తెలుగు నృత్య నాటకాల రచనలో కూచిపూడి నర్తకులు(సాహిత్య వ్యాసం )-డా.లక్ష్మణరావు ఆదిమూలం

                                                                                                                     ISSN 2278-478

“నాటకాంతం హి సాహిత్యం” అన్నాడు మహాకవి కాళిదాసు. అంటే అన్ని సాహిత్య ప్రక్రియలలోనూ చివరిగా స్పర్శించవలసిన అంకం నాటకమని అర్ధం. కవిత్వం, వ్యాసం, కథ , కావ్యం ఇలా అన్ని సాహిత్య ప్రక్రియలను స్పృశించిన తరువాత మాత్రమే నాటకాన్ని రచించాలని ఆయన తెలిపాడు. అప్పుడు మాత్రమే నాటక రచనకు నిండుదనం చేకూరుతుందని ఆయన భావన. ప్రపంచసాహిత్యంలో “మాళవికాగ్నిమిత్రం”, “అభిజ్ఞాన శాకుంతలం” వంటి నాటకాల ద్వారా చిరస్థాయిగా నిలిచిపోయిన కాళిదాసు అభిప్రాయం నూటికి నూరుపాళ్ళూ నిజమని ఆధునిక రచయితలు మనస్ఫూర్తిగా అంగీకరిస్తారు. నాటకానికి అంత శక్తి ఉంది. కాబట్టే, “నాటకం రసాత్మకం కావ్యం” అన్నాడు.
తెలుగు నాటక రచన ఆధునిక కాలంలోనే ప్రారంభమైనట్టుగా పలువురు భావిస్తారు. పలువురు పూర్వ నాటకకర్తలు సంస్కృతంలోనే నాటకాలు రాయడం, ఆధునిక యుగారంభంతో నాటక రచన, ప్రదర్శనల ఉధృతి పెరగడం వంటివి ఈ అభిప్రాయానికి కారణాలు కావచ్చు. అయితే వినుకొండ వల్లభరాయుడు (గ్రంథకర్తృత్వంలో వివాదం ఉంది) క్రీడాభిరామం పేరిట రచించిన కృతి వీధినాటకమే. కానీ పలువురు పండితులు దీని ప్రదర్శన యోగ్యతపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

కోరాడ రామచంద్రశాస్త్రి, కొక్కొండ వెంకటరత్నం పంతులు, పరవస్తు వెంకట రంగాచార్యులు, వావిలాల వాసుదేవశాస్త్రి ఆధునిక తెలుగు నాటక రచనా ప్రారంభ విషయాన ప్రథములు. కందుకూరి వీరేశలింగం, కొండుభొట్ల సుబ్రహ్మణ్యశాస్త్రి, నాదెళ్ళ పురుషోత్తమ కవి, వడ్డాది సుబ్బారాయుడు ఆధునిక తెలుగు నాటక ప్రదర్శనారంభ విషయంలో ప్రథములు.

ఆధునిక నాటక రచన 1860 ప్రాంతాల్లో ఆరంభంకాగా నాటక ప్రదర్శన మాత్రం 1880 లో ప్రారంభమయ్యింది. ఆధునిక కాలంలో వెలువడిన తొలి తెలుగు నాటకం “మంజరీ మధుకరీయము”. దీనిని కోరాడ రామచంద్రశాస్త్రి 1860 ప్రాంతాల్లో రచించాడు. ముద్రణ మాత్రం 1908లో జరిగింది. సంస్కృతంలో నుంచి నాటక లక్షణాలను అనుసరించి తెలుగులో వెలువడిన స్వతంత్ర రచన ఇది. అదేవిధంగా ‘ఆంధ్రా జాన్సన్‌ ‘గా సుప్రసిద్ధులైన కొక్కొండ వెంకటరత్నం పంతులు 1871 ప్రారంభంలో ఆంధ్రుడైన వారణాశి ధర్మసూరిసంస్కృతంలో రచించిన “నరకాసుర విజయము” అనే వ్యాయోగమును ఆంధ్రీకరించాడు. ఇది 1872 లో ప్రకటితమయింది. అదే విధంగా రిఫార్మర్ పండిట్ అని ప్రసిద్ధికెక్కిన పరవస్తు వెంకట రంగాచార్యులు 1872 ప్రాంతాల్లో కాళిదాసు రచించిన “అభిజ్ఞాన శాకుంతలము”ను ఆంధ్రీకరించడం జరిగింది. ఇదిలావుంటే వావిలాల వాసుదేవశాస్త్రి ఆంగ్ల నాటక ఆంధ్రీకరణకు మార్గం వేశాడు. జూలియస్ సీజర్ నాటకాన్ని “సీజరు చరిత్రము” అను పేరుతో 1874 లో ఆసాంతం తేటగీతిలో ఆంధ్రీకరించాడు. ఇది 1876 లో ప్రకటితమయింది. తెలుగులో పద్య నాటకాన్ని, విషాదాంత నాటకాన్ని రచించినవారిలో వాసుదేవశాస్త్రి ప్రథముడు.

ఆధునిక నాటక రచనకు ఆద్యులు వారైతే, ఆధునిక నాటక ప్రదర్శన ఆరంభ దశకు కందుకూరి వీరేశలింగం పంతులు, కొండుభొట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి, నాదెళ్ళ పురుషోత్తమకవి, వడ్డాది సుబ్బారాయుడులు రూపకర్తలు. వీరేశలింగం సంభాషణ రూపాన “బ్రాహ్మ వివాహము” అను ప్రహసనమును తన “హాస్య సంజీవని” అను పత్రికలో రచించాడు. అనంతరం “వ్యవహార ధర్మబోధిని” అనే నాటకాన్ని ప్రకటించాడు. ఇది వ్యావహారిక భాషలో రచించబడింది. వ్యావహారిక భాషలో ఆసాంతం రచన సాగించడం ఆనాడు ఒక సాహసం. పైగా ప్రదర్శన భాగ్యం పొందిన తొలి తెలుగు నాటకమిది.

1880 లో వీరేశలింగం నాటక సమాజాన్ని స్థాపించి “రత్నావళి”, “చమత్కార రత్నావళి” అను రెండు నాటకాలను ప్రదర్శించాడు. తెలుగునాట తొలి నాటక సమాజాన్ని స్థాపించిన ఘనత వీరేశలింగందే. ఇతడి స్వతంత్ర రచన అయిన “వ్యవహార ధర్మబోధిని”, సంస్కృత నాటక అనువాదమైన “రత్నావళి”, ఆంగ్ల నాటక అనుసరణ అయిన “చమత్కార రత్నావళి” ప్రదర్శన భాగ్యం పొందిన తొలి తెలుగు నాటకాలు. ఇది 1880 లో జరిగింది. అందుచేత 1980 వ సంవత్సరం తెలుగు నాటకరంగ శతజయంతి సంవత్సరం అయింది.

నృత్తం , నృత్యం , నాట్యం , అభినయం వీటి కలయిక రూపకమనీ , నాటకమనీపేర్కొనవచ్చు . నాటకంలో నృత్యంకు తక్కువ అవకాశం ఉన్న , అభినయానికి ప్రాధాన్యం ఉంటుంది . భారత దేశంలో 13 శాస్త్రీయ నృత్యాలలో కూచిపూడి ఒకటి . ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో ఉన్న కూచిపూడి భాగవతులు ప్రదర్శించే నృత్య శైలి కూచిపూడిగా ప్రసిద్ధి చెందింది . పురుషులు స్త్రీ పాత్రలు ధరించి నటించే సంప్రదాయానికి కలాపం అని పేరు . శ్రీ సిద్దేంద్ర యోగి రచించిన భామాకలాపం కూచిపూడి నాట్యానికే తలమానికం . ఇప్పుడు మనం చూస్తున్న , చేస్తున్న కూచిపూడి నృత్య శైలికి సిద్ధేంద్ర యోగియే ఆద్యుడు .

