చిటికెన వ్రేలు-గంధం సత్యవాణి

                       చినుకు చినుకు కలిసి వర్షమైనట్టు, అక్షరం అక్షరం కలిసి కవిత్వమైనట్టు, కవితా వనంలో విభిన్న దృక్పధాలు, వైవిధ్యమైన కోణాలే కవితా వస్తువులుగా తమ కవితా సుమాలను పూయిస్తూ, “కాదేదీ కవిత్వానికి అనర్హం” అన్నట్టు ప్రతి కీలకమైన సున్నితమైన సమస్యలపై తమదైన శైలితో కావన రంగంలో కవితా కవాతును చేస్తూ “అక్షర సైన్యమై” ముందుకు కదులుతున్న కవయిత్రుల సమ్మేళనం ది. 24.12.2017 సాయంత్రం గం. 3.00లకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది.

 సమ్మేళనం అంటే ఎప్పుడూ జరిగేలా కాకుండా విభిన్నంగా ఉండాలనే ఉద్దేశ్యంతో అక్షర సైన్యం వేదికగా పాల్గొంటున్న కవయిత్రులు ప్రతి సారీ ఒక విభిన్నమైన అంశాన్ని ఎంపిక చేసుకోవటం జరుగురుతుంది. అలా ఈ సారి ఎంపిక చేసుకున్న అంశం “చిటికెన వ్రేలు”.

సాధారణంగా చిటికెన వ్రేలు అనగానే ఒక చిన్న చూపు, ఏముందీ అన్ని వ్రేళ్ళలో అదీ ఒక వ్రేలు అనే భావన కానీ లోతుగా ఆలోచించి చూసినట్టైతే చిటికెన వ్రేలు లేకుండా జీవితంలో ముఖ్యమైన పనులేమీ చేయలేమనే వాస్తవం అర్ధం అవుతుంది. ఉదాహరణకు పిడికిలి బలంగా ఉండాలంటే చిటికెన వ్రేలు ఆధారం తప్పనిసరి. లింగ వివక్షత దిశగా ఆలోచిస్తే కూడా అతి సున్నితమైన అంశమీ చిటికెన వ్రేలు. “రవి గాంచని చోటు కవి గాంచున్” అంటారు పెద్దలు. ఆ మాట ప్రకారం చూస్తే ఏ వస్తువు/ సామాజిక సమస్య/ రుగ్మత అయినా కవితా వస్తువు అయి తీరుతుంది. కావలసింది లోతుగా ఆలోచించ గలిగే ఓపిక, అంశాన్ని వేరు వేరు కోణాలలో అర్ధం చేసుకో గల/ చూడ గల నేర్పు. ఎంత డ్రై సబ్జెక్ట్ అయినా వ్రాసిన శైలి, ఆవిష్కరించిన తీరు చదువరులను ఆలోచింప చేసినట్లయితే కవిత్వం యొక్క పరమావధి నెరవేరినట్టే!

అటువంటి వైవిధ్యమైన అంశంపై ఈ కవయిత్రుల సమ్మేళనంలో నిర్మల కొండేపూడి, రేణుక అయోల, డా. విజయలక్ష్మి పండిట్, అరుణ నారదభట్ల, బండారు విజయ, జ్వలిత దెంచనాల, డా. గీతాంజలి, లక్ష్మి శ్రీ, రక్షిత సుమ, శాంతి ప్రభోద, అనసూయ, జయశ్రీ నాయుడు తమ కవితలు చదివారు.

విజయ పట్టణమైనా, పల్లె అయినా నేను అనామికనంటే, జీవితమనే ఇరుకుతుప్పల్లో మౌనవాక్యంగా మిగిలాల్సిందేనా అంటూ జయశ్రీ, మానవత్వం కనుమరుగౌతున్న మనసులకు చికిత్స అవసరమంటూ, అంతరాల దొంతరలను చేధించాలంటూ అనసూయ, అవసరానికి ఆలోచన తప్పనిసరంటూ రక్షిత సుమ, సూర్యోదయం కన్నా ముందే పొదల మాటున పిట్టలు కాళ్ళకు దారి చూపించే కొన్ని సమయాలంటూ లక్ష్మి శ్రీ, బయట పడాల్సిన అస్వస్థత ఇంకా వెనుకబడే ఉందంటూ అరుణ, పిడికిలి సాధించిన ఆత్మ విశ్వాసాన్ని దేహంలోని చిన్ని ద్రవ సంచి ఒత్తిడికి చిటికెన వ్రేలు ఓడించేస్తుందంటూ గీతాంజలి, విశ్వ పుత్రికలకు గ్రామాల బహిర్భూములు మరుభూములు కారాదంటూ విజయలక్ష్మీ పండిట్, అమెరికా అణుస్తున్నా అణగని క్యూబాలానే నిండైన బ్లాడర్ తిరుగుబాటు చేసినపుడనిపిస్తుందేమో అంటూ శాంతి ప్రభోద, ఆకాశంలో సగానికి బహిర్భూములు రాసిచ్చిన దేశంలో నేను బతికుండగా నాకు రెండడుగులు కావాలి, మందిరాల మరుగు కావాలి, నాకొక అర్ర కావాలంటూ జ్వలిత, ఇది చెంబుడు నీళ్ళ హింసంటూ రేణుక, ముళ్ళ కంపల చాటున బిగబట్టిన భీభత్సం సృష్టించే వలసల రాజ్యం మాకొద్దంటూ నిర్మల, మొత్తంగా నన్ను (చిటికెన వ్రేలు) అవశేషావయవం కాకుండా సమానత్వపు ప్రాణ వాయువునందించమంటూ కవితా పఠనం ముగించారు.

