ఆ…రాత్రి ….అక్కడ…?

పగలంతా ప్రేమను ఒలక బోసి
రాత్రి చీకటిని పర్చుకుంది ఆకాశం
చావు పుట్టుకలు లేని కాలం
ఎప్పటిలా మౌనంగనే ఉంది
కీచురాళ్ళు గుసగుసలాడుతూ
కళ్ళను చికిలించి పరికిస్తున్నాయి
గది లోపల వెళ్ళాడిన శవం
చివరిసారిగా నవ్విన నవ్వు
సుడులు తిరుగుతూ గాలిలో తేలి
ధూళితో కల్సి కనుమరుగైంది

ఆ రోజు రాత్రి అక్కడ
ఏం జరిగిందో చెప్పటానికి
ఆమె ఉంటే ఎంతబాగుండు?
రహస్యాలన్నీ బట్టబయలు చేసి
కంపు నోళ్లను మూయించేది గదా!

రెండక్షరాల ప్రేమలన్నీ
ఊపిరాడనివ్వక ఒంటరిని చేసి
కొన్ని యోజనాల దూరంగా
మైదానంలోకి ఆమెను విసిరేస్తే
పెళ్లనే మరో సుడిగుండం
ఆమెను నిలువునా దోచుకుంది

తనదేననుకున్న …ఆ రాత్రి !
ఆమెను చుట్టు ముట్టి
ఆలోచనల్లోకి దూరగల్గితే
అణువణువును పరిశీలించగల్గితే
అంతరంగ గుట్టువిప్పగల్గితే
హృదయం విప్పి చేతుల్లో పెట్టేది
తన తొందరపాటు నిర్ణయాన్ని
పశ్చాత్తాపంతో మార్చుకునేది!

భార్య బంగారాన్నే కాదు
బానిసత్వాన్ని మోసుకురావాలి
ప్రేయసి మొహమెత్తినప్పుడల్లా
లాభార్జనల్లో మట్టిబొమ్మై పోవాలి
స్నేహం కలుషితమయినప్పుడల్లా
ఆమె సున్నితంగా లొంగిపోవాలి
కాదని…ఎదురుతిరిగితే!
మంటల్లో కాలి బూడిదై పోతుంది
యాసిడ్ దాడికి కురూపైపోతుంది
ఎనభై కేజీల దేహం ఐదు కేజీల
సీలింగ్ ఫ్యాన్కు ఉరితీయబడ్తుంది

ఆమెను అతను దోచుకున్నాడా!
అతనే ఆమెను దహించివేశాడా!
ఆమెకు…కొన ఊపిరైనా ఉంటే…
నిజం గుప్పున పరిమళించేది!
తేలుకుట్టిన దొంగలు దొరికేవారు
కప్పిన వారి రంగులు తెలిపోయేవి

అందమైన దేహం శవమయ్యాక
ఆమె రూపంపై రాళ్ళేసేవారు
జీవనంపై బురద చల్లేవారు
యవ్వనానికి మసిబూసే వారు
సీరియల్ పంచనామాలు చేస్తూ
కుళ్ళిన కంపును నాలాలను తెర్చి
మీడియాలో రంగులద్దుతూ
అపవాదుల పర్వతాలను
ఆమె ముఖంపై నిర్విరామంగా ఇంకా విసిరివేస్తునే వున్నారు!
శవాన్ని మళ్లీ మళ్ళీ హత్య చేస్తూ
బరితెగించినదన్న బిరుదులిచ్చి
మూసీనదిలో మునక లేస్తున్నారు

జీవిత ప్రహవాస గుట్టు విప్పుతూ
ఆ రాత్రి రహస్యాన్ని ఛేదించటానికి
శవమైనా మాట్లాడితే బాగుండు!
దుఃఖపు చారికలు గడ్డకట్టకముందే
న్యాయం మాట్లాడితే బాగుండు!
ఆ..రహస్యాన్ని చెప్పేస్తే బాగుండు!
ఆమెను హత్య చేసింది బలహీనతలు కానే కావని
బలి తీసుకుంది మనుషులేనని!
ఆత్మహత్యలన్నీ హత్యలే అని!

– భండారు విజయ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)