కూచిపూడి కళాకారులు యక్షగానాలను ప్రదర్శించేవారు . కాలక్రమంలో ఒక సంప్రదాయబద్దమైన నాత్యంగా కూచిపూడిని తీర్చుదిద్దుకున్నారు . భరతుని “నాట్య శాస్త్రం “ , నందికేశ్వరుని “అభినయ దర్పణం “ వంటి గ్రందాల ఆధారంగా కూచిపూడి నాట్యం నేడు ప్రదర్శించబడుతుంది . 1959 లో ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ నిర్వహించిన కూచిపూడి నాట్య సెమినార్ కూచిపూడి గురువులలో , కళాకారులలో స్ఫూర్తిని నింపింది . చతుర్విదాభినయాలకి సమానమైన ప్రాముఖ్యతనిస్తుంది కూచిపూడి నాట్యం . ఉషాపరిణయం , పారిజాతపహరణం , భక్త ప్రహ్లాద , గిరిజా కళ్యాణం , శ్రీనివాస కళ్యాణం , హరి విలాసం కూచిపూడి నాట్యానికి ఉదాహరణలు .

నృత్య నాటకాలలో ఒక్కో పాత్ర ఒక్కో నర్తకుడు పోషిస్తాడు . వీటిలో పాత్రకు తగ్గట్టుగా ఆహార్యం , నడక , ఆట ,పాట ఉంటాయి . వినాయక కౌతం , పూజా నృత్యం , జాతి స్వరం , శబ్దాలు , తరంగాలు , వర్ణాలు , పదాలు ,కీర్తనలు , తిల్లానాలు , నృత్య నాటకాలు , నృత్య నాటికలు ప్రదర్శించడం జరుగుతుంది .

సిద్దేంద్ర యోగి రచించిన భామ కలాపం , భాగవతుల రామయ్య గొల్ల కలాపం . వేదాంతం పార్వతీశం రచించిన రాసలీల దక్ష యజ్ఞం , అర్ధనారీశ్వర , చింతామణి , శివమోహిని , వెంపటి వెంకట నారాయణ రాసిన నాటకాలు .
“ఎరుక” నృత్య రూపకంలో సోదె ప్రధానంగా సాగుతుంది . జరిగింది , జరుగుతున్నది , జరగబోయేది అంటూ సోదెమ్మ చెప్పే సంఘటనల ఇతి వృత్తం . శివుడు అర్ధనారీశ్వరుడిగా మారిన విధానాన్ని భ్రుంగి శివుడుని అడిగి తెలుసుకోవడమే ఈ నృత్య నాటకం ఇతి వృత్తం . దక్షయజ్ఞం లో దక్షుడి కుమార్తె అయిన సతీదేవి తన తండ్రికి ఇష్టం లేకపోయినా శివుడిని వివాహం చేసుకుంటుంది . దక్షుడు చేస్తున్న యజ్ఞానికి ముల్లోకాలలోని అందరిని ఆహ్వానిస్తాడు కాని, శివ పార్వతులను ఆహ్వానించడు . పిలవని పేరంటానికి వెళ్లి తండ్రి ఇంట అవమానానికి గురి అవుతుంది . అది తట్టుకోలేక సతీదేవి అగ్నికి ఆహుతి అవుతుంది . అది తెలుసుకున్న శివుడు ఉగ్ర రూపుడై దక్ష యజ్ఞాన్ని నాశనం చేస్తాడు . అదే దక్ష యజ్ఞం .

హేమాద్రి చిదంబర దీక్షితులు రచించిన రెండు నృత్య రూపకాలు . గిరిజా కళ్యాణం , అర్ధనారీశ్వర . శివుడు తపస్సు చేసుకోవడం , మన్మధుడు శివుని తపస్సుకి భంగం కలిగించటం , అందుకు ఆగ్రహించిన పరమ శివుడు మన్మధుడిని భస్మం చేయడం జరుగుతుంది . శివ పార్వతుల కళ్యాణం తో కథ ముగుస్తుంది . అర్ధనారీశ్వర నృత్య రూపకంలో గంగా – గౌరీ సంవాదం . పార్వతిదేవి ముందు జన్మలో దాక్షాయణిగా జన్మించటం , ఆ తరవాత హిమవంతునికి పార్వతిగా పుట్టడం శివుని శరీరంలో అర్ధ భాగాన్ని పొందడం వంటి ఘట్టాలను వివరిస్తుంది .
వేదాంతం రామలింగ శాస్త్రీ రచించిన వినాయక చవితి , శ్రీనివాస కళ్యాణం , నర్తనశాల , వరలక్ష్మి వ్రతము , నవ దుర్గా విలాసము , ఉలూచి కళ్యాణం ,లకుమా సాంత్వనం వంటి 27 నృత్య నాటకాలు .