అమెరికా నుండి వచ్చిన ప్రసిద్ధ కవులైన అఫ్సర్, నారాయణ స్వామి, కల్పన రెంటాల ఈ సమ్మేళనంలో పాల్గొనటం కవయిత్రుల సమ్మేళనానికి మరో ముఖ్య ఆకర్షణగా నిలిచారు.
అఫ్సర్ మాట్లాడుతూ గతంలో విజయవాడలో జరిగిన భారీ కవి సమ్మేళనానికీ, ఇప్పటికీ చాలా మార్పు వచ్చిందంటూ కవయిత్రుల కవితల్లో దిగువ తెల్పిన ఎన్నో అంశాలు తన దృష్టికి వచ్చాయన్నారు.
● భాష యాసలో ఉండే వచన లక్షణం
● ఆటోబయోగ్రఫికల్ ఎలిమెంట్స్
● బాడీ పాలిటిక్స్
● కవిత్వపు ఎత్తుగడ
● వ్యక్తీకరణ
● కధనాత్మక కవిత
● పెర్ఫార్మన్స్ పొయెట్రీ
● ప్రతి వాక్యం కొరడా చురకలా ఉండటం
● వచన కవిత్వం మొదలైనవి.

ఈ సందర్భంలో “నన్ను నేను నగ్నంగా నిలబెట్టుకున్నపుడే కవిత్వం అవుతుందని” ఠాగూర్ చెప్పిన మాటలను, సున్నితత్వం, కరుణ, దయ అనేవి స్త్రీల భాష అనీ చెప్తూ వారినుంచే నేను భాష నేర్చుకున్నానని చెప్పిన శ్రీపాద వారి మాటలను మననం చేసుకుంటూ… ఏది కవిత్వం! ఏది కవిత్వం కాదు అనే అంశమై…

“కవిత్వ భాషలో సాంద్రత, గాఢత ఎక్కువగా ఉంటుందనీ, తేలిక మాటలను కవిత్వంలోకి తీసుకురావడం కష్టమనీ, అలంకారిక లక్షణాలను పరిహరించి సులభశైలిలో కవిత్వం వ్రాయవలసిన అవసరాన్నీ, ప్రస్తుత వాతావరణాన్ని ప్రతిబింబించవలసిన అవసరాన్నీ, సమాజ సంబంధిత అంశాలపై స్త్రీలు బలమైన కవిత్వం” తీసుకు రావాల్సిన విషయమై చక్కటి సూచనలు చేసారు.

కల్పన రెంటాల వర్తమాన మానవ సంబంధాల గురించి మాట్లాడుతూ కథా సాహిత్యం ద్వారా మానవ సంబంధాల ఔన్నత్యాన్ని అందరికీ గుర్తు చేయవలసిన అవసరం ఉందనీ మన్నెం సింధు మాధురి వ్రాసిన “మీరా” కథ, కొండేపూడి నిర్మల వ్రాసిన “ఎచటికి పోతావీ రాత్రి” కథ, కల్పన స్వయంగా రచించిన “సంచయనం” కథలలోని విభిన్న కోణాలను, మానవ సంబంధాలలోని సున్నితమైన అంశాలను విపులంగా చర్చించారు. చర్చలో భాగంగా ఏ వ్యక్తి ఎలా ఉన్నా, వారిని ఎలా ఉంటే అలా (అభిప్రాయ బేధాలు, శారీరక బేధాలు ఉన్నప్పటికీ) మనతో పాటు కలుపుకుంటూ ముందుకు సాగిపోవడమే మంచిదనే అభిప్రాయంతో అందరూ ఏకీభవించటం గమనించదగిన విషయం.

ఇక మరో ముఖ్యమైన వక్త, ప్రసిద్ధ కవి నారాయణ స్వామి “కవిత్వం లో పూరించాల్సిన ఖాళీలు” అనే అంశమై మాట్లాడుతూ సమకాలీన అంశాలను స్థానిక/రాష్ట్ర/జాతీయ స్థాయిలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో కూడా సమాజంలో ఉన్న విలువలు మరియు సంఘర్షణ దృష్ట్యా గమనించవలసిన అవసరం చాలా ఉందని అన్నారు. మహిళల రాజకీయ ఎత్తుగడలతో పాటు వివిధ స్థాయిలలో నాయకత్వ బాధ్యతలు వంటి అంశాలను కవిత్వంలోకి తీసుకు రావలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు. చదువరుల మనసులలో ముందస్తుగానే ఏర్పడిన అభిప్రాయాలను పటాపంచలు చేసేదిగా, వారిని ఆలోచింపచేసేదిగా, సరిక్రొత్త కోణాలను ఆవిష్కరించేలా కవిత్వం ఉండాలన్నారు. చివరిగా కవితా వస్తువులెన్నున్నా, వాటిని సూటిగా చెప్పగలిగినపుడే ప్రయోజనం నెరవేరుతుందన్నారు.

ఈ విధంగా ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ సమ్మేళనంలో కవయిత్రులందరూ మరిన్ని క్రొత్త కోణాలను చదువరుల ముందుకు తీసుకు వచ్చేందుకు తమకు లభించిన నూతన దృక్కోణాలు, కవితా వస్తువులను ఏరుకొని అక్షర సమరం సాగించటానికి అక్షర సైన్యమై మరో సమ్మేళనానికి సమాయత్తం అయ్యేందుకు సిద్ధమౌతున్నారు.

– గంధం సత్యవాణి
01.01.2018

సాహిత్య సమావేశాలుPermalink

One Response to చిటికెన వ్రేలు-గంధం సత్యవాణి

  1. renuka ayola says:

    చాలా బాగా విశ్లేషించారు సత్యవాణి అభినందనలు ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)