. ఇక్కడ ఇదేమీ కనిపించడం లేదు. కృత్రిమంగా రెండు దొంగ పాత్రలు  సృష్టించి వాళ్ళ భార్యలిద్దరికి ఒకే రకమైన అనారోగ్యాన్ని కల్పించి ఒకరు బ్రతికారని, ఇంకొకరు చనిపోయారని ఇది ఎట్లా జరిగిందనే మీమాంసతో ఈ కథ ముగుస్తుంది. ఈ కథ ఆస్తి`నాస్తి సిద్ధాంతాలకు  కృత్రిమమైన పాత్రలు  జోడిరచి రాయటం జరిగింది.

ఈ సంచికలోనే ‘ట్రూసన్‌’ అనే కథను శశికాంత్‌ శాతకర్ణి రచించాడు. కాలేజీలో చదువుకునే తన ఇద్దరు మిత్రులు  గురించి రాస్తూ, కొడవటిగంటి, చలం , రావిశాస్త్రి రచనలు  గురించి విహంగ వీక్షణం చేశారు. తర్వాత మిత్రులిద్దరూ సన్నిహితంగా ఉన్నప్పటికీ ఒకరి విషయాలు  ఒకరికి తెలిసే సరికి దూరమైపోతారు. అందులో ఒక పాత్ర సుబ్రహ్మణ్యం ప్రవర్తనను సరిదిద్దాల నే ప్రయత్నిస్తాడు. సుబ్రహ్మణ్యం నేపథ్యం ఏమిటంటే అతని తండ్రి పెద్ద సంపన్నుడు, భోగలాసుడు. ఊరికొక స్త్రీని ఉంచుకొని, ఊర్లో కూడా నలుగురిని ఉంచుకొని, ఆడవాళ్ళను ఉంచుకోవడమే ప్రతిష్ఠగా భావించేవ్యక్తి. ఆయన కుమారుడు కూడా కాలేజీలో చదువుతున్నప్పటికి నీచపు అలవాట్లులోనే మునిగిపోయి ఉన్నాడు. స్నేహితలు  అతని ప్రవర్తనను మార్చాని ప్రయత్నిస్తే వినిపించుకోకుండా తన మార్గంలోనే నడుస్తాడు. అందువల్ల  అతడు ‘ట్రూసన్‌’ అని మిత్రుంతా భావించి అతనిని వదిలిపెట్టారు.

కళాకేళి కథ ప్రత్యేక సంచికలో ‘మురికిపేటవాసులు ’ అనే కథను బలివాడ కాంతారావు రచించాడు. ఈ కథలో ఇతివృత్తం మురికిపేటవాసులు  పల్లెల్లో బతకలేక వలస కూలీలుగా పట్టణాలకు వలస వెళతారు. పట్నం వచ్చి చిన్న చిన్న గుడిసెలు వేసుకొని భార్యాబిడ్డలతో నివసిస్తుంటారు. అనేక కష్టాలకోర్చి సంపన్నులకు భవంతు కట్టి వీళ్ళు మాత్రం జీవితంలో ఎలాంటి ఎదుగుదల  లేకుండా మిగిలిపోవడం ఈ కథలో దృశ్యమాన మైంది. బలివాడ కాంతారావు రచించిన ఈ కథ మురికిపేటవాసులు  గురించి రాసినది. ఈ కథలో వాళ్ళల్లో ఉన్నటువంటి చదువులేమి, కొట్లాటలు , మద్యపానం అనేక రుగ్మతలు  అందులో చోటు చేసుకున్నాయి. ఇవన్నీ రచయిత స్వగతం మాదిరిగా చెప్పాడు. మురికిపేట వాసులు  ఎన్నో భవంతులు  నిర్మించడంలో ప్రముఖపాత్ర పోషించారు. వీరి జీవితాలలో మాత్రం పెద్దగా మార్పేమిలేదు అనే విషయాన్ని ఈ కథ ద్వారా రచయిత తెలియజేస్తాడు.

ఈ విధంగా కళాకేళి పత్రికలో ప్రచురింపబడిన కొన్ని కథల  గాఢతను కలిగి ఉండి సామాజిక వాస్తవికతను ప్రతిబింబించాయి. కొన్ని కథలు  కొత్తవారిచేత రచింపబడి కుటుంబాలలో జరిగే సంఘటనలు , పరిస్థితులను వివరించాయి. అవి అంత పేల వంగా లేనప్పటికీ కొంత కథనంతో సఫలీకృతమైనవి. కళాకేళి సాహిత్య మాసపత్రికను ‘ఆధునిక సాహిత్య దిక్సూచి’గా కథకులు , కవులు  భావించేవారు. కళాకేళిలో కథ ప్రచురింపబడటం, సోమసుందర్‌ సంపాదకీయంలో కథ ఎంపిక కావడమంటే అదో గొప్ప అవార్డుగా రచయితలు  గర్వపడేవారు.

కిలారి గౌరినాయుడు
పరిశోధకుడు,
పొట్టి శ్రీరాములు  తెలుగు  విశ్వవిద్యాయం
బొమ్మూరు, రాజమహేంద్రవరం.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సాహిత్య వ్యాసాలు ​Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)