అమ్మ… ప్రేమ… అమ్మ ప్రేమ

– అభిలాష

 

అమ్మ అనే కమ్మని మాట లోనే వుంది అమృత ధార….

ప్రేమ పంచి పెంచి

లాలించి బుజ్జగించి

అభిమానాన్ని గోరు ముద్ద గా పెట్టే అమ్మకు

ఆ బ్రహ్మ కూడా దాసోహమేగా….

స్వార్ధం అంటే తెలియక గుప్పెడు గుండెలో

ఆకాశమంత ప్రేమను మాత్రమే దాచేది పంచేది అమ్మే కదా…

అమ్మ అని పిలిస్తే ఆప్యాయాన్ని అంతా ఆలంబనగా చేసిమనకి కొండంత అండగాతన గుండె పరిచి నడిపించి

కాపాడేది ఈ అమ్మ జన్మేగా….

మనకి కష్టమొస్తే తన కన్ను నీరు వర్షిస్తుందిఇది దేవునికైనా అసాధ్యమేగా…

మన కేరింత చూసి తన మనసు పులకించి విరబూస్తుంది

ఇది అమ్మ ప్రేమ లోని స్వచ్చతే కదా…

కర్ఖోటకుడిని సైతం కళ్ళల్లో పెట్టి చూసుకునే ఓర్పు అమ్మ ప్రేమేగా ….

గుండె మండేలా మాట్లాడినాగునపాలు దించినా

కిక్కురుమనక అనురాగం పంచేది అమ్మేగా…

కంట నీరు పెట్టించినా ఎంత వేదన మిగిల్చినా

మన కష్టంలో వేలు పట్టి వెన్ను తట్టి ఓదార్చేది అమ్మ

అనురాగమే కదా…

పాషాణ గుండెకి మమతని ధారబోసేది అమ్మే…

మన విజయానికి మనల్ని మించిసంబర పడి పండగ చేసుకునేది అమ్మ ప్రేమే…

తన పొత్తిళ్ళనే   మెత్తటి పాన్పు చేసి,

తన నును వెచ్చని ఒడిలో పొదువుకుని మనకి ప్రపంచాన్ని తెలియ చేసి,

తన గుండె చప్పుడుని జోల పాట గా మలచి,

వేలు పట్టి నడిపి, తన మాటలతో ముల్లోకాలను మనకు సాక్షాత్కరించి ,

ఆ జాబిల్లినే మన దోసిట్లో బొమ్మ గా మలచి…

లోకాన్ని తెలిపే తొలి గురువు గా…

మన జన్మకి తన ప్రాణాన్ని పణంగా పెట్టే

ఈ అమ్మ జన్మ ఇలలో ఒక అద్భుత వరం…
ఆడ జన్మకి గర్వ కారణం….

కవితలు, , Permalink

12 Responses to అమ్మ… ప్రేమ… అమ్మ ప్రేమ

Leave a Reply to ramana Cancel reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో