వంటింటి మహరాణి – పద్మావతి రాంభక్త

భూమ్మీద పడగానే ఏకఛత్రాదిపత్యంగా
నా సామ్రాజ్యానికి మహరాణిని అయ్యాను
ప్రతీ ఉదయాన పొగల సెగల మధ్యన ముఖానికి మసి పూసుకుని నేను జన్మిస్తాను
వేడి కొలిమిలో శరీరాన్ని కరిగిస్తూ అన్నంతో కుతకుతా ఉడుకుతాను
ఉప్పు తక్కువ కూరలు కోపంతో నన్ను అభిషేకిస్తున్నా
సహనాన్ని మోసుకు తిరుగుతాను
ఇంటిని ఉతికి ఆరేసి శుభ్రత చొక్కాను తొడుగుతాను
కొండచిలువంత పనుల జాబితాతో కుస్తీలు పడుతూ
రోజంతా తలమునకలవుతాను
మనసు నలిగినపుడల్లా రాత్రి తలగడలోనే కన్నీటినదులను ప్రవహింపజేస్తాను
ఇన్నీ చేసి హౌస్ వైఫ్ గా తేలిక చూపుల మధ్యన చిక్కిసగమవుతూ
కూరలో కరివేపాకులా మిగులుతాను
ఉద్యోగం చేసినా ఊళ్ళేలుతున్నా
వంటింటిని మాత్రం కొంగుకు కట్టుకోవడం మరువక మెలుగుతాను
ఆడదానివంటూ అణిగివుండాలనే అదుపాజ్ఞాల మధ్యన నా ఆత్మగౌరవాన్ని పాతేసి
ఉత్తమఇల్లాలనే ముళ్ళకిరీటాన్ని మోస్తూ కుములుతాను
సమాజపు దృష్టిలో ఎప్పుడూ చులకనగానే చూడబడతాను

– పద్మావతి రాంభక్త

కవితలుPermalink

2 Responses to వంటింటి మహరాణి – పద్మావతి రాంభక్త

  1. దడాల వెంకటేశ్వరరావు says:

    నీవనుకునే నువ్వు నువ్వుకాదు. నిన్నువుండమనేలా వుండేదానివి నువ్వుకాదు అనిగిమణిగి అదుపాజ్ఞలలోఉండడానికి నువ్వు ఆత్మగౌరవం లేనిదానివేమీ కాదు

    తెలికచూపులతో కూరలో

  2. దడాల వెంకటేశ్వరరావు says:

    స్త్రీ గురించి మగవారనుకునే విధంగా కూడా మీరనుకోవడంలేదంటే మీ కవితకి ఏమనాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)