కె .వి . సత్యనారాయణ రచించిన మోహిని భస్మాసుర . శివుడి నుంచి వరం పొందిన వృకాసురుడు బాధ నుంచి దేవతలను రక్షించటానికి విష్ణు వు మోహినీ అవతారం ఎత్తడమే ఈ నృత్య నాటకం సారాంశం . బుద్ధం శరణం గచ్చామి. చారిత్రక పురుషుడైన బుద్ధుని జీవిత కథ. దానవ సామ్రాజ్యానికి అధిపతి అయిన మహిషాసురుడు నుంచి లోకాలని రక్షించటానికి ఆదిశక్తి కాళిమాతగా మారి మహిషాసురుడిని అంతం చేస్తుంది .ఇవే కాకుండా ఆలిమేలు మంగ వైభవం , శ్రీ రామ కథ , శ్రీ ఆంజనేయం నాటకాలు నృత్యాలు రచించారు కె .వి సత్యనారాయణ .
పసుమర్తి సూర్య నారాయణ రచించిన పద్మావతి పరిణయం . కలియుగదైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి , పద్మావతుల వివాహమే ఈ నృత్య రూపకం . పసుమర్తి వెంకటేశ్వర శర్మ మహిషాసుర మర్ధిని నృత్య నాటకాన్ని రచించారు .
.
నాటికలు ఆధునిక కాలంలో కూచిపూడి ప్రదర్శనలో ప్రాముఖ్యం పొందాయి . మారుతున్న కాలంతో పాటు ప్రదర్శన నిడివి , పాత్రల తీరు తెన్నుల విషయంలో మార్పు వచ్చింది . అరుణా భిక్షు వర్తమాన విషయాలతో రెండు నాటకాలను రచించడంతో పాటు రెండు నాటకాలను తెలుగులోనికి అనువదించడం జరిగింది. దండిభోట్ల వైకుంఠ నారాయణ మూర్తి రచించిన యుగయుగాల తిరుమల , తరతరాల తిరుమల , మీరా , ఆమ్రపాలి , అష్టవిధ నాయకలు , కుశ లవ చరిత్ర , సతీ తులసి , సుర సుందరీ వైభవం , మాతృ దేవోభవ వంతో 70 కి పైగా నృత్య నాటకాలు . . సుమనా కోడూరి రచించిన బంగారం , వాన ప్రస్థానం , బాబోయ్ దసరా వంటి నాటికలు రేడియోలో ప్రసారం అయిన నాటికలు .

ఈ విధంగా తెలుగులో ప్రత్యేకత ఉన్న నాటకం ప్రక్రియలో రచయితలే కాకుండా శాస్త్రీయ నాట్యాన్ని అభ్యసించిన నర్తకులు కూడా రచనలు చేయడం జరిగింది . నాట్యం ప్రదర్శనకి చెందినది . ఒకరు రచించిన రచనని నృత్య నాటకంగా మలచడం కంటే వారే రచయితలుగా రూపొందించుకున్న నాటకాన్ని నృత్యంగా మలచడం అనేది మరింత సులుభతరంఅవుతుంది . వారికి నచ్చిన విధంగా సాహిత్యాన్ని మలుచుకోవడానికి అవకాశం కలుగుతుంది . తొలి తరం కూచిపూడి నర్తకులు మాత్రమే రచనలు చేసినట్లు తెలుస్తుంది . తర్వాత కొంత కాలం నర్తకులు రచనల వైపు అంతగా మక్కువ చూపలేదు . కానీ ఇప్పటికి నర్తకులే స్వయంగా రచనలు చేస్తున్న వారు ఉన్నారు . ప్రస్తుతం కాలంలో నర్తకులు సాహిత్యం లోని ప్రక్రియలలో రచనలు చేయడం జరుగుతుంది .

                                                                      -dr. లక్ష్మణ రావు ఆదిమూలం

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సాహిత్య వ్యాసాలు ​Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)